యాంకర్‌గా అనసూయ రీఎంట్రీ.. కిర్రాక్‌ పుట్టించే షోతో మళ్లీ బుల్లితెరపై సందడికి రచ్చ షురూ

Published : Jun 10, 2024, 08:51 AM ISTUpdated : Jun 10, 2024, 11:32 AM IST

స్టార్‌ యాంకర్‌ అనసూయ రెండేళ్ల క్రితం జబర్దస్త్ కి గుడ్‌ బై చెప్పింది. సరిగ్గా రెండేళ్లకి మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది. కుర్రాళ్లకి పిచ్చెక్కించే కిర్రాక్‌ షోతో ఆమె కమ్‌ బ్యాక్‌ అవుతుండటం విశేషం.   

PREV
110
యాంకర్‌గా అనసూయ  రీఎంట్రీ.. కిర్రాక్‌ పుట్టించే షోతో మళ్లీ బుల్లితెరపై సందడికి రచ్చ షురూ
anasuya insta pics

తెలుగులో అత్యంత వివాదాస్పద, అత్యంత డిస్కషన్‌ పాయింట్‌గా మారే యాంకర్‌ ఎవరైనా ఉన్నారంటే అది అనసూయ మాత్రమే. ఆమె బోల్డ్ నెస్, ఆమె గ్లామర్‌, ఆమె స్టయిల్స్ ఇలా అన్నీ చర్చనీయాంశం అవుతుంటాయి. చాలా మంది ఆమెని ట్రోల్‌ చేస్తుంటారు. దానికి అంతే ఘాటుగా కౌంటర్లు వేస్తుంది అనసూయ. కానీ ఇటీవల ఆమె ఇలాంటి వివాదాలకు దూరంగా ఉంటుంది. నెమ్మదిగా తగ్గిస్తుంది. 

210
anasuya insta pics

అనసూయ బుల్లితెరకి గుడ్‌ బై చెప్పిన విషయం తెలిసిందే. రెండేళ్ల క్రితమే ఆమె `జబర్దస్త్`ని వీడింది. దాదాపు తొమ్మిదేళ్లు ఈ కామెడీ షోకి యాంకర్‌గా చేసి మెప్పించింది. అందంతో అలరించింది. సెటైర్లతో అలరించింది. తనదైన స్టయిల్‌ లో సందడి చేసింది.

310
anasuya insta pics

 షోని రక్తికట్టించడంతోపాటు రేటింగ్‌ పెంచడంలో తాను కీలక పాత్ర పోషించింది. నిర్వాహకులు అతి, తన పిల్లలు పెద్ద కావడం, బాడీ షేమింగ్‌ కామెంట్ల ఇలా చాలా కారణాలతో ఆమె ఈ జబర్దస్త్ ని వీడుతున్నట్టుప్రకటించింది. 
 

410
anasuya insta pics

 సరిగ్గా రెండేళ్ల తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇస్తుంది అనసూయ. బుల్లితెరపై మరోసారి మెరవబోతుంది. ఈ సారి అనసూయ 2.0 చూపించేందుకు వస్తుంది. ఓ కిర్రాక్‌ షోతో ఆమె బుల్లితెరపైకి కమ్‌ బ్యాక్‌ కాబోతుండటం విశేషం. అనసూయ ఈ విషయాన్ని ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా తాను కొత్త షోతో టీవీ రీఎంట్రీ ఇస్తున్నట్టు చెప్పింది. 

510
anasuya insta pics

అనసూయ ఇప్పుడు స్టార్‌ మాలో సందడి చేయబోతుంది. ఆమె `కిర్రాక్‌ బాయ్స్ ఖిలాడీ గర్ల్స్` పేరుతో షో చేస్తుంది. ఇది టీనేజ్‌ కుర్రాళ్ల షో. దీనికి అనసూయ హోస్ట్ చేస్తుంది. త్వరలోనే ఈ కొత్త షో ప్రారంభం కాబోతుంది. ఈ మేరకు షూటింగ్‌ జరుగుతుంది. ఇందులో భాగంగా ఆమె డిఫరెంట్ కాస్ట్యూమ్స్ లో మెరిసింది. ఫోటో షూట్‌ చేసి ఆ పిక్స్ ని ఇన్‌స్టా, ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. 
 

610
anasuya insta pics

మీరు నన్ను నిజంగానే మిస్ అవుతున్నారా? అయితే మీ కోసం మరోసారి బుల్లితెరపైకి వస్తున్నా అని పేర్కొంది అనసూయ. ఈ పోస్ట్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు.

710
anasuya insta pics

దీనికోసమే వెయిట్‌ చేస్తున్నామని, ఈగర్‌గా వెయిటింగ్‌ అని, అనసూయ 2.0 బ్యాక్‌ అని, రంగమ్మత్త కమ్‌ బ్యాక్‌ అని, ఈసారి డబుల్‌ డోస్‌ అని కామెంట్లతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. 

810
anasuya insta pics

ఈ సందర్భంగా అనసూయ అదిరిపోయే ఫోటోలను పంచుకుంది. ఇందులో వెరైటీ డ్రెస్‌ ధరించి క్లీవేజ్‌ షో చూపిస్తూ మత్తెక్కించే పోజులిచ్చింది. సన్‌ గ్లాసెస్‌ పెట్టుకని స్టయిలీష్‌గా పోజులిచ్చింది. ఇంటర్నెట్ లో మంటలు పెట్టింది. ప్రస్తుతం ఆమె లేటెస్ట్ గ్లామర్‌ పిక్స్ వైరల్‌గా మారాయి. నెటిజన్లకి మత్తెక్కిస్తున్నాయి. వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయేలా ఉంది. 
 

910
anasuya insta pics

అనసూయ నటిగా పెద్దగా సినిమాలు లేవు. ఆమె ప్రస్తుతం `పుష్ప2`లో నటిస్తుంది. దీంతోపాటు `సింబా` అనే మరో సినిమా చేస్తుంది. దీంతోపాటు ఒకటిరెండు ఓ మోస్తారు సినిమాలున్నాయి. అవి తప్పితే గతంలో మాదిరిగా అనసూయకి ఎగబడి ఆఫర్లు రావడం లేదు.

1010
anasuya insta pics

చాలా వరకు ఫ్రీగానే ఉంటుంది. ఫ్యామిలీతో ఎంజాయ్‌ చేస్తుంది. దీనికి సంబంధించిన పిక్స్ ని పంచుకుంటున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బుల్లితెరపై ప్రతి వారం సందడి చేస్తూ తన ఫ్యాన్స్ ని అలరించబోతుంది అనసూయ. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories