సినీ తరాలకు ఆదాయం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్, షో రూమ్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా వస్తుంది. అనసూయ తాజాగా ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ లో పాల్గొన్నారు.
టాలీవుడ్ క్రేజీ యాంకర్, నటి అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అనసూయ యాంకర్ గా ఎంత పాపులర్ అయిందో అంతకి మించేలా నటిగా గుర్తింపు పొందింది. అనసూయ సోషల్ మీడియాలో తన గ్లామర్ తో చేసే హంగామా అంతా ఇంతా కాదు. అనసూయని ఇన్స్టాగ్రామ్ లో 1.6 మిలియన్ల మంది ఫాలో అవుతున్నారు.
27
సినీ తరాలకు ఆదాయం సినిమాల ద్వారా మాత్రమే కాదు.. కమర్షియల్ యాడ్స్, షాపింగ్ మాల్స్, షో రూమ్స్ ఓపెనింగ్స్ ద్వారా కూడా వస్తుంది. అనసూయ లాంటి క్రేజీ సెలెబ్రిటీలు, హీరోయిన్లు తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్ లో పాల్గొనడం చూస్తూనే ఉన్నాం.
37
అనసూయ అయితే తరచుగా షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ లో సందడి చేస్తూనే ఉంటుంది. రీసెంట్ గా అనసూయ ఓ షాపింగ్ మాల్ ఓపెనింగ్ కోసం మదనపల్లికి వెళ్ళింది.
అక్కడ అనసూయకి డప్పులు, మేళాలతో అనసూయకి ఘనస్వాగతం లభించింది. అంతే కాదు అభిమానుల కోలాహలంతో రోడ్లు కిక్కిరిసిపోయాయి. ఆ దృశ్యాలని అనసూయ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
57
తన ఫోటోలకు అందమైన క్యాప్షన్ కూడా ఇచ్చింది. ఇటీవల కాలంలో నా ఆలోచన ఇలా ఉంది.. ట్రెడిషనల్ లుక్ ని మోడ్రన్ గా చూపించాలని అనుకుంటున్నా అంటూ పోస్ట్ చేసింది.
67
అనసూయ చివరగా హరిహర వీరమల్లు చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ప్రస్తుతం అనసూయ కొన్ని తమిళ చిత్రాల్లో నటిస్తున్నారు. అనసూయ షేర్ చేసిన శారీ ఫొటోస్ నెటిజన్లని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.
77
అనసూయ తన కెరీర్ లో రంగస్థలం, క్షణం, పుష్ప, సోగ్గాడే చిన్నినాయనా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. రంగస్థలంలో అనసూయ పోషించిన రంగమ్మత్త పాత్రకి విశేషమైన గుర్తింపు దక్కింది.