Anasuya : ముద్దులతో ముంచేస్తున్న బుల్లితెర బ్యూటీ ‘అనసూయ’.. ల్యాంప్ లైట్ లో వెలిగిపోతున్న ‘దాక్షాయణి’

Published : Feb 14, 2022, 11:05 AM ISTUpdated : Feb 14, 2022, 11:13 AM IST

బులితెర స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ (Anasuya) తన కేరీర్ లో ఒక్కో మెట్టు ఆచితూచీ ఎక్కుతోంది. స్టార్ హీరోల సినిమాల్లో విభిన్న పాత్రల్లో కనిపిస్తూ తన క్రేజ్ ను పెంచుకుంటోంది. ఇటు సోషల్ మీడియాలోనూ తన గ్లామర్ తో  ఫాలోవర్లను ఖుషీ చేస్తోందీ బ్యూటీ.   

PREV
17
Anasuya : ముద్దులతో ముంచేస్తున్న బుల్లితెర బ్యూటీ ‘అనసూయ’.. ల్యాంప్ లైట్ లో వెలిగిపోతున్న ‘దాక్షాయణి’

బుల్లితెర నుంచి మెల్లమెల్లగా వెండితెరపై సెటిల్ అయ్యేందుకు అనసూయ ప్రయత్నిస్తున్నట్టు కనిపిస్తోంది. అదే స్థాయిలో అటు గ్లామర్ లో, నటనలోనూ వచ్చిన ఛాన్స్ ను సద్వినియోగం చేసుకుంటూ దూసుకుపోతోంది. 
 

27

ఇప్పటికే విభిన్నమైన పాత్రల్లో ఆమెకు అవకాశాలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో ద్రాక్షాయణి పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. సునీల్ భార్య పాత్రలో అనసూయ మొరటుగా నటించిన సంగతి తెలిసిందే. పుష్ప పార్ట్ 2 లో ఆమె రోల్ ఎలా ఉంటుందో అనే ఆసక్తి పెరిగింది. 
 

37

రీసెంట్ గా మాస్ మహారాజ రవితేజ (Ravi Teja)  ఖిలాడీ  (Khiladi) చిత్రంలో అనసూయ ‘చంద్రకళ’ పాత్రలో నటించి మంచి మార్కులు కొట్టేసింది.  ఖిలాడీ చిత్రం పోయిన శుక్రవారమే విడుదలై థియేటర్స్ లో సందడి చేస్తుండగా అనసూయ అపియరెన్స్ ప్రేక్షకులను మంరింత ఉత్సాహ పరుస్తోంది. 
 

47

ప్రస్తుతం అనసూయ లేడీ ఒరియేంటెడ్  సినిమాల వైపు కూడా అడుగులేస్తోంది. 2016లో వచ్చిన  ‘క్షణం’ మూవీలో  అడివి శేషు, అదా శర్మలతో కలిసి పోలీస్ రోల్ లో నటించింది. కొంత వరకు లెంథీ క్యారెక్టర్ పండించడంలో అనసూయ సక్సెస్ అయ్యింది. దీంతో ఆమెను లీడ్ రోల్ లో చూసే అవకాశాలు ముందు ముందు ఉన్నాయని పలువురు అంటున్నారు. 
 

57

అనసూయ మరో చిత్రం ‘దర్జా’. ఈ మూవీలో అనసూయ మాస్ లుక్ లో కనిపిస్తోంది. ఈ సినిమాలో అనసూయ లీడ్ రోల్ చేయనుంది. ఈ మూవీ చిత్రీకరణ పనులు ప్రారంభమయ్యాయి. దర్జా మూవీతో పుష్ప కాంబినేషన్ రిపీట్ అయినట్లయింది. పుష్ప మూవీలో సునీల్ భార్యగా అనసూయ నటించిన విషయం తెలిసిందే. 

67

దర్జా మూవీ ఫస్ట్ లుక్ వీడియోతో అనసూయ పాత్రపై ఓ క్లారిటీ వచ్చింది. మరి సునీల్ ఎలాంటి పాత్ర చేస్తున్నారనేది ఆసక్తికర అంశం. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా నవ్వులు పూయించిన సునీల్... ప్రస్తుతం నెగిటివ్ రోల్స్ చేస్తున్నారు. డిస్కో రాజా, కలర్ ఫోటో, పుష్ప చిత్రాలలో ఆయన విలన్ గా కనిపించారు. దర్జా చిత్రంలో కూడా ఇదే తరహా రోల్ చేసే అవకాశం కలదు
 

77

ఇక అనసూయ అందం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్లామర్ పరంగా అనసూయ ఒక రేంజ్ లో రచ్చ చేస్తోంది. తాజాగా ఓ రెస్టారెంట్ లో కూర్చుకొని అర్దరాత్రి వాలెంటైన్స్ డే సందర్భంగా తన ఫాన్స్ కోసం కొన్ని  ఫొటోలను షేర్ చేసింది. కిసెస్ ఇస్తూ ఫొటోలకు ఫోజులిచ్చింది. ల్యాంప్ లైట్ వెలుతురు అనసూయ అందం ఇంకా మెరిసిపోతోంది.
 

Read more Photos on
click me!

Recommended Stories