ఓటీటీలో `హరోంహర` ఇండియావైడ్ ట్రెండింగ్‌.. సుధీర్‌ బాబు కెరీర్ గాడినపడ్డట్టేనా?

Published : Jul 24, 2024, 08:39 PM ISTUpdated : Jul 24, 2024, 08:51 PM IST

మహేష్‌ బాబు బావ, హీరో సుధీర్‌ బాబు వరుస పరాజయాల అనంతరం ఇటీవల `హరోంహర`తో మెప్పించాడు. అయితే ఇది ఓటీటీలో మాత్రం రచ్చ చేస్తుంది.   

PREV
15
ఓటీటీలో `హరోంహర` ఇండియావైడ్ ట్రెండింగ్‌.. సుధీర్‌ బాబు కెరీర్ గాడినపడ్డట్టేనా?

హీరో సుధీర్‌బాబుకి చాలా ఏళ్లుగా సరైన హిట్‌ లేదు. ఆయన చాలా రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నాడు, కానీ ప్రతి సారి డిజప్పాయింటే ఎదురవుతుంది. వరుస పరాజయాలతో ఆయన ఇమేజ్‌ బాగా డౌన్‌ అయ్యింది. మార్కెట్‌ కూడా పడిపోయే పరిస్థితి వచ్చింది. 

25
Harom Hara

ఈ క్రమంలో ఇటీవల `హరోంహర` చిత్రంతో ఆడియెన్స్ ముందుకు వచ్చాడు సుధీర్‌బాబు. మాస్‌యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ చిత్రం థియేటర్లలో మంచి ఆదరణ పొందింది. విమర్శకుల ప్రశంసలందుకుంది. కమర్షియల్‌గా పెద్ద హిట్‌ కాకపోయినా, క్రిటికల్‌గా మెప్పించింది. మొత్తంగా సుధీర్‌బాబుకి మంచి రిలీఫ్‌నిచ్చిందని చెప్పొచ్చు. 

35

థియేటర్‌లో ఫర్వాలేదనిపించిన ఈ చిత్రం ఇటీవలే ఓటీటీలోకి వచ్చింది. ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అనే సందేహం ఉండేది. కానీ అక్కడ కూడా `హరోంహర` ఆకట్టుకుంటుంది. ఇంకా చెప్పాలంటే దుమ్మురేపుతుంది. ఈ మూవీ ఇప్పుడు ఇండియా వైడ్‌గా ట్రెండింగ్‌లోకి వచ్చింది. 
 

45

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సినిమా ఇప్పుడు దేశవ్యాప్తంగా ట్రెండింగ్ అవుతోంది. కేవలం తెలుగు ప్రేక్షకులే కాక దేశవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేక్షకులు ఈ చిత్రాన్ని వారం రోజులుగా ట్రెండింగ్ లో కొనసాగిస్తున్నారు. బలమైన కథ, ఆర్టిస్టుల అద్భుతమైన నటన, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటోంది. అమెజాన్‌లో ఇది దుమ్మురేపుతుంది. 

55
Harom Hara

ఇక ఈ చిత్రంలోసుధీర బాబుకి జోడీగా మాల్విక శర్మ హీరోయిన్‌గా నటించింది. సునీల్‌ ముఖ్య పాత్రలో నటించారు. గ్నాన సాగర్‌ దర్శకత్వం వహించారు. సుమంత్‌ నాయుడు నిర్మించిన చిత్రమిది. చైతన్‌ భరద్వాజ్‌ సంగీతం అందించారు. ఆయన బీజీఎం హైలైట్ గా నిలిచిన విషయం తెలిసిందే. `పుష్ప` తరహాలో ఉన్న ఈ మూవీ విశేష ఆదరణ పొందుతుండటం విశేషం. దీంతో ఇక సుధీర్‌ బాబు బౌన్స్ బ్యాక్‌ అయినట్టే అని చెప్పొచ్చు.  

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories