Anasuya: నీతో మాటలు అనవసరం, ఇకపై కలవనంతే... గుడ్ బై చెప్పేసిన అనసూయ!

Published : Nov 22, 2023, 01:20 PM ISTUpdated : Nov 22, 2023, 02:53 PM IST

అనసూయ ఇంస్టాగ్రామ్ స్టేటస్ అనుమానాలకు దారి తీసింది. ఆమె ఒకరికి వార్నింగ్ ఇచ్చింది. అనసూయకు కోపం రావటానికి కారణం ఏమిటనే చర్చ మొదలైంది.   

PREV
16
Anasuya: నీతో మాటలు అనవసరం, ఇకపై కలవనంతే... గుడ్ బై చెప్పేసిన అనసూయ!


మనసులో ఏమున్నా దాచుకోవడం తెలియదు అనసూయకు. సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కి చెప్పేస్తుంది. అది ఆనందమైనా... బాధైనా. ఆ మధ్య గట్టిగా ఏడుస్తున్న వీడియో షేర్ చేసింది. గుక్కపట్టి ఏడ్చేంత బాధ ఏమొచ్చిందని ఫ్యాన్స్ కిందా మీదా పడ్డారు. విషయం తెలుసుకుంటే... అప్పుడప్పుడు అలా ఏడ్చి గుండెల్లో భారం తగ్గించుకోవాలని చెప్పింది. 

 

26

ఇక తన ఫోటో షూట్స్, సినిమా అప్డేట్స్, టూర్స్, ఫ్యామిలీ పార్టీలు, ఈవెంట్స్... ఒకటేంటి ప్రతి సంగతి సోషల్ మీడియాలో పెట్టేస్తుంది. అనసూయ పోస్ట్ పెడితే క్షణాల్లో వైరల్ అవుతుంది. దానికి కారణం ఫ్యాన్స్ తో పాటు ఆమెకు హేటర్స్ భారీగా ఉన్నారు. వారు నెగిటివ్ కామెంట్స్ చేస్తుంటారు. ఎవరెన్ని విమర్శించినా పట్టించుకోదు. పైగా కౌంటర్ వేస్తుంది. 

36
Anasuya bharadwaj

అనసూయలో ఉన్న మరో లక్షణం ఎదుటివాళ్ళలో ఏదైనా నచ్చకపోయినా, తనను బాధించేలా ప్రవర్తిస్తే వెంటనే స్పందిస్తుంది. కౌంటర్ ఇచ్చేస్తుంది. అనసూయ డ్రెస్సింగ్ పలుమార్లు ట్రోల్ కి గురైంది. అనసూయ వెనక్కి తగ్గింది లేదు. నా డ్రెస్ నా ఇష్టం అంటూ ఇచ్చిపడేసింది. 

 

46
Anasuya bharadwaj

తాజాగా అనసూయను ఎవరో హర్ట్ చేశారు. ఆమె మర్యాదకు భంగం కలిగించారు. దీంతో ఇకపై వాళ్ళను కలిసేది లేదంటుంది. ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో అనసూయ... 'ఎడబాటే అగౌరవానికి నా సమాధానం. ఇక నేను స్పందించను, వాదులాడను, నాటకీయత ఉండదు. సింపుల్ గా కలవడం మానేస్తా' అని కామెంట్ పోస్ట్ చేసింది. 

56

అనసూయ ఎవరినో ఉద్దేశించి ఈ కామెంట్స్ చేస్తున్నారని క్లియర్ గా అర్థం అవుతుంది. అది ఎవరు అనేది సస్పెన్సు. ఒకసారి అనసూయ నిర్ణయం తీసుకుంది అంటే అది కఠినంగా ఉంటుంది. కాబట్టి అనసూయ ఎవరికి గుడ్ బై చెప్పిందనేది ఆసక్తికరంగా మారింది. 


 

66
photo credit-anasuya insta

నటిగా అనసూయ ఫుల్ బిజీగా ఉంది. ఈ ఏడాది అనసూయ నటించిన రంగమార్తాండ, విమానం, ప్రేమ విమానం, పెదకాపు 1 చిత్రాలు విడుదలయ్యాయి. నెక్స్ట్ ఆమె పుష్ప 2తో పాటు పలు క్రేజీ ప్రాజెక్ట్స్ లో నటించనుంది. అనసూయ యాంకరింగ్ మానేసిన సంగతి తెలిసిందే... 

 

Poonam Bajwa: పూనమ్ బజ్వా టాప్ 10 హాట్ లుక్స్... బన్నీ హీరోయిన్ నుండి ఊహించని కోణం!

Read more Photos on
click me!

Recommended Stories