నాగిని కళ్లతో డెవిల్‌ క్యాట్‌లా మారి షాకిస్తున్న రంగమ్మత్త..మళ్లీ విచిత్రమైన బ్లౌజ్‌లో అనసూయ కిల్లింగ్‌ పోజులు

First Published | Nov 20, 2023, 9:39 PM IST

అనసూయ భరద్వాజ్‌.. టీవీ మానేసినప్పట్నుంచి సామాజిక మాధ్యమాల్లో మరింత యాక్టివ్‌గా మారింది. అదే సమయంలో వివాదాలకు కేరాఫ్‌గానూ నిలుస్తుంది. అదే సమయంలో ఫోటో షూట్లతోనూ హాట్‌ టాపిక్‌ అవుతుంది. 
 

యాంకర్‌ అనసూయ(Anchor Anasuya).. సినిమాల్లో అడపాదడపా మెరుస్తుంది. ఆమె ఏడాదికి రెండు మూడు సినిమాలతో అలరిస్తుంది. కానీ సోషల్‌ మీడియాలో మాత్రం రెగ్యూలర్‌గా యాక్టివ్‌గా ఉంటుంది. తన ఫోటో షూట్లు, వీడియోలతో అలరిస్తుంది. అప్పుడప్పుడు నెటిజన్లపై ఫైర్‌ అవుతూ వివాదాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. 
 

అనసూయ(Anasuya Bharadwaj) ఫోటోలు పంచుకుంటూ ఇంటర్నెట్‌ అటెన్షన్‌ మొత్తం ఆమెపైనే ఉంటుంది. అంతగా సర్‌ప్రైజ్‌ చేస్తుంది అనసూయ. తాజాగా ఈ బ్యూటీ చీరలో నయా ఫోటోలను పంచుకుంది. గ్లామర్‌ ట్రీట్‌ ఇచ్చింది. అయితే ఎప్పుడూ లేని విధంగా ఆమె షాకింగ్‌ లుక్‌లోకి మారిపోయింది. 


నాగిని కళ్లతో మత్తెక్కిస్తుంది. అదే సమయంలో కిల్లర్‌ లుక్‌లో కైపెక్కిస్తుంది. మరోవైపు మునిపంటితో పెదాలు కొరుకుతూ రెచ్చగొడుతుంది. టాప్‌ టూ బాటమ్‌ అందాలు తడుముతూ కవ్విస్తుంది. ఈ సందర్బంగా ఆమె ఫోటో షూట్‌కి సంబంధించిన వీడియోని పంచుకోగా సోషల్‌ మీడియా ఊగిపోతుంది. 

అదే సమయంలో ఇటీవల ఆమె విచిత్రమైన బ్లౌజ్‌ ధరించి హోయలు పోయింది. ఇప్పుడు కూడా అలాంటి చిత్రమైన బ్లౌజ్‌ ధరించింది. నడుము మడతలు చూపిస్తూ, నడుము అందాలు చూపిస్తూ రెచ్చిపోయింది. కుదురుగా ఉన్న కుర్రాళ్లని మరింతగా రెచ్చగొడుతుంది. Anasuya Photo Shoot.

అనసూయ.. ఇప్పుడు నటిగా బిజీగా ఉంది. ఆమె టీవీ షోస్‌ మానేసిన విషయం తెలిసిందే. పిల్లలు పెరిగే కొద్ది తనపై వచ్చే ట్రోల్స్, వల్గర్‌ కామెంట్లని వాళ్లు తీసుకోలేరని, తనని బ్యాడ్‌గా అనుకుంటారనే ఉద్దేశ్యంతో ఆమె టీవీ షోస్‌ మానేసినట్టు చెప్పింది. 

అదే సమయంలో జబర్దస్త్ షో నిర్వహకుల్లో కొందరి ప్రవర్తన విషయంలోనూ ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు, తన కంప్లెయింట్లని వారు తీసుకోకపోవడం వంటి కారణాలతో తాను జబర్దస్త్ ని వీడుతున్నట్టు ప్రకటించింది అనసూయ. 

ఇక ప్రస్తుతం తాను సినిమాల్లో బిజీగా ఉంది. టీవీల్లో, సోషల్‌ మీడియాలో అందాల విందు చేస్తానని, కానీ సినిమాల్లో మాత్రం బలమైన నటనకు స్కోప్‌ ఉన్న పాత్రలు, అలాంటి సినిమాలే చేస్తానని తెలిపింది. అలాంటి సినిమాలతోనే రాణిస్తుంది. 
 

ఇటీవల అనసూయ `పెదకాపు` చిత్రంలో మెరిసింది. ఇందులో నాయకురాలిగా కనిపించడం విశేషం. సినిమా చివర్లో ఆమె పాత్ర రివీల్‌ అయ్యింది. ఉన్న కాసేపు అయినా అందరి అటెన్షన్‌ తనవైపు తిప్పుకునేలా తన పాత్ర ఉండటం విశేషం. 
 

అంతకు ముందు `ప్రేమ విమానం` చిత్రంలో నటించింది. ఇందులో పేదింటి మహిళగా నటించింది. స్ట్రగులింగ్‌ లేడీగా మెరిసింది. అద్భుతమైన నటనతో మెప్పించింది. మంచి ప్రశంసలందుకుంది. 
 

అయితే అంతకు ముందు `విమానం` అనే చిత్రంలోనూ ఆమె నటించడం విశేషం. అయితే అందులో వేశ్యగా కనిపించింది. తను మోసపోవడంతో ఇలా వేశ్యగా మారిన అమ్మాయిగా మెరిసింది. తనదైన నటనతో మెప్పించింది. ప్రశంసలందుకుంది. 
 

మరోవైపు `రంగమార్తాండ` చిత్రంలోనూ గయ్యాలి కోడలి తరహా పాత్రలో కనిపించింది. అందులోనూ తన పాత్రకి ప్రాణం పోసింది. పాత్రకి యాప్ట్ గా నిలిచింది. ఇలా పాత్ర ఏదైనా తనవంతు బెస్ట్ ఇస్తూ ఆకట్టుకుంటుంది అనసూయ. 

అయితే దేనికదే భిన్నమైన పాత్రలు చేస్తూ తనలోని విలక్షణ నటిని బయటకు తీసుకొస్తుంది. ఈ ఏడాది నటించిన నాలుగు సినిమాలు నాలుగు భిన్నమైనవే కావడం విశేషం. ఇలా మంచి నటిగా తనని తాను మలుచుకుంటుంది అనసూయ. 

ప్రస్తుతం ఆమె `పుష్ప2`లో నటిస్తుంది. ఈ మూవీ వచ్చే ఏడాది రానుంది. దాక్షాయణి పాత్రలో మెరవబోతుంది. నెగటివ్‌ షేడ్‌ ఉన్న పాత్ర ఇది. మొదటి భాగాన్ని మించి ఇందులో తన పాత్ర ఉంటుందని అనసూయ చెప్పిన విషయం తెలిసిందే. వచ్చే ఏడాది రచ్చ చేయబోతుందని చెప్పొచ్చు. 
 

దీంతోపాటు మరో రెండు మూడు సినిమాలతో అనసూయ బిజీగా ఉంది. అంతేకాదు తమిళం, మలయాళం నుంచి ఈ హాట్‌ యాంకర్‌కి ఆఫర్లు వస్తుండటం విశేషం. 
 

Latest Videos

click me!