రంగమ్మత్త లాంటి పాత్ర మళ్ళీ చేయను, ఇకపై గ్లామర్ పెంచుతా..దానికి తగ్గట్లుగా డబ్బు తీసుకుంటా, అనసూయ బోల్డ్‌గా

Published : Jul 24, 2024, 09:51 PM ISTUpdated : Jul 24, 2024, 09:54 PM IST

అనసూయ అంటే అందం, అభినయంతో పాటు కాంట్రవర్సీలు కూడా గుర్తుకు వస్తాయి. సోషల్ మీడియాలో అనసూయ నిత్యం ఏదో విధంగా చర్చల్లో ఉంటుంది.

PREV
16
రంగమ్మత్త లాంటి పాత్ర మళ్ళీ చేయను, ఇకపై గ్లామర్ పెంచుతా..దానికి తగ్గట్లుగా డబ్బు తీసుకుంటా, అనసూయ బోల్డ్‌గా

అనసూయ అంటే అందం, అభినయంతో పాటు కాంట్రవర్సీలు కూడా గుర్తుకు వస్తాయి. సోషల్ మీడియాలో అనసూయ నిత్యం ఏదో విధంగా చర్చల్లో ఉంటుంది. ట్రోలింగ్ జరిగినా అనసూయ ధీటుగానే ఎదుర్కొంటుంది. అనసూయ మీడియా ముందుకు వస్తే ఏదో ఒక బోల్డ్ స్టేట్మెంట్ వదిలే వెళుతుంది. 

26

రీసెంట్ గా అనసూయ సింబా అనే చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఈ చిత్ర ట్రయిలర్ లాంచ్ ఈవెంట్ లో అనసూయ పాల్గొంది. మీడియా అడిగిన అన్ని ప్రశ్నలకు అనసూయ సమాధానం ఇచ్చింది. ఓ మీడియా ప్రదతినిధి అడిగిన ప్రశ్నకు అనసూయ ఆసక్తికరంగా బదులిచ్చింది. మీరు చాలా ఆఫర్స్ రిజెక్ట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు అని ప్రశ్నించింది. 

36

అనసూయ సమాధానం ఇస్తూ.. రీపీటెడ్ గా ఒకే తరహా పాత్రలు ఇస్తున్నారు. ఒక సినిమాలో చేసిన పాత్రని పోలినట్లు మరో పాత్ర ఉండకూడదనుకుంటా. అలాంటివే వచ్చినప్పుడు రిజెక్ట్ చేయక తప్పడం లేదు. ఉదాహణకి రంగస్థలం చిత్రంలో రంగమ్మత్త పాత్ర తర్వాత అదే విధంగా చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ నేను ఒప్పుకోలేదు. క్షణం తర్వాత పోలీస్ పాత్రలు కూడా వస్తున్నాయి. కానీ నేను చేయను. 

46

నేను సైన్ చేసిన చిత్రాలు పూర్తి చేసేశాను. ఇప్పుడు నా చేతిలో ఉన్నవి రెండు మాత్రమే అని అనసూయ తెలిపింది. నేను ఎక్కువగా సినిమాలకు ఒప్పుకోకపోవడానికి కారణం కూడా ఉంది. నా గ్లామర్ ని ఎక్కువగా ప్రదర్శించాలని అనుకుంటున్నా. అందులో తప్పు లేదు. నేను గ్లామర్ మైంటైన్ చేసినన్ని రోజులు అలాంటి పాత్రలు వస్తే చేస్తా. 

56
Anasuya Bharadwaj

నా గ్లామర్ చూపించే విషయంలో నేను సిగ్గుపడడం లేదు. ఎందుకంటే ఇది నా బాడీ. నాలాగా ఎవరూ ఉండరని నేను అనుకుంటా అంటూ అనసూయ బోల్డ్ గా బదులిచ్చింది. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు అని తెలిపింది. 

66

రెమ్యునరేషన్ విషయంలో కూడా ఏమాత్రం తగ్గను అని అనసూయ పేర్కొంది. నా క్యారెక్టర్ కి తగ్గట్లుగా దిమ్మతిరిగే పారితోషికం అడుగుతా అని అనసూయ తెలిపింది. అనసూయ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. 

Read more Photos on
click me!

Recommended Stories