అనసూయ `నవస్త్ర` ట్రీట్‌.. పండగే పండగ.. నైట్‌ డ్రెస్‌ కోరుకుంటూ ఫన్నీ కామెంట్‌.. రచ్చ మామూలుగా లేదుగా

Published : Sep 27, 2022, 04:49 PM ISTUpdated : Sep 27, 2022, 08:01 PM IST

హాట్ యాంకర్‌ అనసూయ నవరాత్రుల సందర్భంగా అభిమానులకు ట్రీట్‌ ఇవ్వబోతుంది. అందుకోసం ఓ డిఫరెంట్‌ షోని ప్లాన్‌ చేసిందీ జబర్దస్త్ బ్యూటీ. తాజాగా ఆమె ఓ వీడియో పంచుకుంటూ రచ్చ చేసింది. అందులో చేసిన కామెంట్ వైరల్‌గా మారింది.  

PREV
17
అనసూయ `నవస్త్ర` ట్రీట్‌.. పండగే పండగ.. నైట్‌ డ్రెస్‌ కోరుకుంటూ ఫన్నీ కామెంట్‌.. రచ్చ మామూలుగా లేదుగా

హాట్‌ యాంకర్‌ అనసూయ నవరాత్రుల్లో అభిమానులను ఎంటర్‌టైన్‌ చేయబోతుంది. `నవస్త్ర` పేరుతో తొమ్మిది రోజులు సర్‌ప్రైజ్‌ చేయబోతుంది. తొమ్మిది రకాల ట్రెండీ వేర్ లో ఆమె కనువిందు చేయబోతుందని తెలుస్తుంది. తాజాగా ఓ ఎపిసోడ్‌ని తన యూట్యూబ్‌ ఛానెల్‌లో అప్‌లోడ్‌ చేసింది. 
 

27

ఇందులో గౌరీ నాయుడుతో కలిసి ఆమె `నవస్త్ర` కోసం ప్రీపేర్‌ అయ్యింది. కొన్ని డ్రెస్సులుండగా, వాటిలో ఏదైనా ఒకటి సెలక్ట్ చేసుకుని అది వేసుకుని ప్రోగ్రామ్‌కి రెడీ అవ్వాలి. కళ్లు మూసుకుని ఓ డ్రెస్‌ని సెలక్ట్ చేసుకున్న అనసూయ, అ డ్రెస్‌ నచ్చిందంటూ ఆనందించింది. స్లీవ్‌లెట్‌గా ఉన్న ఈ ట్రెండీ వేర్‌లో కత్తిలా ఉందని అంటున్నారు నెటిజన్లు. 
 

37

ఇదిలా ఉంటే ఈ డ్రెస్‌ సెలెక్ట్ చేసుకునే సమయంలో నైట్‌ డ్రెస్‌ వేసుకోవాలా? నిజానికి నైట్‌ డ్రెస్‌ అయితే ఇంకా బాగుంటుందని కామెంట్‌ చేయడం విశేషం. మొత్తానికి అనసూయ తన అభిమానులకు నైట్‌ డ్రెస్‌లో కనిపించాలని ఉవ్విళ్లూరుతుందని అంటున్నారు నెటిజన్లు. ఆ సరదా ఏదే తీర్చేయోచ్చుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో ఇది మరోసారి రచ్చగా మారింది.
 

47

దేవి నవరాత్రుల సందర్బంగా అనసూయ తన యూట్యూబ్‌ చానెల్‌ కోసం ఇలా ఓ స్పెషల్‌ ప్రోగ్రామ్‌ చేస్తుంది అనసూయ. నవరాత్రుల స్పెషల్‌ పంచుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇందులో సరదా గేమ్స్ కూడా ఆడటం విశేషం. మొదటి ఎపిసోడ్‌ కావడంతో సస్పెన్స్ లో పెట్టింది. మరి రెండో ఎపిసోడ్‌లో ఏం చూపించబోతుందనేది మరింత ఆసక్తికరంగా మారింది. 
 

57

ఇదిలా ఉంటే అనసూయ `జబర్దస్త్`ని వదిలేసిన విషయం తెలిసిందే. ఆమె ఆ షోపై పలు విమర్శలు చేస్తూ బయటకొచ్చింది. బాడీ షేమింగ్‌ కామెంట్లు ఎదుర్కోవల్సి వస్తుందని, నీచమైన షో అనేట్టుగా మారింది. దాదాపు తొమ్మిదేళ్లు యాంకర్‌గా చేసిన అనసూయ వెళ్తూ వెళ్తూ ఇలాంటి కామెంట్లు చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. దీంతో నెటిజన్లు సైతం ఆమెని దారుణంగా ట్రోల్స్ చేశారు. ఇన్నాళ్లు అవన్ని కనిపించలేదా? అంటూ ప్రశ్నించారు. 

67

మరోవైపు ఇతర టీవీ ఛానెల్‌లో ఎక్కువ పారితోషికం ఆఫర్‌ చేయడంతో `జబర్దస్త్`ని వీడినట్టు ప్రచారం జరిగింది. ప్రస్తుతం ఆమె స్టార్‌ మాలో `సూపర్‌ సింగర్‌ జూనియర్‌` షోకి సుడిగాలి సుధీర్‌తో కలిసి యాంకర్‌గా వ్యవహరిస్తున్నారు. మరోవైపు సినిమాలతోనూ బిజీగా ఉంది. ఆమె ఓ అరడజను సినిమాల్లో నటిస్తుంది. అడపాదడపా ఐటెమ్‌ సాంగ్స్ కూడా చేస్తున్న విషయం తెలిసిందే. 
 

77

అనసూయ గ్లామర్‌ సైడ్‌ హాట్‌ టాపిక్ అవుతుంది. ఆమె ట్రెండీ వేర్‌లో హోయలు పోతూ కనువిందు చేస్తుంది. పొట్టి దుస్తుల్లో రచ్చ చేస్తూ నెటిజన్ల విమర్శలెదుర్కొంటుంది. ఈ క్రమంలో నెటిజన్లకి, అనసూయకి మధ్య తీవ్ర స్థాయిలో వార్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇటీవల `ఆంటీ` అనే యాష్‌ ట్యాగ్‌తోనూ ఆమెని ట్రెండ్‌ చేశారు. దీనికి అనసూయ గట్టిగానే ఫైర్‌ అయ్యింది. కానీ ఇప్పటికీ ఆ సెటైర్లు పేలుతూనే ఉన్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories