కళ్లజోడు.. కాటుక కళ్లు.. అనసూయ క్యూట్ సెల్ఫీలు చూడాల్సిందే.. ఆ విషయంలో శభాష్ అనిపించిందిగా.!

First Published | Nov 30, 2023, 7:36 PM IST

స్టార్ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ ప్రస్తుతం వెండితెరపైనే మెరుస్తోంది. విభిన్న పాత్రలో అలరిస్తోంది. నెట్టింట మాత్రం యాక్టివ్ గా ఉంటున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా క్యూట్ లుక్స్ తో ఆకట్టుకుంది. 

స్టార్ యాంకర్ గా అనసూయ భరద్వాజ్ (Aansuya Bharadwaj) బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే. తన క్రేజ్ కు నెమ్మదిగా సినిమాల్లోనూ అవకాశాలు వరించాయి. దీంతో స్మాల్ స్క్రిన్ పై బైబై చెప్పింది. ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఆడియెన్స్ ను ఆకట్టుకుంటోంది.

తన అభిమానులకు మాత్రం సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గానే కనిపిస్తోంది. తన గురించిన అప్డేట్స్ ను ఎప్పటికప్పుడు అభిమానుతో పంచుకుంటూ వస్తుంది. కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో అనసూయ తనదైన శైలిని ప్రదర్శిస్తుంటుంది.


ఈరోజు తెలంగాణ ఎలక్షన్ డే కావడంతో తన ఓటు హక్కును వినియోగించుకుంది. ఈ సందర్భంగా చుపుడు వేలికి ఉన్న సిరాను చూపిస్తూ అందరూ తమ ఓటు హాక్కును వినియోగించుకోవాలని సూచించింది. ప్రతి స్త్రీ తన ఓటును తప్పనిసరిగా వినియోగించాలని తనవంతు కృషి చేయాలని చెప్పింది. 

అయితే, అనసూయ సోషల్ మీడియాలో తనదైన శైలిలో రియాక్ట్ అవుతోంది. ఆయా అంశాలపై ఆమె స్పందించే తీరుకు అభిమానులు ఫిదా అవుతున్నారు. కీలకమైన రోజుల్లో మాత్రం ప్రజలను తనవంతుగా చైతన్యం చేస్తూ శభాష్ అనిపించుకుంటోంది. అందరి ప్రశంసలు పొందుతోంది. 

తన ఓటు హక్కును వినియోగించుకున్న సందర్భంగా అనసూయ క్యూట్ గా సెల్ఫీలకు ఫోజులిచ్చింది. సింపుల్ లుక్ తోనే కట్టిపడేసింది. సెల్ఫీల్లో తన మత్తు చూపులను బంధించి నెటిజన్లకు ఆ నిషా ఎక్కించింది. చూపుతిప్పుకోకుండా చేసిన అందంతో అదరగొట్టింది. 

తాజాగా మేకప్ లేకుండా లైట్ టచ్ అప్ తో కెమెరాకు ఫోజులిచ్చింది. తన నేచురల్ అందంతో కట్టిపడేసింది. ఇలా వరుసగా తన గ్లామర్ పిక్స్ ను షేర్ చేస్తూ ఆకట్టుకుంటోంది. ఇదిలా ఉంటే.. రీసెంట్ గా అనసూయ ‘పెదకాపు’ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ అల్లు అర్జున్ Pushpa 2 The Ruleతో అలరించనుంది. 
 

Latest Videos

click me!