
అనసూయ.. సోషల్ మీడియాలో తరచూ హాట్ టాపిక్ అవుతుంది. చాలా వరకు ట్రోల్స్ కి గురవుతుంటుంది. ఆమె పోస్ట్ లు వివాదంగా మారుతుంటాయి. దీంతో నెటిజన్లు, కొందరు హీరోల ఫ్యాన్స్ ఆమెని ట్రోల్స్ చేస్తుంటారు. `ఆంటీ` అంటూ ఆడుకుంటుంటారు. దీనికి ఆమెరియాక్ట్ కావడం, తిరిగి ట్రోలర్స్ రియాక్షన్‌తో మొత్తం పెద్ద రచ్చ రచ్చ అవుతుంది. ఆ మధ్య `ఆంటీ` అన్నందుకు కొందరిపై కేసు పెట్టింది అనసూయ. ఆ తర్వాత కాస్త సైలెంట్ అయ్యింది. కానీ ఇప్పుడు మరోసారి రెచ్చిపోయింది. ట్రోలర్స్ రెచ్చిపోయారు. నెట్టింట దుమారం రేపుతున్నారు.
నిన్న(శుక్రవారం) ఓ పోస్ట్ పెట్టింది అనసూయ. `ఇప్పుడే ఒకటి చూశాను. `The` naa?? బాబోయ్!!! పైత్యం.. ఏంచేస్తాం. అంటకుండ చూసుకుందాం` అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చూసిన విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అనసూయను కామెంట్లతో బాగా ట్రోల్ చేస్తున్నారు. నిన్ననే విజయ్ దేవరకొండ, సమంత కలిసి నటించిన `ఖుషి` ఫస్ట్ సింగిల్‌కి సంబంధించిన అప్‌డేట్‌తో కొత్త పోస్టర్ వచ్చింది. దాన్ని ఉద్దేశించే అనసూయ ఈ పోస్ట్ పెట్టిందని విజయ్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనవసరంగా, తనకు సంబంధం లేని విషయాల్లో తరదూర్చి ట్రోల్స్ కి గురవుతుంటావని విమర్శిస్తున్నారు.
మరోసారి `ఆంటీ` అంటూ ట్రోల్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఈ రచ్చ సోషల్ మీడియాలో మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో దీనిపై అనసూయ మళ్లీ స్పందించింది. `భలే అంటున్నార్రా దొంగ ఊప్స్.. బంగారు కొండలంట, ఎక్కడో అక్కడ నేను నిజం అనేది ప్రూవ్ చేస్తునే ఉన్నందుకు థ్యాంక్స్ రా అబ్బాయిలు` అని పేర్కొంది. అంతేకాదు ఈ రోజు మళ్లీ స్పందించింది. అనసూయ డైహార్డ్ ఫ్యాన్స్ ట్విట్టర్ నుంచి ఆమెని బూతులతో తిడుతున్న పోస్ట్ కి ఆమె రిప్లై ఇస్తూ,
`చాలా మందిని మేల్కొనడానికి ఇదే సరైన మార్గం అని భావించారు. నాకు వ్యక్తిగతంగా నా ఫ్యాన్ పేజీ అడ్మిన్‌ల గురించి తెలియదు, కానీ చాలా మంది ఇతరులకు భిన్నంగా నేను సృష్టించిన ప్రభావం గురించి గర్వపడుతున్నా. పోలిక అన్నిసార్లు సరైనది కాదు, కానీ ఇది కూడా ఓ ఆప్షన్‌గా చెబుతున్నా` అని పేర్కొంది. మరోవైపు ఆ బూతులపై ఆమె రియాక్ట్ అవుతూ, ఈ విషయంలో నేను గర్వంగా ఫీలవ్వడమే కాదు, మీరే నా బలం, నా కృతజ్ఞతని తెలియజేయడానికి థ్యాంక్స్ చెప్పలేను` అని వెల్లడించింది.
అనంతరం అనసూయ మరో ట్వీట్ వదిలింది. ఇది స్టార్ హీరోలని ఉద్దేశించి కావడం విశేషం. ఫ్యాన్స్ విషయంలో హీరోలు ఎందుకు జోక్యం చేసుకోరనేది ఆమె ప్రశ్నిస్తుంది. `ఈ స్టార్స్ అంతా తమ ఫ్యాన్స్ పేరుతో ఎలాంటి తప్పు చేసినా నిలదీయడానికి ఏం ఆపుతుందో తెలియడం లేదు. గొప్ప శక్తితో గొప్ప బాధ్యత వస్తుంది. నాకిచ్చిన పవర్‌లో నేను బాధ్యత వహిస్తున్నా, అభిమానులు, ఫాలోయింగ్ పోతుందని ఆలోచిస్తున్నారా? అలాంటి ఫాలోయింగ్ లేకుంటేనే బెటర్ కదండీ` అంటూ మరో ట్వీట్ వదిలింది అనసూయ.
దీంతో ఇది పెద్ద హీరోల ఫ్యాన్స్ ని సైతం గెలికినట్టయ్యింది. దీంతో వాళ్లు కూడా రెచ్చిపోతున్నారు. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి వాళ్లు కూడా తోడవ్వడంతో ట్రోలర్స్ బలం పెరిగింది. దీంతో అనసూయని గట్టిగా ఆడుకుంటున్నారు. ఆఫర్లు లేకనే అందరి అటెన్షన్ తనవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తుందని, కచ్చితంగా ఈమె అటెన్షన్ సీకరే అంటున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి తాను వార్తల్లో నిలిచేలా చూసుకుంటుందని, ఇదొక పక్కా ప్లానింగ్ ప్రకారమే చేస్తుందని, కావాలనే ఆమె ఇలాంటి విషయాల్లో తలదూరుస్తుందని కౌంటర్లు వేస్తున్నారు.
అంతేకాదు తాజాగా ట్వీట్‌తో స్టార్ హీరోయిల అభిమానులను సైతం ఆమె బ్లాక్ మెయిల్ చేస్తుందని, హరాస్ చేస్తుందని అంటున్నారు. ఇలా తను పోస్ట్ చేయడం హరాస్ కిందకే వస్తుందంటున్నారు. అనవసరమైన డ్రామాలు ఆడుతుందంటున్నారు. అయితే ఇందులో కొందరు నెటిజన్లు మాత్రం ఆమెకి అండగా నిలుస్తున్నారు. ఆమె బోల్డ్ గా చెబుతుంది కాబట్టే అందరికి నచ్చడం లేదని అంటున్నారు. ఏదేమైనా ఇప్పుడు అనసూయ మరోసారి ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో మరోసారి చర్చకి పాయింట్‌గా నిలవడం విశేషం.