Anasuya Photos: బికినీ ఫొటోలతో శివాజీకి అనసూయ కౌంటర్ ? 2026 ఫస్ట్ డేనే దిమ్మతిరిగేలా చేసిందిగా..

Published : Jan 01, 2026, 03:52 PM IST

అనసూయ షేర్ చేసిన బికినీ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. న్యూ ఇయర్ సందర్భంగా ఆమె చేసిన పోస్ట్ నటుడు శివాజీకి కౌంటర్ ఇచ్చిన విధంగా ఉంది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి. 

PREV
16
అనసూయ వివాదాలు 

యాంకర్ అనసూయ నిత్యం ఏదో విధంగా వార్తల్లో ఉండడం చూస్తూనే ఉన్నాం. వివాదాలు కూడా అనసూయని వెంటాడుతూ ఉంటాయి. ఎన్ని వివాదాలు ఎదురైనా అనసూయ వెనకడుగు వేయదు. తనదైన శైలిలో కౌంటర్ ఇస్తూనే ఉంటుంది. ఇటీవల నటుడు శివాజీ ఆడవారి బట్టల గురించి సంచలన వ్యాఖ్యలు చేయడంతో పెద్ద వివాదం అయింది. శివాజీ మహిళా కమిషన్ వద్ద వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. 

26
శివాజీ వ్యాఖ్యలతో గొడవ 

ఈ క్రమంలో చాలా మంది శివాజీని తీవ్రంగా విమర్శించారు. కొందరు సపోర్ట్ చేశారు కూడా. శివాజీని విమర్శించిన వారిలో అనసూయ, చిన్మయి ప్రథమంగా ఉన్నారు. శివాజీపై అనసూయ కాస్త ఘాటుగానే స్పందించింది. శివాజీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ తో ఉన్నారు అంటూ అనసూయ విమర్శించింది. ఇద్దరి మధ్య మాటలు ఎక్స్ ఛేంజ్ అయ్యాయి. అనసూయ అనవసరంగా ఇందులోకి వచ్చింది అని, ఆమె పేరు కూడా తాను ప్రస్తావించలేదు అని శివాజీ అన్నారు. అనసూయ మాట్లాడుతూ శివాజీ చెప్పినంత మాత్రాన మనకి నచ్చిన బట్టలు వేసుకోకుండా ఉంటామా అని అనసూయ పేర్కొంది. 

36
అనసూయ బికినీ ఫోటోస్ 

అందుకు తగ్గట్లుగానే అనసూయ సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా జనవరి 1న అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఏకంగా బికినీ ఫోటోలు షేర్ చేసింది.

46
భర్తతో రొమాంటిక్ గా అనసూయ

తన భర్త భరద్వాజ్ తో న్యూ ఇయర్ వెకేషన్ ఎంజాయ్ చేస్తూ బికినీలో ఉన్న ఫోటోలు షేర్ చేసింది. తన భర్తతో ఈ ఫొటోల్లో అనసూయ రొమాంటిక్ గా కనిపిస్తోంది. కానీ ఆమె ఈ ఫోటోలు షేర్ చేస్తూ పెట్టిన కామెంట్ మాత్రం చాలా ఘాటుగా ఉంది.

56
చెత్త వాగుడుని సహించేది లేదు 

ఆమె చేసిన కామెంట్ శివాజీకి కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉంది. అనసూయ తన పోస్ట్ లో.. అదే మహిళ, అదే ధైర్యం.. కానీ కొత్త సంవత్సరంలోకి అడుగుపెడుతున్నా. ఈ ఏడాది మరింత ఉన్నతి ప్రశాంతత ఉంటుంది. అదే సమయంలో చెత్త వాగుడుని అస్సలు సహించేది లేదు. ఎలాంటి గిల్టీ లేకుండా తినడం, హద్దులు లేకుండా ప్రయాణించడం, భయం లేకుండా మాట్లాడడం నాకు ఇష్టం. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని అనసూయపోస్ట్ చేసింది. 

66
శివాజీకి కౌంటర్ 

తన పోస్ట్ లో అన్ అపాలజెటిక్, అన్ స్టాపబుల్, ఒపీనియన్స్ వెల్కమ్, రెస్పెక్ట్ మ్యాండేటరీ అనే హ్యాష్ ట్యాగ్స్ జోడించింది. ఇదంతా చూస్తుంటే శివాజీకి, ట్రోలర్స్ కి ఆమె కౌంటర్ ఇచ్చినట్లుగానే ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories