పొట్టి బట్టలేసుకుని ఆడవాళ్ల పరువు తీస్తున్నావ్‌.. `జబర్దస్త్` యాంకర్‌ అనసూయ కౌంటర్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే

Published : Apr 04, 2022, 12:21 PM IST

`జబర్దస్త్` యాంకర్‌ అనసూయ మరోసారి రెచ్చిపోయింది. తన డ్రెస్‌పై అనుచిత కామెంట్లు చేసిన నెటిజన్ కి పిచ్చెక్కిపోయే కౌంటరిచ్చింది. మళ్లీ ఇలాంటి కామెంట్లు చేయాలంటే భయపడేలా చేసింది. ప్రస్తుతం ఇది వైరల్‌ అవుతుంది. 

PREV
16
పొట్టి బట్టలేసుకుని ఆడవాళ్ల పరువు తీస్తున్నావ్‌..  `జబర్దస్త్` యాంకర్‌ అనసూయ కౌంటర్‌కి పిచ్చెక్కిపోవాల్సిందే

యాంకర్‌ అనసూయ అనేక మార్లు విమర్శలు ఎదుర్కొంది. తన డ్రెస్‌పై ప్రతి సారి ఎవరో ఒకరు కామెంట్‌ చేస్తూనే ఉంటారు. పొట్టి డ్రెస్‌ వేసుకున్నావంటూ, ఫ్యామిలీ కలిసి చూసే షోలో ఇలాంటి దుస్తులేంటి? అంటూ కామెంట్స్ చేసే వాళ్లే ఎక్కువ. దీన్ని అంతే ధైర్యంగా ఎదుర్కొంటుంది అనసూయ. అదే స్థాయిలో స్పందిస్తూ కొంటె నెటిజన్ల ఆట కట్టిస్తుంది. దిమ్మతిరిగే కౌంటర్లతో మైండ్‌ బ్లాంక్‌ చేస్తుంది. 
 

26

మరోవైపు అనసూయ విమర్శలు తప్పలేదు. ఆమె దుస్తులపై మరోసారి నోరు పారేసుకున్నాడో నెటిజన్లు. ఆమె డ్రెస్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఆమెకే ట్యాగ్‌ చేశాడు. `అనసూయ గారు మీరు ఇద్దరు పిల్లల తల్లి. ఇంకా ఇలాంటి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటావా. తెలుగు ఆడపడుచుల పరువు తీస్తున్నావు` అంటూ కన్నీరు కారుస్తున్న ఎమోజీని పంచుకున్నాడు సదరు నెటిజన్. 

36

దీనిపై అనసూయ స్పందించింది. ఘాటుగా కౌంటర్‌ ఇచ్చింది. `దయచేసి మీరు మీ పని చూసుకోండి. నన్ను నా పనిని చేసుకోనివ్వండి. మీరు ఇలా ఆలోచించి మగజాతి పరువు తీస్తున్నారు` అంటూ మైండ్‌ బ్లోయింగ్‌ రిప్లై ఇచ్చింది. ఈ దెబ్బకి ఆ నెటిజన్ కి పిచ్చెక్కిపోవాల్సిందే అని చెప్పొచ్చు. 

46

అయితే ఈ విషయంలో నెటిజన్లు సైతం అనసూయకి మద్దతుగా నిలుస్తున్నారు. ఆ నెటిజన్ ని ఏకి పడేస్తున్నారు. ఆమె ఏ డ్రెస్‌ వేసుకుంటే మీకేంటి అంటూ ఆడుకుంటున్నారు. అదే సమయంలో ఇలాంటి వాళ్ల మాటలు పట్టించుకోవద్ద అనసూయ అంటూ నెటిజన్లు ఈ హాట్‌ యాంకర్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. మీకు అండగా ఉంటామని భరోసా ఇస్తున్నారు.

56

హాట్‌ యాంకర్‌ అనసూయ `జబర్దస్త్` షోకి యాంకర్‌గా చేస్తున్న విషయం తెలిసిందే. ప్రారంభం నుంచి ఆమె యాంకర్‌గా కొనసాగుతున్నారు. ఈ షో కోసం మోడ్రన్‌గా ముస్తాబై ఫోటోలకు పోజులిస్తుంది. హాట్‌ హాట్‌ ఫోటోలతో నెటిజన్లని, ఆమె అభిమానులను అలరిస్తుంది. అదే సమయంలో కామెడీ షో కి మంచి క్రేజ్‌ని తీసుకొస్తుంది. ఈ షో ఇంతగా సక్సెస్‌ కావడంలో అనసూయ పాత్ర కూడా ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆదే సమయంలో ఆమె గ్లామర్‌ ఫోటోలకు లక్షలాది మంది అభిమానులున్నారంటే అతిశయోక్తి కాదు. 

66

మరోవైపు నటిగానూ తనని తాను చాటుకుంటోంది అనసూయ. `రంగస్థలం`లో రంగమ్మత్తగా చేసి ఆద్యంతం ఆకట్టుకుంది. పాత్ర పేరునే తన పేరుగా మారిపోయేంతగా గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అరడజనుకుపైగా చిత్రాల్లో నటిస్తుంది. ఇటీవల `ఖిలాడీ`లో మెరిసిన ఆమె ప్రస్తుతం `ఆచార్య`, `రంగమార్తాండ`, `పుష్ప 2` వంటి సినిమాలు చేస్తుంది. తన మెయిన్‌ లీడ్‌గా `దర్జా` సినిమా చేస్తుంది అనసూయ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories