Darja Review: అనసూయ 'దర్జా' మూవీ రివ్యూ

First Published | Jul 22, 2022, 10:34 AM IST

తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దర్జా'. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ లో అనసూయ మాస్ క్యారెక్టర్ అందరిని ఆకర్షించింది. మరోసారి అనసూయ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోంది. 

అనసూయ భరద్వాజ్ టాలీవుడ్ లో పాపులర్ నటిలా మారిపోయింది. బుల్లితెరపై టాప్ యాంకర్ గా రాణిస్తూ, వెండి తెరపై అద్భుతమైన పత్రాలు చేస్తోంది. దీనితో అనసూయకి ప్రత్యేకమైన పాత్రల్లో నటించే అవకాశంతో పాటు లేడీ ఓరియెంటెడ్ చిత్రాల్లో  ఛాన్సులు వస్తున్నాయి. తాజాగా అనసూయ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'దర్జా'. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్ర ట్రైలర్ లో అనసూయ మాస్ క్యారెక్టర్ అందరిని ఆకర్షించింది. మరోసారి అనసూయ నెగిటివ్ రోల్ ప్లే చేస్తోంది. సునీల్ ప్రధాన పాత్రలో నటించాడు. దీనితో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. 'దర్జా' నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన నేపథ్యంలో చిత్రం ఎలా ఉందొ సమీక్షలో తెలుసుకుందాం. 

కథ : 

కనక మహాలక్ష్మి (అనసూయ) బందరు చుట్టుపక్కల ప్రాంతాలకి లేడీ డాన్ లాగా వ్యవహరిస్తూ ఉంటుంది. పోలీసులని కూడా తన గుప్పెట్లో పెట్టుకుంటుంది. ఎవరికీ భయపడకుండా సారా, అక్రమ వ్యాపారాలు చేస్తూ ఉంటుంది. ఆమెని ఎదిరించే వారే ఉండరు. ఈ క్రమంలో గణేష్(అరుణ్ వర్మ) తన ప్రేయసి పుష్ప(శిరీష) చేతిలో మోసపోయి ఆత్మహత్య చేసుకుంటాడు. దీనితో పుష్పపై గణేష్ సోదరుడు రంగ(షమ్ము) పగ పెంచుకుంటాడు. పుష్పని ఎలాగైనా హతమార్చాలి అని ప్రయత్నిస్తుంటాడు. ఈ క్రమంలో ఎసిపి శివ శంకర్ పైడిపాటి (సునీల్) ఎంట్రీ ఇస్తాడు. గణేష్ కేసుని టేకప్ చేస్తాడు. గణేష్ కేసులో చివరికి శివ శంకర్ ఏం తెలుసుకున్నాడు. అనసూయకి ఎందుకు ఎదురు వెళ్లాల్సి వచ్చింది ? ఆమెతో పోరాడి గెలిచాడా ? అనేది మిగిలిన కథ. 


విశ్లేషణ :

అనసూయ వరుసగా నెగిటివ్ రోల్స్ చేస్తుండడంతో ఈ చిత్రంలో కూడా ఆమె కనక మహాలక్ష్మి పాత్రలో ఒదిగిపోయింది. లోకల్ డాన్ లేడీగా అనసూయ బాగా సెట్ అయ్యింది. ఒక నెగిటివ్ డాన్ క్యారెక్టర్ ని అందులోనూ అనసూయని పెట్టి ఆమె పాత్ర కథ రాసుకోవడం దర్శకుడు చేసిన మంచి ప్రయత్నం అనే చెప్పాలి. తన క్యారెక్టర్ కి కావలసిన మ్యానరిజమ్స్ ని అనసూయ బాగా పలికించింది. దర్శకుడు ఈ కథని పోలిసుల మధ్య చర్చగా నడిపించిన విధానం బావుంది.  అనసూయతో వచ్చే సన్నివేశాలు వేగంగా సాగుతాయి. 

అయితే ఫస్ట్ హాఫ్ కాస్త స్లోగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇక సునీల్ ఎంట్రీ ఇచ్చాక కథ జోరందుకుంటుంది. సునీల్ కి వార్నింగ్ ఇచ్చే సన్నివేశాల్లో, యాక్షన్ సీన్స్ లో అనసూయని మన తెలుగు కమర్షియల్ చిత్రాల్లో పవర్ ఫుల్ విలన్ ని చూసినట్లే చూస్తాం. అనసూయ, సునీల్ తప్ప ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో లేకపోవడం కాస్త మైనస్. అలాగే ఇతర నటీనటుల నుంచి ఆశించిన పెర్ఫామెన్స్ రాలేదు. 

షకలక శంకర్, కమెడియన్ పృథ్వి కామెడీ ఆకట్టుకుంటుంది. ఇక నటి ఆమని కూడా గుర్తుంచుకోదగ్గ పాత్రలో నటించింది. ఎమోషనల్ సీన్స్ లో మెప్పించింది. సినిమాలో చాలా పాత్రలు వస్తూ పోతూ ఉండడంతో కాస్త ప్రేక్షకులకు చికాకు కలుగుతుంది. కానీ అనసూయ, సునీల్ పవర్ యాక్టింగ్ తో వాటిని కవర్ చేసే ప్రయత్నం చేశారు. 

టెక్నికల్ గా:

రాప్ రాక్ షకీల్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఆయన అందించిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ చాలా బావుంటుంది. సినిమాలో చాలా సన్నివేశాలని ఎలివేట్ చేయడంలో షకీల్ మ్యూజిక్ బాగా ఉపయోగపడింది. ఇక ఈ చిత్రాన్ని దర్శకుడు షార్ప్ డైలాగ్స్ రాసుకున్నాడు అనే చెప్పాలి. లేడి డాన్, పోలీసులు, మాఫియా లాంటి అంశాలు ఉన్నప్పటికీ లెన్తీ  డైలాగులు లేకుండా పదునైన మాటలతో మెప్పించారు. ముఖ్యంగా అనసూయ తన డైలాగ్ డెలివరీతో అదరగొట్టేసింది. పోలీస్ ఆఫీసర్ గా సునీల్ చెప్పే డైలాగులు కూడా బాగా పేలాయి. దర్శన్ సినిమాటోగ్రఫీ, ఎడిటర్ ఎమ్.ఆర్ వర్మ పనితీరుని అభినందించాలి.  

ఫైనల్ థాట్:

రొటీన్ గా అనిపించే కథ, ఫస్ట్ హాఫ్ లో నెమ్మదిగా సాగే కథనం ఈ చిత్రంలో మైనస్ గా నిలిచిన అంశాలు. కానీ డాన్ లేడీగా అనసూయ నటన, సునీల్ పవర్ ఫుల్ పోలీస్ పాత్ర కోసం ఈ చిత్రాన్ని ఒకసారి ట్రై చేయొచ్చు. 

Latest Videos

click me!