నిషా కళ్లతో మైకం తెప్పిస్తున్న రష్మీ గౌతమ్.. ఆరెంజ్ డ్రెస్ లో స్టార్ యాంకర్ మెరుపులు.. అదిరిన పోజులు

First Published | May 15, 2023, 7:21 PM IST

స్టార్ యాంకర్, నటి రష్మీ గౌతమ్ (Rashmi Gautam) తన బ్యూటీఫుల్ ఫొటోషూట్ తో మంత్రముగ్ధులను చేస్తోంది. ‘జబర్దస్త్’ పోజులతో కుర్ర గుండెల్ని కొల్లగొట్టింది. తాజాగా పంచుకున్న ఫొటోలతో కట్టిపడేస్తోంది. 
 

బుల్లితెర అందాల యాంకర్ రష్మీ గౌతమ్ ఆడియెన్స్ లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ ను సంపాదించుకుంది. తొలుత నటిగానే కేరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత యాంకర్ గా మారి ప్రేక్షకులను అలరిస్తోంది. స్మాల్ స్క్రీన్ పై సందడి చేస్తోంది.
 

‘జబర్దస్త్’ యాంకర్ గా రష్మీగౌతమ్ కు మంచి గుర్తింపు దక్కింది. చురుకుదనం, వాక్ చాతుర్యంతో బుల్లితెరపై తనదైన ముద్ర వేసుకుంది. స్టార్ యాంకర్ గా బిజీగా మారిపోయింది. మరోవైపు చిన్నతెరపై అందాలను ఒళకబోసి ఆడియెన్స్ ను కట్టిపడేసింది. మొత్తంగా భారీగానే క్రేజ్ దక్కించుకుంది.
 


ఇదిలా ఉంటే రష్మీ గౌతమ్ ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపిస్తుంటారనే విషయం తెలిసిందే. తన వ్యక్తిగత విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటారు. అలాగే తను మెరిసే షోలకోసం అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు కూడా చేస్తుంటుంది.
 

తాజాగా ఆరెంజ్ కలర్ డ్రెస్ లో మెరిసింది. బ్యూటీఫుల్ లుక్ ను సొంతం చేసుకుంది. వన్ షోల్డర్ డ్రెస్ లో గ్లామర్ మెరుపులు మెరిపించింది. ఆ ఫొటోలను అభిమానులతోనూ పంచుకోవడంతో ఫిదా అవుతున్నారు. రష్మీ అందానికి మైమరిచిపోతున్నారు. 
 

లేటెస్ట్ పిక్స్ లో రష్మీ అందంతో ఆకట్టుకోవడంతో పాటు మతులుపోయేలా ఫోజులూ ఇచ్చింది. అన్ని యాంగిల్లో స్టిల్స్ ఇచ్చి అదరగొట్టింది. మత్తెక్కించే చూపులు.. మతులు చెడగొట్టే పోజులతో అందాలను ఆరబోసింది. దీంతో ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు కామెంట్లతో పొగుడుతున్నారు. 
 

రష్మీ షేర్ చేసిన ఫొటోలపై సీనియర్ నటి ప్రియమణి కూడా స్పందించారు. పిక్స్ ను లైక్ చేస్తూ ఎంకరేజ్ చేశారు. మరోవైపు ఫ్యాన్స్ రష్మీ బ్యూటీఫుల్ లుక్ కు స్టన్ అవుతున్నారు. హార్ట్ ఎమోజీలు, ఫైర్ ఎమోజీలను వదులతూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. 
 

ఇక రష్మీ బుల్లితెరపై యాంకర్ గా తన కేరీర్ ను కొనసాగిస్తూనే ఉన్నారు. కొద్దిరోజులు Jabardasthకు దూరమైనా తిరిగి వచ్చి అలరిస్తున్నారు. మరోవైపు నటిగానూ వెండితెరపై మెరిసేందుకు ప్రయత్నిస్తూనే ఉంటున్నారు. వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. 
 

గుంటూరు టాకీస్, అంతం, నెక్ట్స్ నువ్వే, అంతకు మించి వంటి చిత్రాల్లో హీరోయిన్ గా మెప్పించింది. అయినా ఈ ముద్దుగుమ్మకు హీరోయిన్ గా తగిన గుర్తింపు దక్కడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ‘భోళా శంకర్’లో నటిస్తోంది. 

Latest Videos

click me!