అనసూయ బర్త్ డే సెలబ్రేషన్స్.. డీప్ నెక్ బ్లౌజ్ లో మెరుపులు.. ఫ్లైయింగ్ కిస్సులతో రచ్చ..

First Published | May 15, 2023, 9:18 PM IST

స్టార్ యాంకర్ అనసూయ కుటుంబ సభ్యులతో కలిసి తన బర్త్ డే వేడుకులను జరుపుకుంది. ఈ సందర్భంగా చీరకట్టులో మెరిసిపోతోంది. కొన్ని ఫొటోలను అభిమానులతోనూ పంచుకుంది. బ్యూటీఫుల్ లుక్ తో కట్టిపడేస్తోంది.
 

బుల్లితెర స్టార్ యాంకర్ గా అనసూయ అందరికీ సుపరిచితమే. ప్రస్తుతం వరుస చిత్రాలతోనూ నటిగా దూసుకుపోతోంది. బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్టులతో, విభిన్న పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులకు మరింత దగ్గరవుతోంది. అయితే ఈరోజు అనసూయకు చాలా ప్రత్యేకం. ఎందుకంటే అనసూయ పుట్టిన రోజే ఇవ్వాళే. 
 

అనసూయ హైదరాబాద్ లోనే జన్మించింది. 1985 మే 15న పుట్టింది. తాజాగా ఈ స్టార్ యాంకర్ 38వ అడుగుపెట్టింది. 2008లోనే ఎంబీఏలో పట్టా పొందింది. ఆ తర్వాత హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్ గా జామ్ కూడా చేసింది. పలు చానెళ్లలో యాంకర్ గా వర్క్ చేసింది. 2013లో ‘జబర్దస్త్’ యాంకర్ గా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అయ్యింది.
 


పదేళ్లుగా తెలుగు ఆడియెన్స్ ను బుల్లితెర ద్వారా అలరిస్తూ వచ్చింది. అలాగే వెండితెరపైనా కీలక పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తోంది. ఇదిలా ఉంటే.. ఇవాళ అనసూయ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యామిలీతోనే వేడుక చేసుకుంది. కుటుంబ సభ్యులు కేక్ కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 

కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఫొటోలను తన అభిమానులతోనూ  పంచుకుంది. కుటుంబ సభ్యులు, తన పిల్లలు, భర్తతో దిగిన పిక్స్ ను షేర్ చేసింది. ఈ పోస్టు పెడుతూ క్రేజీ క్యాప్షన్ ఇచ్చింది. ‘ఇంకో సంవత్సరం తెలివిగా..  మరో సంవత్సరం ధైర్యంగా’ ఉండబోతున్నట్టు పేర్కొంది. 
 

అలాగే ‘నాకు బర్త్ డే విషెస్ తెలిసిన ప్రతి ఒక్కరికి  ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను ప్రేమించే, నాకు మద్దతునిచ్చే అతి తక్కువ  శక్తివంతమైన వారికి థ్యాంక్స్’ అంటూ క్యాప్షన్ లో తెలిపింది. ఇక అనసూయ అభిమానులు, పలువురు సెలబ్రెటీలు ఈ బ్యూటీకి శుభాకాంక్షలు తెలుపుతూనే ఉన్నారు. 

అదేవిధంగా అనసూయ పంచుకున్న ఫొటోల్లో బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. చీరకట్టు, డీప్ నెక్ బ్లౌజ్ లో అందాలను ఆరబోసింది. భర్త నుంచి ముద్దులు తీసుకుంటూ..  ఫ్యాన్స్ కు ఫ్లైయింగ్ కిస్సులను వదిలింది. తనపై చూపిస్తున్న ప్రేమతో సంతోషంగా కనిపించింది. 
 

మామూలుగానే అనసూయ ఫొటోషూట్ నెట్టింట దుమారం రేపుతుంటుంది. ఇక బర్త్ డే సందర్భంగా మరింతగా డోస్ పెంచి దర్శనమివ్వడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక అనసూయ రీసెంట్ గా ‘రంగమార్తాండ’తో అలరించింది. ప్రస్తుతం ‘పుష్ప 2 ది రూల్’, ‘విమానం’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
 

Latest Videos

click me!