సందీప్ వంగాని టార్గెట్‌ చేస్తూ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్ కామెంట్స్‌? కాసేపట్లో పోస్ట్ డిలేట్

Published : Jul 15, 2024, 07:32 AM ISTUpdated : Jul 15, 2024, 07:51 AM IST

కెరీర్​లో తీసిన మూడో సినిమాతోనే అశ్విన్ రూ.1000కోట్ల క్లబ్​లో చేరిపోయారు. అయితే ఇలాంటి సంతోష సమయంలో అనవసరమైన వివాదానికి తెరతీశాడు నాగ్ అశ్విన్. 

PREV
111
సందీప్ వంగాని  టార్గెట్‌ చేస్తూ నాగ్‌ అశ్విన్‌ షాకింగ్ కామెంట్స్‌? కాసేపట్లో  పోస్ట్ డిలేట్
Nag Ashwin


దర్శకుడుగా నాగ్ అశ్విన్ ఇవాళ టాలీవుడ్ లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా హాట్ టాపిక్ గా మారారు. ఆయన అడిగితే డేట్స్ ఇవ్వటానికి స్టార్ హీరోలు సిద్దంగా ఉన్నారు. ఆయన చాలా సైలెంట్ గా తన పనేదో తాను చేసుకుపోయే రకం. వేరే వాళ్లపై కామెంట్ చేయటం లేదా వేరే సినిమాలను విమర్శించటం ఎప్పుడూ చేయలేదు. అయితే తాజాగా ఆయన సందీప్ వంగాని ఉద్దేశించి ఇండైరక్ట్ గా  పోస్ట్ పెట్టారనేది రచ్చగా మారింది. ఆ పోస్ట్ ని ఆయన డిలేట్ చేసేసారు. అయితే ఆయన పెట్టిన ఆ పోస్ట్ సందీప్ వంగాని ఉద్దేశించిందేనా, అసలేం జరిగింది? 

211
Nag Ashwin


నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రికార్డులు తిరగరాస్తూ సంచలనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రంపై మొదటి రోజు కాస్త డివైడ్ టాక్ నడిచినా తర్వాత బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తో దూసుకుపోయింది.  ఈ సినిమా కోసం దర్శకుడు నాగ్ అశ్విన్ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు. హై క్వాలిటీ వీఎఫ్ ఎక్స్​, సీజీ వర్క్స్​తో వండర్స్ క్రియేట్ చేయటం కలిసొచ్చింది. దాంతో  కెరీర్​లో తీసిన మూడో సినిమాతోనే అశ్విన్ రూ.1000కోట్ల క్లబ్​లో చేరిపోయారు. 

311
Director Nag Ashwin


అయితే ఇలాంటి సంతోష సమయంలో అనవసరమైన వివాదానికి తెరతీశాడు నాగ్ అశ్విన్. 'కల్కి' మూవీ 1000 కోట్ల క్లబ్ లో చేరిన సందర్భంగా తన సంతోషాన్ని పంచుకుంటూ ఇన్ స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు నాగ్ అశ్విన్. అయితే ఇందులో ఆయన రాసినది కాంట్రవర్సీ అవుతోంది. రక్తపాతం, అశ్లీలత లేకుండా ఈ ఘనత సాధించడం ఎంతో ఆనందంగా ఉందంటూ నాగ్ అశ్విన్ రాసుకొచ్చాడు. ఈ కామెంట్స్ పరోక్షంగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను టార్గెట్ చేసినట్టుగా ఉన్నాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

411

ఈ ఇనిస్ట్రా పోస్ట్... యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాని ఉద్దేశించేనని కొందరు తమకు తోచినట్లు చెప్పటంతోనే ఈ సమస్య వచ్చిందంటున్నారు. దాంతో ఈ పోస్ట్  కాస్తా నిమిషాల్లో వైరలయిపోయింది.వాస్తవానికి  నాగ్ అశ్విన్ అక్కడ ఎవరి పేరుని ప్రస్తావించలేదు. కేవలం కల్కి క్లీన్ ఎంటర్ టైనర్ అనే ఉద్దేశంలో చెప్పాలనుకుని అలా రాసుకొచ్చారనేది కొందరి అభిప్రాయం.

511


"ఈ మైలురాయి… ఈ నెంబర్‌(₹1000 కోట్లు)... నిజానికి మనలాంటి యువతకు ఇదోక పెద్ద విజయమే. కానీ, వాస్తవానికి ఇక్కడ ఎలాంటి రక్థం, గోర్‌, అశ్లీలత, రెచ్చగొట్టే.. దోపిడీ కంటెంట్ లేదు. అయినా ఈ మైలురాయిని మనం సాధించడమంటే చిన్న విషయం కాదు... మూవీని ఆదరించి పెద్ద విజయానికి కారణమైన ప్రేక్షకులకు, నటీనటులకు బిగ్ థ్యాంక్యూ. ఇది ఇండియన్‌, రేపటికోసం #Repatikosam" అని రాసుకొచ్చారు. ఇక నాగ్‌ అశ్విన్‌  ఈ కామెంట్స్‌ సెన్సేషనల్‌ డైరెక్టర్‌ సందీప్ వంగాని ఉద్దేశించి చేశారా? అని సోషల్ మీడియాలో కామెంట్స్ మొదలు కాగానే రచ్చ మొదలైంది. 

611
Kalki 2829 AD


సోషల్ మీడియా జనం దృష్టి డైరక్టర్ గా సందీప్ వంగాపై వెళ్లటానికి కారణం...యానిమల్ చిత్రంలో హింస విపరీతంగా ఉందని విమర్శలు ఎదుర్కోవటమే. సందీప్‌ రెడ్డి వంగా సినిమాలు బోల్డ్ కంటెంట్‌కు కేరాఫ్‌ గా ఉంటున్నాయి. వాయిలెన్స్‌, బోల్డ్‌నెస్‌ ఎక్కువగా ఉంటుంది. దీనికి అర్జున్‌ రెడ్డి, ఇటీవల వచ్చిన యానిమల్‌ చిత్రాలే ఉదాహరణ. యానిమల్  చిత్రం కలెక్షన్స్ పరంగా భీబత్సమే సృష్టించింది. అందుకే ఈ సినిమాని,సందీప్ వంగని ఉద్దేశించే నాగ్ అశ్విన్ అన్నారని జనం ఫిక్స్ అయ్యిపోయారు. 

711
Nag Ashwin


ఈ క్రమంలో సందీప్ వంగా ఫ్యాన్స్ సీన్ లోకి వస్తున్నారు. వాళ్లు ఈ రెండు చిత్రాలకు పోలిక పెడుతున్నారు.  సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసిన 'యానిమల్' కంటే మూడు నాలుగు రెట్లు ఎక్కువ బడ్జెట్ తో 'కల్కి' రూపొందిందని.. కానీ 'యానిమల్' రూ.900 కోట్లు కలెక్ట్ చేస్తే, ఎందరో స్టార్స్ తో రూపొందించిన 'కల్కి' రూ.1000 కోట్లు కలెక్ట్ చేసిందని గుర్తు చేస్తున్నారు.  
 

811
Nag Ashwin


నాగ్ అశ్విన్ తమ కల్కి సినిమా కు ప్రేరణ గురించి చెప్తూ... 'చాలామంది తమ జీవితంలో ఎవరినో ఒకరిని స్ఫూర్తిగా తీసుకుంటారు. తాము చేసే పనుల్లోనూ ఎవరిదో ఒకరి ప్రభావం ఉంటుంది. అయితే నా విషయంలో అది పూర్తి భిన్నం. నాకు స్ఫూర్తినిచ్చింది వ్యక్తులు కాదు. నాకు ఎంతో ఇష్టమైన 'మాయాబజార్', 'భైరవ ద్వీపం', 'పాతాళభైరవి', 'స్టార్ వార్స్​', 'మార్వెల్ సిరీస్​' సినిమాలు. ఇవి ప్రేక్షకులను ఇంకో లోకంలోకి తీసుకువెళ్తాయి. 

911
Nag Ashwin

అలాగే ఈ స్టోరీలు విన్నా, మన కళ్ల ఎదుట మరో ప్రపంచం కనిపిస్తుంది. ఈ సినిమాలు నా జీవితంలో నన్ను ఎంతగానో ప్రభావితం చేశాయి. నేను కూడా అలాంటి సినిమాలు తీయాలనే స్ఫూర్తిని నింపాయి. ఒక విధంగా 'కల్కి' ఆలోచన కూడ అక్కడ్నుంచి వచ్చిందే. స్టోరీతోపాటు సినిమాలో కొత్త కొత్త ప్రాంతాల ఆలోచనకు ఈ చిత్రాలే ఒక రకమైన కారణం అని చెప్పుకొచ్చారు. ఇది బాలయ్య అభిమానులను ఆనందంలో ముంచెత్తుతోంది. 

1011

 ‘కల్కి 2898 ఏడీ’ రన్‌టైమ్‌ 3.01 గంటలున్న విషయం తెలిసిందే.  రన్ టైమ్ ఇష్యూ పైనా నాగ్ అశ్విన్‌ స్పందించారు. తనకు ఎంత టైమ్ ఉన్నా ఎడిట్ చేసేందుకు సరిపోదన్నారు. ‘సినిమా కోసం పడిన కష్టమంతా దాని ఫలితం చూశాక మర్చిపోయాం. అన్ని ప్రాంతాల నుంచి వచ్చే ఆదరణ చూస్తుంటే ఆనందంతో పాటు భావోద్వేగంగాను ఉంది. చిన్నచిన్న ప్రాంతాల్లోనూ మంచి విజయం సాధించింది. ఇలాంటి సినిమాల కోసం నాకు మరో నెల సమయం ఇచ్చినా సరిపోదు. ఇంకాస్త సమయం ఉంటే బాగుండునని భావిస్తాను. కొందరు దీని రన్‌టైమ్‌ను విమర్శించారు. నేను విమర్శలను కూడా సానుకూలంగానే తీసుకుంటాను. ఎందుకంటే వాటిల్లో కూడా మనకు తెలియని పాయింట్లు చాలా ఉంటాయి’.

1111
nag ashwin


‘ఇది మొదటి భాగం. ఇందులోనే అన్ని పాత్రలను పరిచయం చేయాల్సిన అవసరం ఉంది. అందుకే అంత రన్‌టైమ్ వచ్చింది. కొందరు దీన్ని ‘మహానటి’తో పోలుస్తున్నారు. ఆ చిత్రానికి, కల్కికి చాలా తేడా ఉంది. రెండూ భిన్నమైన కథలు. అది కేవలం ఒక మహిళకు చెందిన కథ, ఆమె పాత్ర మాత్రమే ప్రాధానమైనది. ఇందులో చాలామంది అగ్రతారలు ఉన్నారు. వాళ్ల పాత్రలన్నీ కీలకమైనవే. వాళ్ల పాత్రల చుట్టూ కథ అల్లుకుపోవాలి’ అని చెప్పారు. 

Read more Photos on
click me!

Recommended Stories