Intinti Gruhalakshmi: పరంధామయ్య పుట్టినరోజు.. నందు ఇంట్లో మొదలైన గొడవలు!

Published : Nov 07, 2022, 11:16 AM IST

Intinti Gruhalakshmi: బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి  (Intinti Gruhalakshmi) సీరియల్ మంచి కాన్సెప్ట్ తో కొనసాగుతుంది. భర్తతో విడిపోయి కుటుంబం కోసం ఒంటరిగా పోరాడే మహిళ కాన్సెప్ట్ తో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ ఈరోజు నవంబర్ 7వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో హైలెట్స్ తెలుసుకుందాం..  

PREV
15
Intinti Gruhalakshmi: పరంధామయ్య పుట్టినరోజు.. నందు ఇంట్లో మొదలైన గొడవలు!

ఈరోజు ఎపిసోడ్ ప్రారంభంలోనే.. కావాలని గొడవలు తెచ్చే ఉద్దేశ్యం ఎవరికి ఉంటుందని లాస్య వైపు చూస్తారు.. అప్పుడు లాస్య అనసూయని గొడవలు రాకుండా ఉండేందుకు ఏం చెయ్యాలో చెప్పమని సలహా అడుగుతారు. ఆతర్వాత పరంధామయ్య పుట్టినరోజు అని తెలుసుకొని అందరూ సెలబ్రేట్ చెయ్యాలని అనుకుంటారు. జరిగిన గొడవలన్నీ మర్చిపోదాం అని అంటుంది. తులసి, సామ్రాట్ పేర్లను బయటకు రాకూడదని అంటే ప్రేమ్ అరుస్తాడు. 
 

25

కొత్త కొత్త రూల్స్ అవసరం లేదంటూ ప్రేమ్ చెప్తాడు. పరంధామయ్య పుట్టినరోజుకు తులసిని పిలిచేది లేదంటూ అనసూయ చెప్తుంది. దాంతో అక్కడ నుంచి పరంధామయ్య చెయ్యి కడిగేసుకొని వెళ్ళిపోతాడు. తులసి సపోర్ట్స్ అంత కూడా తినకుండా వెళ్ళిపోతారు. ఇదంతా తులసి వల్లే ఇంటి నుంచి వెళ్ళిపోయి కూడా సాధిస్తోందంటూ అనసూయ కూడా తినకుండా వెళ్ళిపోతుంది. మరోవైపు తులసి వాళ్ళ అమ్మ తులసి వెళ్ళిపోతుందని బాధ పడుతుంది.  
 

35

నువ్వు పుట్టింటికి వచ్చావ్ అని ఆనందపడుతుంటే మళ్లీ వెళ్ళిపోతే అంటావ్ ఏంటి అని బాధపడుతుంది. తప్పదు అమ్మ బయట జనాలు నిన్ను ఏదోకటి నాగురించి అంటారు అని తులసి అంటుంది. నీదగ్గరే ఉంటే నేను ఇక్కడే ఆగిపోతాను అమ్మ నేను ఏదైనా సాదించాలి అని అంటుంది తులసి. ఆతర్వాత సీన్ లో సామ్రాట్ తులసి గురించి ఆలోచిస్తుంటాడు. అప్పుడు సామ్రాట్ బాబాయ్ ఏంటి నువ్వు కూడా రేపు తులసితో పాటు ఇల్లు వెతకడానికి వెళ్తావా అంటే.. 
 

45

అవసరం లేదు ఆల్రెడీ ఇంటి కోసం అంత సెట్ చేశాను అని అంటాడు. తులసి పెళ్లి చేసుకుందాం అని అంటే ఎస్ అంటావా అని వాళ్ళ బాబాయ్ అడుగుతాడు.. అప్పుడు సామ్రాట్ ఆలోచిస్తూ ఉండడంతో సరే ఆలోచించుకో అని చెప్పి వెళ్తాడు. మరోవైపు తులసికి దివ్య ఫోన్ చేస్తుంది. నేను నీతో వచ్చేస్తా మామ్ అని అంటే వొద్దు దివ్య.. నువ్వు దైర్యంగా ఉండాలి అని తులసి అని చెప్పి ఫోన్ పేట్టేస్తుంది.  
 

55

సీన్ కట్ చేస్తే.. అనసూయ పరంధామయ్యకు కాఫీ తెచ్చిస్తే నాకు ఒద్దు అని అంటాడు. ఎందుకు ఒద్దు అంటే నేను కాఫీ తాగడం మానేశాను అని సీన్ చేస్తాడు. మనసుకు నచ్చింది దూరం అవుతే బాధ పడాలి అని చెప్తాడు. నన్ను డిస్ట్రబ్ చెయ్యకుండా వదిలి వెళ్ళిపో అని అంటాడు. అప్పుడు దివ్య వచ్చి షాపింగ్ వెళదాం పద అని అంటే నాకు ఇంట్రెస్ట్ లేదమ్మా వదిలెయ్యండి.. నాకు పుట్టినరోజు వద్దు ఎం వద్దు అని చెప్పి వెళ్ళిపోతాడు.

click me!

Recommended Stories