Published : Nov 22, 2023, 11:43 AM ISTUpdated : Nov 22, 2023, 04:05 PM IST
జబర్దస్త్ వర్ష జెండర్ పై అనేక అనుమానాలు ఉన్నాయి. బుల్లితెర షోలలో ఆమెది లేడీ గెటప్ అంటూ వేధిస్తూ ఉంటారు. ఒకటి రెండు సార్లు ఆమె సీరియస్ కాగా మరోసారి అదే పరిస్థితి ఎదురైంది.
జబర్దస్త్ లేడీ కమెడియన్స్ లో వర్ష ఒకరు. ఈమె గతంలో సీరియల్ యాక్ట్రెస్. అక్కడ గుర్తింపు రాకపోవడంతో జబర్దస్త్ లో అడుగుపెట్టింది. ఈ లెజెండరీ కామెడీ షోలో అనతికాలంలో వర్ష ఫేమ్ తెచ్చుకుంది. జబర్దస్త్ కమెడియన్ గా సెటిల్ అయ్యింది.
27
Jabardasth Varsha
ఒకప్పుడు జబర్దస్ లో లేడీ ఆర్టిస్ట్స్ ఉండేవాళ్ళు కాదు. అబ్బాయిలు లేదా ట్రాన్స్ జెండర్స్ ఈ వేషాలు వేసేవారు. రోహిణి, సత్యశ్రీ, రీతూ చౌదరి వంటి అమ్మాయిలు తర్వాత కాలంలో జబర్దస్త్ లోకి వచ్చారు. వారందరి కంటే వర్ష త్వరగా ఫేమస్ అయ్యింది. ఆడియన్స్ తో గుర్తింపు తెచ్చుకుంది.
37
Jabardasth Varsha
అయితే వర్ష కూడా లేడీ కాదు అనే అనుమానాలు ఉన్నాయి. ఈ డౌట్స్ తోటి కమెడియన్స్ లేవనెత్తారు. స్కిట్స్ లో వర్షను లేడీ గెటప్ అంటూ టీజ్ చేస్తారు. అబ్బాయి కాదు అమ్మాయని ఆట పట్టిస్తారు. కొన్ని సార్లు ఆమె ఫన్నీగా తీసుకుంది. కొన్నిసార్లు సీరియస్ అయ్యింది.
47
Jabardasth Varsha
లేడీ గెటప్ అన్నాడని ఓ షోలో ఇమ్మానియేల్ పై వర్ష అగ్గిమీద గుగ్గిలం అయ్యింది. ప్రతిసారి అంటే బాధేస్తుందని అక్కడ నుండి వెళ్ళిపోయింది. తనను అబ్బాయి, లేడీ గెటప్ అంటే వర్షకు నచ్చదు. ఆమె బాగా నొచ్చుకుంటుంది. ఆమె జెండర్ పై అనుమానాలు ఉండగా... లేటెస్ట్ షోకి వచ్చి ఆడియన్స్ లో ఒక అమ్మాయి షాక్ ఇచ్చింది.
57
Jabardasth Varsha (Photo Credit: Suman Tv)
సుమన్ టీవీ లో ప్రేమ కావాలి పేరుతో ఒక యూత్ఫుల్ షో స్టార్ట్ చేశారు. ఈ షోకి ఇమ్మానియేల్-వర్ష యాంకర్స్ గా వ్యవహరిస్తున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్ కి కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు హాజరయ్యారు. అమ్మాయిల్లో ఒకరిని తన గురించి చెప్పాలని ఇమ్మానియేల్ అడిగాడు. నువ్వు స్మార్ట్ అనగానే... ఇమ్మానియేల్ కి కూడా ఒప్పుకోలేదు. నాకు సిగ్గు లేదనుకో, నీకు కూడా లేదా అనేశాడు.
67
Jabardasth Varsha (Photo Credit: Suman Tv)
తర్వాత వర్ష... తన గురించి చెప్పాలని అమ్మాయిలను అడిగింది. ఓ అమ్మాయి.. అసలు నువ్వు అమ్మాయేనా? అనేసింది. దాంతో షాక్ తిన్న ఇమ్మానియేల్ దూరంగా పరిగెత్తాడు. వర్షకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. వర్ష జెండర్ పై జనాల్లో అనుమానాలు ఉన్నాయని ఈ ఘటనతో తేలిపోయింది.
77
మొత్తానికి వర్ష అమ్మాయా? అబ్బాయా అనే కామెంట్లు కామెడీని పంచడానికి బాగా ఉపయోగపడుతుంది. వాటిని ఆమె కూడా అంతే స్పోర్టీవ్‌గా తీసుకుని ముందుకు సాగుతుంది. తనదైన కామెడీతో నవ్వులు పూయిస్తుంది.