బాలయ్యని కలిసిన విష్ణు, మోహన్ బాబు..సంస్కారం అంటే అది, నారా లోకేష్ పై కామెంట్స్

First Published | Oct 14, 2021, 1:18 PM IST

'మా' ఎన్నిక ముగిసినప్పటికీ రోజుకొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే.

'మా' ఎన్నిక ముగిసినప్పటికీ రోజుకొక ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. మా ఎన్నికల్లో మంచు విష్ణు అధ్యక్షుడిగా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక తనని నాన్ లోకల్ అనే కారణంగా సభ్యులు రిజెక్ట్ చేసారని మనస్తాపంతో ప్రకాష్ రాజ్ అతడి ప్యానల్ సభ్యులు మా సభ్యత్వానికి మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. దీనితో టాలీవుడ్ లో పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారాయి. 

manchu vishnu

ఇలాంటి పరిస్థితుల్లో మంచు విష్ణు, మోహన్ బాబు నందమూరి బాలకృష్ణని ఆయన నివాసంలో కలిశారు. వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. బాలయ్యని కలసిన అనంతరం మోహన్ బాబు మీడియాతో మాట్లాడారు. మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. 


Nandamuri Balakrishna

మంగళగిరిలో బాలయ్య అల్లుడు లోకేష్ ని ఓడించడానికి ప్రచారం చేశా. అక్కడ వైసిపి గెలిచింది. ఓసారి బాలయ్యకు నేను ఫోన్ చేశా. బాలకృష్ణ 10 నిమిషాలలో తిరిగి కాల్ చేశాడు. ఒకసారి మాట్లాడాలి బాలయ్య అని అడిగా. ఓకె ఎప్పుడు చెప్పినా కలుస్తాను అని అన్నాడు. అది బాలయ్య మొదటి సంస్కారం అని మోహన్ బాబు ప్రశంసించారు. ఆ తర్వాత మాట్లాడినప్పుడు విష్ణు 'మా' ఎన్నికలో పోటీ చేస్తున్నాడు అని చెప్పాను. 

దీనికి బాలయ్య స్పందిస్తూ మీరెందుకు చెబుతున్నారు. మీరు చెబితే నేను ఓటు వేస్తానా ? విష్ణు నా తమ్ముడు.. నేనొచ్చి ఓటు వేస్తాను అని బాలయ్య తన స్టైల్ లో చెప్పాడు.  జరిగిన విషయాలు మరచిపోయి.. మంచి హృదయంతో బాలయ్య నా బిడ్డని ఆశీర్వదించాడు. అది బాలయ్య సంస్కారం. బాలయ్య, అతడి కుటుంబం 100 ఏళ్ళు సంతోషంగా ఉండాలి అని మోహన్ బాబు అన్నారు. బాలయ్యకు మా అన్నయ్య ఎన్టీఆర్ గారే విష్ణుకి సపోర్ట్ చేయమని చెప్పినట్లు నేను భావిస్తున్నాను అని మోహన్ బాబు అన్నారు. 

nara lokesh

ఇక మంచు విష్ణు మాట్లాడుతూ.. తన ప్రమాణస్వీకారం 16వ తేదీ ఉదయం 11.30 గంటలకు ఉంటుందని ప్రకటించారు. అందరిని ఆహ్వానిస్తున్నట్లు కూడా విష్ణు పేర్కొన్నాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ కి కూడా ఇన్విటేషన్ పంపుతున్నాను. అందరూ వస్తారని ఆశిస్తున్నట్లు విష్ణు పేర్కొన్నాడు. ఇప్పటికే కైకాల సత్యనారాణ, కోట శ్రీనివాస రావు, పరుచూరి బ్రదర్స్ ని ఇన్వైట్ చేసినట్లు విష్ణు పేర్కొన్నాడు. 

మిగిలిన వాళ్ళని కూడా ఇన్వైట్ చేయబోతున్నట్లు విష్ణు తెలిపాడు. ప్రకాష్ రాజ్ ప్యానల్ సభ్యుల విషయంలో విష్ణు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడనేది ఆసక్తిగా మారింది. అలాగే విష్ణు చిరంజీవిని కూడా కలవబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు చిరంజీవి తనని విత్ డ్రా అవ్వమని అడిగినట్లు విష్ణు స్వయంగా రివీల్ చేశాడు. 

Also Read: కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేస్తున్న శ్రీముఖి థైస్ అందాలు.. పొట్టి గౌనులో టెంప్టింగ్ ఫోజులు

Latest Videos

click me!