అనన్య పాండే లవ్‌ బ్రేకప్‌.. స్పందించిన ప్రియుడు.. అది కంటిన్యూ అవుతుందంటూ ట్విస్ట్

Published : Sep 09, 2022, 04:24 PM ISTUpdated : Sep 09, 2022, 05:44 PM IST

`లైగర్‌` ఫేమ్‌ అనన్య పాండే హాట్‌ సెన్సేషనల్‌గా మారుతున్న విషయం తెలిసిందే. ఆమె లవ్‌ స్టోరీ ఇప్పుడు చర్చనీయాంశమవుతుంది. తాజాగా మాజీ ప్రియుడు ఈ విషయంపై ఓపెన్‌ అయ్యాడు.   

PREV
17
అనన్య పాండే లవ్‌ బ్రేకప్‌.. స్పందించిన ప్రియుడు.. అది కంటిన్యూ అవుతుందంటూ ట్విస్ట్

అనన్య పాండే ఇటీవల `లైగర్‌` చిత్రంతో తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకున్న అనన్య పాండే తెలుగు ఆడియెన్స్ ని మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. `లైగర్‌`లో ఆమె పాత్రపై చాలా విమర్శలు వచ్చాయి. 
 

27

కానీ అవేమీ పట్టించుకోకుండా తన గ్లామర్‌ షోతో ఎప్పటిలాగే సోషల్‌ మీడియా అభిమానులను అలరించే ప్రయత్నం చేస్తుంది. లేటెస్ట్ గా ఆమె పంచుకున్న బికినీ ఫోటోలు ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో అనన్యపాండే పేరు మరో రూపంలో చర్చనీయాంశమవుతుంది. ఆమె లవ్‌ మ్యాటర్‌ ఇప్పుడు హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

37

అనన్య పాండే, బాలీవుడ్‌ యంగ్‌ హీరో ఇషాన్‌ ఖట్టర్‌తో కలిసి డేటింగ్‌ చేసినట్టు వార్తలొచ్చిన విషయం తెలిసిందే. కొన్నాళ్లపాటు ఈ జంట కలిసి తిరిగింది. ప్రేమ పక్షుల్లా విహరించింది. కానీ ఈ జంట ఇప్పుడు బ్రేకప్‌ చెప్పుకుందనే ప్రచారం జరుగుతుంది. ఈ ఇద్దరు విడిపోయారని, సింగిల్‌గానే ఉంటున్నట్టు తెలుస్తుంది.
 

47

తాజాగా దీనిపై అనన్య పాండే ప్రియుడు, హీరో ఇషాన్‌ ఖట్టర్‌ స్పందించారు. కత్రినా కైఫ్‌, సిద్ధాంత్‌ చతుర్వేదీలతో కలిసి ఇషాన్‌ ఖట్టర్‌ కరణ్‌ జోహార్‌ షో `కాఫీ విత్‌ కరణ్‌` షోలో పాల్గొన్నారు. ఇందులో అనన్యతో డేటింగ్‌కి సంబంధించి ప్రశ్నించగా, ప్రస్తుతానికి తాను సింగిల్‌గానే ఉన్నట్టు చెప్పాడు ఇషాన్‌. 
 

57

దీనిపై ఇంకా చెబుతూ, అనన్యతో తాను స్నేహంగానే ఉంటున్నానని, జీవితాంతం ఆమెతో ఫ్రెండ్‌గానే ఉండాలని కోరుకుంటున్నట్టు,ఆమె చాలా స్వీటెస్ట్ పర్సన్‌ అంటూ చెప్పుకొచ్చాడు ఇషాన్‌. ఇందులో కరణ్‌ అడిగిన ప్రశ్నలకు ఇషాన్‌ చెప్పిన సమాధానాలు ఆకట్టుకునేలా, క్రేజీగా ఉండటం విశేషం. 
 

67

అనన్య పాండే, ఇషాన్‌ ఖట్టర్‌ హిందీలో `ఖాలీ పీలి` చిత్రంలో కలిసి నటించారు. రొమాంటిక్‌ కామెడీగా రూపొందిన ఈ చిత్రం ఓటీటీలో విడుదలై మంచి స్పందన రాబట్టుకుంది. ఈ సినిమా షూటింగ్‌ సమయంలోనే ఈ ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా కాలంగా కలిసి తిరిగారు. ఇటీవల బ్రేకప్‌ చెప్పుకున్నట్టు బాలీవుడ్‌లో కథనాలు వైరల్‌ అయ్యాయి. 
 

77

ఇక ప్రస్తుతం అనన్య పాండే `ఖో గయే హమ్‌ కహాన్‌`, `డ్రీమ్‌ గర్ల్ 2` చిత్రాల్లో నటిస్తుంది. మరోవైపు ఇషాన్‌ `పిప్పా`, `పోన్‌ భూత్‌` చిత్రాల్లో నటిస్తున్నాడు. మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు ఇద్దరూ శ్రమిస్తున్నారు. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories