Samantha:'చైతూకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో'... ఏడాది తర్వాత అదే చేసిన సమంత

Published : Feb 14, 2022, 10:15 AM IST

సమంత-నాగ చైతన్య విడాకులు తీసుకుని నాలుగు మాసాలు దాటిపోయింది. ఇద్దరు టాప్ సెలబ్రిటీల మధ్య జరిగిన వ్యవహారం కావడంతో నెలలు గడుస్తున్నా టాపిక్ మాత్రం హాట్ టాపిక్ గానే ఉంది. ఇక గతంలో సమంత నాగ చైతన్యతో రిలేషన్షిప్ పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

PREV
17
Samantha:'చైతూకి విడాకులిచ్చి నన్ను పెళ్లి చేసుకో'... ఏడాది తర్వాత అదే చేసిన సమంత


కాగా సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్ గా ఉండే సమంత(Samantha)కు అభిమానుల నుండి అనేక రకాల ప్రశ్నలు ఎదురవుతూ ఉంటాయి. వాటికి సమంత సావధానంగా సమాధానం కూడా చెబుతుంది. 2020లో సమంతకు ఓ ఊహించని ప్రశ్న ఎదురైంది. సమంత ఓ గ్లామరస్ ఫోటో షేర్ చేయడంతో పాటు... ఫీలింగ్ గుడ్ అంటూ సదరు ఫోటోపై కామెంట్ పెట్టారు. 

27


ఆ ఫోటో క్రింద ఓ అభిమాని... నాగ చైతన్య(Naga Chaitanya)కు విడాకులు ఇచ్చేసి నన్ను పెళ్లి చేసుకో సమంత.. అంటూ కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి సమంత రిప్లై ఇవ్వడం జరిగింది. అది చాలా కష్టం, నువ్వు నాగ చైతన్యను అడుగు.. అంటూ  కూల్ గా సమాధానం చెప్పింది. 

37

2020 నవంబర్ లో ఈ సంఘటన చోటు చేసుకోగా సరిగ్గా ఏడాది తర్వాత 2021 అక్టోబర్ లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేశారు. విధి విచిత్రం అంటే ఇదేనేమో. ఏదో ఫన్ కోసం సమంత అభిమాని చేసిన కామెంట్, ఏడాది తర్వాత నిజమైంది. సంవత్సర కాలంలో సినారియో మొత్తం మారిపోయింది. ఎంతో ఆప్యాయంగా ఉండే నాగ చైతన్య-సమంత విడిపోయారు. 
 

47


ఇక లేటు వయసులో వీరికి విడాకులు కావడం కూడా ఒక సమస్య. ఇద్దరూ థర్టీ ప్లస్ లో ఉన్నారు. కాబట్టి త్వరగానే రెండో పెళ్లి ఆలోచన చేయాలి. నాగ చైతన్య కుటుంబం ఆయనకు పిల్లను వెతికే పనిలో ఉన్నట్లు సమాచారం. ఈసారి పెద్దలు కుదిర్చిన సంబంధం చేసుకోవాలని డిసైడ్ అయ్యాడట నాగ చైతన్య. 
 

57


సమంత మాత్రం ఫుల్ ఫోకస్ కెరీర్ పైనే పెట్టారు. ఆమె పలు ప్రాజెక్ట్స్ కి సంతకాలు చేశారు. మైథలాజికల్ చిత్రం శాకుంతలం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. అలాగే యశోద చిత్రం షూటింగ్ దశలో ఉంది. కొన్ని వెబ్ సిరీస్లు, చిత్రాలకు సమంత సైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 
 

67

ఆమె ముఖ్యంగా బాలీవుడ్ లో పాగా వేసే ప్రణాళికలలో ఉన్నారట. హిందీ చిత్ర పరిశ్రమలో సత్తా చాటాలని చూస్తున్న సమంత ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. ది ఫ్యామిలి మాన్ 2 సిరీస్ సక్సెస్ తో సమంతకు కొంత గుర్తింపు వచ్చింది. పుష్ప(Pushpa) మూవీలో ఐటెం సాంగ్ చేయడం కూడా ఆమెకు కలిసొచ్చింది.

77


మరోవైపు నాగ చైతన్య బంగార్రాజు మూవీతో మరో హిట్ అందుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన బంగార్రాజు ప్రేక్షకులను అలరించింది. తండ్రీకొడుకులు నాగ్, చైతూ సిల్వర్ స్క్రీన్ పై అద్భుతం చేశారు. అలాగే విక్రమ్ కుమార్ దర్శకత్వంలో చైతూ థాంక్యూ చిత్రం చేస్తున్నారు. ఇది చిత్రీకరణ జరుపుకుంటుంది. 

Read more Photos on
click me!

Recommended Stories