ప్రభాస్ ని కలిసినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏకంగా 30, 40 వంటకాలు మనముందు పెట్టేస్తాడు. ఇలా సరదాగా వీరిమధ్య వంటకాల గురించి చర్చ జరిగింది. ఒకే ఒక జీవితం స్పెషల్ స్క్రీనింగ్ కి కింగ్ నాగార్జున, అఖిల్, అమల కలసి హాజరయ్యారు. సినిమాలో ఎమోషనల్ సీన్స్ చూసి నాగార్జున కూడా భావోద్వేగానికి గురయ్యారు. మొత్తంగా శర్వానంద్ కి చాలా రోజుల నుంచి ఊరిస్తున్న విజయం ఈ చిత్రంతో దక్కింది.