డెడికేషన్ అంటే ఇలా ఉండాలి.. 24 గంటలు ఫ్లైట్ లో జర్నీ.. అయినా జిమ్ లో నటి శ్రియా రెడ్డి వర్కౌట్స్..

First Published | Jun 29, 2023, 5:47 PM IST

తమిళ నటి శ్రియా రెడ్డి చాలా కాలం తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించబోతోంది. భారీ ప్రాజెక్ట్స్ లో కీలక పాత్రలతో అదరగొట్టేందుకు సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలోనూ సందడి చేస్తోంది. 
 

కోలీవుడ్ కు చెందిన పవర్ ఫుల్ లేడీ శ్రియా రెడ్డి (Sriya Reddy)  టాలీవుడ్ లో వరుస పెట్టి చిత్రాలు చేస్తోంది. గతంలో ’అప్పుడప్పుడు’, సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది’ సినిమాలో మెరిసింది. రెండు చిత్రాల్లో మెరిసి తమిళ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. 
 

ప్రస్తుతం కోలీవుడ్ లో వరుస పెట్టి సినిమాలు చేస్తోంది. ఈ క్రమంలో మళ్లీ తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. తెలుగులో రూపుదిద్దుకుంటున్న భారీ చిత్రాల్లో శ్రియా రెడ్డి కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సందర్భంగా స్టన్నింగ్ లుక్ లో అలరించేందుకు జిమ్ లో వర్కౌట్స్  చేస్తోంది.
 


పవన్ కళ్యాణ్ నటిస్తున్న OG లో శ్రియా పవర్ ఫుల్ రోల్ లో కనిపించబోతోంది. సుజీత్ ఈమె పాత్రను చాలా పవర్ ఫుల్ గా డిజైన్ చేశారని తెలుస్తోంది. అలాగే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలోని Salaar లోనూ ముఖ్య పాత్రలో నటించింది. ఈ రెండు యాక్షన్ చిత్రాలుగా రాబోతున్నాయి. 
 

ఈ సందర్భంగా తన పాత్రలకు న్యాయం చేసేందుకు, యాక్షన్ సీన్లలోనూ ఒదిగిపోయేందుకు శ్రియా జిమ్ లో హెవీ వర్కౌట్ చేస్తోంది. తాజాగా అందుకు సంబంధించిన కొన్ని ఫొటోలను పంచుకుంది. జిమ్ లో వర్కౌట్స్  గ్యాప్ లో స్టన్నింగ్ లుక్ లో ఫోజులిచ్చింది. జిమ్ మేర్ లో అదరగొట్టింది.
 

అయితే శ్రియా రెడ్డి తన పాత్రలో ఒదిగిపోయేందుకు చాలా హోమ్ వర్క్ చేస్తుందని అర్థం అవుతోంది. తన రాబోయే చిత్రాల కోసం బాగా కష్టపడుతోంది. 24 గంటలు ఫ్లైట్ లో జర్నీ చేసిన తర్వాత కూడా ఎలాంటి విరామం లేకుండా నేరుగా జిమ్ కు వెళ్లినట్టు తెలిపింది. 

ఆ ఫొటోలను చూసిన ఫ్యాన్స్  ఫిదా అవుతున్నారు. డెడికేషన్ అంటే ఇలా ఉండాలంటూ పలువురు అభినందిస్తున్నారు. ఇక శ్రియా రెడ్డి ఓజీ, సలార్ లో ఎలాంటి పాత్రల్లో అలరించబోతుందో చూడాలి. అలాగే శ్రియా రెడ్డి తమిళంలోనూ ‘అందవ కానోం’ చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఇవన్నీ షూటింగ్ దశలో ఉన్నాయి. 
 

Latest Videos

click me!