పబ్లిక్ లో అనసూయ క్రేజ్... అనంతపురంలో ఉక్కిరిబిక్కిరి చేసిన కుర్రాళ్ళు!

Published : Dec 19, 2023, 10:19 AM ISTUpdated : Dec 19, 2023, 10:38 AM IST

పేరుకే యాంకర్ కానీ అనసూయకు స్టార్ హీరోయిన్ రేంజ్ పాపులారిటీ ఉంది. ఆమె పబ్లిక్ లోకి వస్తే కుర్రాళ్ళు వెర్రెత్తిపోతారు. ఇటీవల అనసూయ అనంతపురం వెళ్ళింది. ఆమెను చూసేందుకు కుర్రాళ్ళు ఎగబడ్డారు.

PREV
18
పబ్లిక్ లో అనసూయ క్రేజ్... అనంతపురంలో ఉక్కిరిబిక్కిరి చేసిన కుర్రాళ్ళు!

గ్లామరస్ యాంకర్స్ కి అనసూయ భరద్వాజ్ బ్రాండ్ అంబాసిడర్. తెలుగు యాంకరింగ్ కి గ్లామర్ పరిచయం చేసింది ఆమెనే. జబర్దస్త్ వేదికగా పొట్టిబట్టల్లో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. 
 

28

జబర్దస్త్ షో ఆమెను స్టార్ చేసింది. అదే సమయంలో విమర్శలపాలు కూడా అయ్యింది. అనసూయ డ్రెస్సింగ్ పై విపరీతమైన వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. ఐ డోంట్ కేర్ అన్న అనసూయ... నా బట్టలు నా ఇష్టం అని కొట్టిపారేసింది. 

 

38

కొన్నాళ్లుగా అనసూయ యాంకరింగ్ కి దూరమైంది. అక్కడ టీఆర్పీ స్టంట్స్ ఎక్కువైపోయాయి. అవి నచ్చకే యాంకరింగ్ మానేశాను అని చెప్పింది. అలాగే నటిగా, యాంకర్ గా చేస్తుంటే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ అవుతున్నారని ఆమె కారణం చెప్పారు 

48
Anasuya Bharadwaj Hot Photos

పూర్తి దృష్టి నటనపై పెట్టిన అనసూయ వరుసగా చిత్రాలు చేస్తుంది. ఈ ఏడాది అనసూయ నటించిన అరడజను చిత్రాలు విడుదలయ్యాయి. మైఖేల్, రంగమార్తాండ, విమానం, పెదకాపు 1, ప్రేమ విమానం చిత్రాల్లో ఆమె నటించింది. 

58

విమానం మూవీలో అనసూయ వేశ్య పాత్ర చేయడం కొసమెరుపు. వెయ్యి రూపాయలు ఇస్తే ఎవడైనా ఓకే అని ఆమె చెప్పిన డైలాగ్ చాలా బోల్డ్ గా ఉంటుంది. వేశ్య పాత్ర చేసి తన గట్స్ ఏమిటో నిరూపించుకుంది. 

68
Anasuya Bharadwaj

నెక్స్ట్ పుష్ప 2లో కీలక రోల్ చేస్తుంది. దాక్షాయణిగా నెగిటివ్ రోల్ లో ఆకట్టుకోనుంది. చిత్రీకరణ జరుపుకుంటున్న పుష్ప 2 వచ్చే ఏడాది ఆగస్టు 15న విడుదల కానుంది. మరి కొన్ని ప్రాజెక్ట్స్ ఆమె చేతిలో ఉన్నాయి. 

 

78
Anasuya bharadwaj

ఒక ప్రక్క నటిగా సంపాదిస్తున్న అనసూయ ప్రమోషన్స్ ద్వారా లక్షల్లో ఆర్జిస్తోంది. అనసూయది లక్కీ హ్యాండ్ అని వ్యాపారాలు భావిస్తున్నారు. అందుకే కొంచెం రేటు ఎక్కువైనా ఆమెతో షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయిస్తున్నారు. 

88
Anasuya bharadwaj

తాజాగా అనసూయ అనంతపురంలో మగువ అనే షాపింగ్ మాల్ ఓపెన్ చేసింది. అనసూయ వస్తున్న విషయం తెలుసుకున్న కుర్రాళ్ళు అక్కడకు చేరుకున్నారు. ఆమెను చూసేందుకు ఎగబడ్డారు. అనసూయను చూసి కేకలు వేస్తూ గోల చేశారు. వారితో మాట్లాడిన అనసూయ ధన్యవాదాలు చెప్పుకుంది... 
 

Read more Photos on
click me!

Recommended Stories