
రౌడీ హీరో విజయ దేవరకొండ, ప్రముఖ టీవీ యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ మధ్య విభేదాలు అందరికీ తెలిసినవే. సోషల్ మీడియా వేదికగా అనసూయను లక్ష్యంగా చేసుకుని విజయ్ దేవరకొండ అభిమానులు పెద్ద ఎత్తున ట్రోల్ చేయడం, కామెంట్లు, దూషణలతో విరుచుకుపడడం తెలిసిందే. రీసెంట్ గా ఖుషీ సినిమా పోస్టర్ పై విజయ్ దేవరకొండ పేరు ముందు 'ద' అని పేర్కొనడాన్ని పైత్యంగా అనసూయ అభివర్ణించింది. అయితే ఈ విభేధాలపై అనసూయ డైరక్ట్ గా స్పందించిందిలేదు. కానీ తొలిసారిగా ఈ అంశాలపై అనసూయ భరద్వాజ్ తన స్పందనను ఓ మీడియా సంస్థతో పంచుకుంది.
అనసూయ మాట్లాడుతూ... ‘‘విజయ్, నేను లోగడ స్నేహితులమే. అప్పుడు ఏ సమస్యా లేదు. అర్జున్ రెడ్డి (2017) విడుదల అయిన తర్వాతే పరిస్థితి మారింది. ఆ సినిమాలో విజయ్ దేవరకొండ బూతులను మ్యూట్ చేశారు. విజయ్ ఓ థియేటర్ ను సందర్శించినప్పుడు వాటిని ఆన్ స్క్రీన్ పై వేశారు. వాటిని పలకాలని విజయ్ దేవరకొండ అభిమానులను కోరాడు. వారు ఆ బూతు పదాలను మాట్లాడారు.
విజయ్ ఆ సినిమాలో ధూషించే పాత్రను పోషించాడు. సినిమా వరకు బాగానే ఉంది. కానీ, నిజ జీవితంలో ప్రేక్షకులను ఆ పదాలు పలికేలా ప్రోత్సహించడం ఏంటి? ఓ తల్లిగా ఇలాంటి అసభ్యకర పదాలు నన్ను బాధిస్తాయి. నేను దీనిపై విజయ్ తో మాట్లాడాను. నిజజీవితంలో వాటిని ప్రోత్సహించొద్దని కోరాను’’ అని అనసూయ వివరించింది. ఆన్ లైన్ లో మహిళలను యువత దూషించడం పెరిగిపోయినట్టు అనసూయ పేర్కొంది.
విజయ్ దేవరకొండ తండ్రి 2019లో 'మీకు మాత్రమే చెప్తా' సినిమాని నిర్మిస్తున్న సమయంలో తనకు పాత్రను ఆఫర్ చేసినట్టు అనసూయ తెలిపింది. ‘‘విజయ్ ప్రచారకర్త తనను దర్భాషలాడుతూ పోస్టులు పెట్టినట్టు అతడి బృందానికే చెందిన ఒకరు నాకు చెప్పారు. ప్రచారకర్త పెయిడ్ ట్రోల్స్ చేస్తున్నప్పుడు దానిపై విజయ్ కు అవగాహన ఉంటుంది కదా? అతడికి తెలియకుండా వారు ఇలాంటివి చేయరని నేను ఖచ్చితంగా చెప్పగలను’’ అని అనసూయ తన ఆవేదన వ్యక్తం చేసింది.
విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘ఖుషి’ పోస్టర్‌లో ‘ది దేవరకొండ’ అని వేసుకుంటే నీకెందుకు? ‘ద దేవరకొండ’ అని వేసుకుంటే నీకెందుకు? అతని సినిమా అతని ఇష్టం.. మధ్యలో అతన్ని కెలకడం ఎందుకు? అతని ఫ్యాన్స్‌తో తిట్టించుకోవడం ఎందుకు? తాజా వివాదంపై యాంకర్ అనసూయపై నెటిజన్ల నుంచి.. విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ నుంచి వస్తున్న ప్రశ్నలు ఇవే.
నిజానికి అనసూయ.. విజయ్ దేవరకొండ పేరు ప్రస్తావించకుండానే మంట పెట్టేసింది. అసలే రౌడీ ఫ్యాన్స్ ఊరుకుంటారా? అనసూయను ఆంటీ పేరుతో ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు. ఇక అనసూయ మాత్రం తక్కువా.. వాళ్లు ఒకటి అంటే రెండు అంటా అన్నట్టుగా విజయ్ ఫ్యాన్స్‌కి కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తుంది.
అయితే తన గురించి జనం మరిచిపోతున్నారన్నపుడల్లా.. అనసూయ ఇలాంటి వివాదాల్లో వేలు పెడుతూనే ఉంటుందనే విమర్శలు ఉన్నాయి. అయితే ఆ తరువాత మీడియాపై నోరు పారేసుకోవడం కామనే అంటున్నారు. ఈ వివాదంపై కూడా ఎప్పటిలాగే మీడియాపై నోరు పారేసుకుంది అనసూయ.
నిజానికి విజయ్‌ని అతని ఫ్యాన్స్‌ని కెలకాలని కాకపోతే.. ఆ పోస్టర్‌లో ద దేవరకొండ అని పెట్టుకుంటే అనసూయకి ఏం సంబంధం అనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. నిజానికి అనసూయ.. ఎన్ని సినిమాలు చేసినా.. కామెడీ షోలు చేసినా కూడా అప్పట్లో అర్జున్ రెడ్డి వివాదంతోనే బాగా హాట్ టాపిక్ అయ్యింది. ఆంటీ అంటూ ఓ రేంజ్‌లో ట్రోల్ అయ్యింది. ఇప్పుడు మళ్లీ కాస్త గ్యాప్ ఇచ్చి విజయ్ దేవరకొండని కెలికింది అనసూయ.
తన ఫేస్ బుక్ స్టోరీలో అనసూయ వీడియో వదిలింది. ‘నస పెట్టను సూటిగా పాయింట్‌కి వచ్చేస్తా.. కొన్ని వెబ్ సైట్స్, యూట్యూబ్ ఛానల్స్.. మాలాంటి పబ్లిక్ ఫిగర్స్, పేరున్న వాళ్లపై వార్తలు రాసి పొట్ట నింపుకునేవాళ్ల కోసం నేను చెప్పబోతున్నాను. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏసుకున్నారు. సో అండ్ సో ఫ్యాన్స్ అనసూయని ఏడిపించారు.. ట్రోల్ చేశారు.. అని కాదు రాయాల్సింది
మీకింకా దునియా దారి తెలియదని చెప్తున్నా.. మీకు క్లారిటీ ఇస్తున్నా.. పడ్డవాడు ఎప్పుడూ చెడ్డ వాడు కాదు.. అన్నవాడి నోరే కంపు.. మీకు ధైర్యం ఉంటే.. ఉప్పు కారాలు తిని ఉంటే నిజం రాయండి. నేను ధైర్యంగా నా అభిప్రాయం చెప్పడం జరిగింది. చేతకాని వాళ్లు అదుపుతప్పారు. ఇది మీరు రాయాల్సింది’ అంటూ బెటర్ లక్ నెక్స్ట్ టైం అనేసింది అనసూయ.
యాంకర్ అనసూయ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉంది. థాయిలాండ్ బీచ్‌లో భర్తతో హాయిహాయిగా ఎంజాయ్ చేస్తున్న అనసూయ.. లిప్‌లాక్, బికినీ ఫొటోలతో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎప్పుడూ లేనంతగా ఫ్యాన్స్‌కు హాట్ ట్రీట్ ఇచ్చింది. అది కూడా ఒకదాని తర్వాత ఒకటి వదలుతూనే ఉంది.
'అర్జున్ రెడ్డి'ని మరిపించే కిస్సింగ్ ఫొటో అయితే హైలెట్. ఇక ఆ తర్వాత బికినీలో అందాలు ఆరబోస్తూ రంగమత్త చేసిన హడావిడి అయితే వేరే లెవల్. ఇక వరసగా ఇలా అనసూయ పోస్ట్ చేసిన ఫొటోలు, వీడియోలు చూసి ఫ్యాన్సే అవాక్కవుతున్నారు. అయితే విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ మాత్రం అనసూయను ఓ ఆట ఆడుకుంటున్నారు.
ఇక సినిమాల్లో నటిగానే నిరూపించకోవాలనుకుంటున్నట్టు తెలిపింది. దీనికితోడు తన పిల్లలు పెద్దగా అవుతున్నారు. వారికి తనపై వచ్చే కామెంట్లు, ట్రోల్స్ అర్థమవుతున్నాయనే ఉద్దేశ్యంతో తాను టీవీ నుంచి తప్పుకున్నట్టు తెలిపింది అనసూయ. దీనికితోడు గ్లామర్ ఫోటో షూట్లు కూడా తగ్గించింది. అడపాదడపా చాలా తక్కువగానే ఫోటో షూట్ పిక్స్ పంచుకుంటుంది.
తాజాగా ఇన్‌స్టాలో అనసూయ ఇలా లిప్‌లాక్, బికినీ వీడియోలు పోస్ట్ చేయడంతో రౌడీ ఫ్యాన్స్ రంగంలోకి దిగారు. "ఆ రోజు అర్జున్ రెడ్డి బూతు అన్న నీకు ఇవి బూతులా కనిపించడం లేదా, హక్కులు నీకు మాత్రమే ఉంటాయా?, నీతులు నీకు వర్తించవా, ఈ ఫొటోలు, వీడియోలతో సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నావ్" అంటూ విజయ్ ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు.