Kajal: భర్తకి కాజల్‌ హాట్‌ కిస్‌.. బర్త్ డే సందర్భంగా గౌతమ్ కిచ్లుకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన చందమామ

Published : Aug 16, 2022, 05:54 PM ISTUpdated : Aug 16, 2022, 08:20 PM IST

అందాల చందమామ కాజల్‌.. మ్యారేజ్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తుంది. ఓ వైపు తన కుమారుడితో, మరోవైపు భర్త, ఫ్యామిలీతో సరదాగా గడుపుతుంది. అయితే భర్త పుట్టిన రోజు సందర్భంగా ఓ ఫోటో షేర్‌ చేయగా, అది వైరల్ అవుతుంది.  

PREV
18
Kajal: భర్తకి కాజల్‌ హాట్‌ కిస్‌.. బర్త్ డే సందర్భంగా గౌతమ్ కిచ్లుకి అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చిన చందమామ

కాజల్‌ భర్త గౌతమ్‌ కిచ్లు పుట్టిన రోజు నేడు(ఆగస్ట్ 16). ఈ సందర్భంగా ఆయనకు బర్త్ డే విషెస్‌ తెలిపింది కాజల్‌. అది మామూలుగా కాదు, మ్యారేజ్‌ తర్వాత గౌతమ్‌కిది రెండో పుట్టిన రోజు. తన కుమారుడు నీల్‌ కిచ్లు పుట్టాక మొదటి పుట్టిన రోజు. దీంతో దాన్ని అంతే స్పెషల్‌గా ఉంచే ప్రయత్నం చేసింది కాజల్‌. 
 

28

భర్తకి పుట్టిన రోజు విషెస్‌ చెబుతూ, అదిరిపోయేలా ముద్దు పెట్టింది. కాజల్‌, గౌతమ్‌ ఇద్దరు తమ చేతుల్లో కుమారుడు నీల్‌ని పట్టుకుని ఉండగా, భర్త భుజంపై చేయి వేసి తన వద్దకి తీసుకుని మరీ ముద్దుతో సర్‌ప్రైజ్‌ చేసింది కాజల్‌. అదిరిపోయేలా ఓ ముద్దు పెట్టింది. ఇది నిజంగానే గౌతమ్‌ని అత్యంత సర్‌ప్రైజ్‌ చేసిందని చెప్పొచ్చు.

38

ఈ సందర్భంగా దిగిన ఫోటోని పంచుకుంటూ, ప్రపంచంలోనే అత్యంత గొప్ప తండ్రివైన నీకు హ్యాపీయెస్ట్ బర్త్ డే. మేము నిన్ను ప్రేమిస్తున్నాం గౌతమ్‌ కిచ్లు` అని పేర్కొంది కాజల్‌. ప్రస్తుతం ఆమె ఫోటో తెగ వైరల్‌ అవుతుంది. 
 

48

ఈ ఏడాది ఏప్రిల్‌లో కాజల్‌ పండంటి మగబిడ్డకి జన్మనిచ్చిన విషయంతెలిసిందే. ఆయనకు నీల్‌ కిచ్లు అని నామకరణం చేశారు. తన కుమారుడి ఫోటోలను పంచుకుంటూ తరచూ తన ఆనందాన్ని అభిమానులతో షేర్‌ చేస్తుంది కాజల్‌. అయితే ఎప్పుడూ పూర్తిగా తన కుమారుడిని చూపించకపోవడం విశేషం. 
 

58

ఇక గత కొంత కాలంగా సీక్రెట్‌గా ప్రేమించుకున్న కాజల్‌, గౌతమ్‌ కిచ్లు 2020లో తమ ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. అక్టోబర్‌ లో ఈ విషయాన్ని వెల్లడించింది కాజల్‌. కోట్లాది మంది అభిమానుల గుండెల్లో పెద్ద రాయి వేసినంత పని చేసింది. 

68

అక్టోబర్‌ 30న వీరి వివాహం కొద్ది మంది బంధుమిత్రులతో మధ్య గ్రాండ్‌గా జరిగింది. ఆ తర్వాత హనీమూన్‌ ఎంజాయ్‌ చేసిందీ జంట. ఆ వెంటనే తాను కమిట్‌ అయిన సినిమాల షూటింగ్‌ల్లో పాల్గొంది. ఒప్పుకున్న సినిమాల షూటింగ్‌లు పూర్తి చేసుకుని మళ్లీ వ్యక్తిగత జీవితానికి పరిమితమయ్యింది. ఆ సమయంలోనే ప్రెగ్నెంట్‌ న్యూస్‌ని ప్రకటించింది. 
 

78

అయితే కొంత పార్ట్ `ఆచార్య` ఉండగా, దాన్ని వదిలేసుకుంది కాజల్‌. చిరంజీవి సైతం ఆమె పాత్రని లైట్‌ తీసుకున్నారు. ఆ తర్వాత ఈ సినిమా విషయంలో కాజల్‌ పాత్ర వివాదంగా మారిన విషయం తెలిసిందే. చివరికి సినిమా నుంచే తీసేశారు. మరోవైపు కాజల్‌, గౌతమ్‌ ఈ ఏప్రిల్‌లో పేరెంట్స్ హోదా పొందారు. ఆ క్షణం నుంచి వారి లైఫ్‌లో ఆనందం వెల్లు విరిసిందని చెప్పొచ్చు. 

88

డెలివరీ తర్వాత కూడా తన ఫిట్‌నెస్‌ని చాటుకుంటుంది కాజల్‌. ఆ తర్వాత వెంటనే బ్యాక్‌ టూ బ్యాక్‌ ఫోటో షూట్లు చేసింది. తాను ఫిట్‌గానే ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమే అనే సిగ్నల్స్ ఇచ్చారు. అంతేకాదు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, త్వరలో `ఇండియన్‌ 2` షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్టు వెల్లడించింది. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories