అనసూయ క్యూట్‌ అందంతో రెచ్చగొట్టే పోజులు.. దీపావళి పండుగని భర్త, పిల్లలతో కలిసి ఎంత బాగా సెలబ్రేట్‌ చేసుకుందో..

Published : Nov 13, 2023, 08:26 AM ISTUpdated : Nov 13, 2023, 09:21 AM IST

హాట్‌ యాంకర్‌ అనసూయ భరద్వాజ్‌ దీపావళి సెలబ్రేషన్‌లో మునిగిపోయింది. పండగంతా మా వద్దే ఉందనేలా ఆమె సెలబ్రేట్‌ చేసుకోవడం విశేషం. అయితే ఇందులో ఆమె మేకప్‌ లేకుండా అసలు అందంతో మతిపోగొడుతుంది.  

PREV
110
అనసూయ క్యూట్‌ అందంతో రెచ్చగొట్టే పోజులు.. దీపావళి పండుగని భర్త, పిల్లలతో కలిసి ఎంత బాగా సెలబ్రేట్‌ చేసుకుందో..

యాంకర్‌ అనసూయ.. పండుగలను చాలా ప్రత్యేకంగా సెలబ్రేట్‌ చేసుకుంటుంది. పండగ కళ మొత్తం ఆమెలోనే కనిపిస్తుంది. ఇప్పుడు దీపావళి సెలబ్రేషనే అందుకు నిదర్శనం. పట్టు చీర కట్టి తెలుగు అమ్మాయిలా మెరిసిపోతుంది అనసూయ.

210

ఫ్యామిలీతో కలిసి అనసూయ దివాళిని సెలబ్రేట్‌ చేసుకుంది. ఇంటినంతా బంతిపూలతో అలంకరించుకుంది. దీపాలు వెలిగించి ఇంటిలో కాంతులు నింపింది. భర్త, పిల్లలతో కలిసి సందడి చేసింది. బాణాసంచా కాల్చింది. 

310

ఓ వైపు ఇంట్లో దీపాల వెలుగులు, మరోవైపు బాణాసంచా వెలుగులతో అనసూయ ఇళ్లు రెట్టింపుగా వెలిగిపోయింది. దీంతో అనసూయలో ఆనందానికి అవదుల్లేవని చెప్పొచ్చు. ఈ సందర్భంగా తన భర్త సుశాంక్‌తో కలిసి ఆమె ఆప్యాయంగా ఫోటోలు దిగింది.

410

ఇక ఇందులో అనసూయ చాలా వరకు నేచురల్‌ అందంతో కనిపించింది. పెద్దగా మేకప్‌లేకుండా ఆమె కనిపించింది. అయినా అనసూయ హాట్‌ నెస్‌ మాత్రం రెట్టింపు అయ్యిందని చెప్పొచ్చు. దీనికితోడు ఆమె కవ్వింపు చర్యలు మరింతగా హంట్‌ చేస్తున్నాయి. కుర్రాళ్లని టెంప్ట్ చేస్తున్నాయి. 

510

యాంకర్‌గా పాపులర్‌ అయ్యింది అనసూయ. ఆమె నటిగా సక్సెస్‌ కాలేని సమయంలో జబర్దస్త్ షో ఆమెకి లైఫ్‌ ఇచ్చింది. పేరుని తెచ్చింది. టాలీవుడ్‌లో పాపులర్‌ చేసింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన క్రేజ్‌ని తెచ్చింది. 
 

610

నిజం చెప్పాలంటే స్టార్‌ హీరోయిన్లకి లేని క్రేజ్‌ అనసూయ సొంతం. అదే సమయంలో చాలా వరకు ట్రోల్స్ కి గురవుతుందీ భామ. అనసూయ అంటే కాంట్రవర్సీ క్వీన్‌గా మారిపోతుందా అనేంతగా ఆమె చుట్టూ వివాదాలు రాజుకుంటాయి. వాటికి ఆమె రియాక్షన్‌ కూడా అంతే ఘాటుగా ఉండటంతో ఆ రచ్చ మరింత పెరుగుతుంది.
 

710

అయితే ఇటీవల ఆమె రియలైజ్‌ అయ్యింది. ప్రతి దానికి రియాక్ట్ కావద్దని నిర్ణయించుకుంది. అందుకే చాలా కామ్‌ గా ఉంటుంది. అయితే సందర్భం వచ్చినప్పుడు మాత్రం నిర్మొహమాటంగా ఇవ్వాల్సినంతకంటే రెట్టింపు ఇస్తూ ట్రోలర్స్ కి బుద్ది చెప్పే ప్రయత్నం చేస్తుంది అనసూయ. 
 

810

ప్రస్తుతం ఆమె నటిగా బిజీగా ఉంది. యాంకరింగ్‌కి ఫుల్‌స్టాప్‌ పెట్టింది. నాలుగైదు పెద్ద సినిమాల్లో చేస్తుంది అనసూయ. నటిగా ఆమెకి మంచి పేరొస్తుంది. గౌరవం దక్కుతుంది. పారితోషికంగా కూడా గట్టిగానే అందుకుంది. దీంతొ సినిమాలకే ఫిక్స్ అయ్యింది అనసూయ.

910

అయితే బుల్లితెరపై రావాలని ఉంది. కానీ చాలా సెలక్టీవ్‌గా చేయాలనుకుంటుంది. ఆ మధ్య జీ తెలుగు ఈవెంట్‌లో మెరిసింది అనసూయ. అలనాటి తారల సాంగ్‌లకు డాన్సులేస్తూ రచ్చ చేసింది. ఈవెంట్‌ని స్పెషల్‌గా మార్చింది.
 

1010

అనసూయ దీపావళి సెలబ్రేషన్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఆమె సహజమైన అందంతో ఆకట్టుకుంటుంది. సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories