నటిగా, యాంకర్ గా సమానమైన క్రేజ్ తో రాణించే భామలు చాలా తక్కువ మందే ఉంటారు. చాలా కాలం క్రితమే మ్యారేజ్ చేసుకున్న అనసూయ.. అటు ఫ్యామిలీకి, ఇటు కెరీర్ కు సమానంగా ప్రాధాన్యత ఇస్తోంది. క్షణం, రంగస్థలం చిత్రాల్లో అనసూయ నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. క్షణంలో పోలీస్ అధికారిగా, రంగస్థలంలో పల్లెటూరి గృహిణిగా అనసూయ తన నటనతో మెస్మరైజ్ చేసింది.