ఆ సినిమా నుంచే స్టార్ పై క్రష్, వకీల్ సాబ్ నటి కామెంట్స్.. ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న ఫోటోస్

Published : Nov 02, 2025, 08:28 PM IST

వకీల్ సాబ్ నటి అనన్య నాగళ్ళ తన గ్లామర్ లుక్ కారణంగా సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు. ఓ స్టార్ హీరోపై తనకు క్రష్ ఉన్నట్లు అనన్య కామెంట్స్ చేసింది. 

PREV
16
వకీల్ సాబ్ నటి అనన్య నాగళ్ళ 

వకీల్ సాబ్ ఫేమ్ అనన్య నాగళ్ళ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈసారి రెండు కారణాలతో ఆమె సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారారు.  ఒకవైపు ఆమె చేసిన రెడ్ మినీ డ్రెస్ ఫోటోషూట్ వైరల్ అవుతుండగా, మరోవైపు తన మొదటి క్రష్‌ గురించి చెప్పి సర్ప్రైజ్ చేసింది.

26
రెడ్ డ్రెస్ లో గ్లామర్ షో 

వకీల్ సాబ్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమైన అనన్య నాగళ్ల, ఈ మధ్యకాలంలో గ్లామర్ వైపు అడుగులు వేస్తున్నారు. ఆమె తాజాగా పోస్ట్ చేసిన రెడ్ మినీ డ్రెస్ ఫోటోలు అభిమానుల్లో సంచలనం సృష్టించాయి. టైట్ ఫిట్ రెడ్ డ్రెస్ లో అనన్య నాగళ్ళ యువతని ఆకర్షిస్తున్నారు. ఈ ఫోటోషూట్‌లో అనన్యకాన్ఫిడెంట్ అండ్ గ్లామర్ లుక్ సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు దారితీసింది.

36
వైరల్ అవుతున్న అనన్య ఫొటోస్ 

అనన్య ఇప్పటివరకు ‘గర్ల్ నెక్స్ట్ డోర్’ ఇమేజ్‌తో ప్రేక్షకుల మనసుల్లో నిలిచారు. కానీ ఈ కొత్త ఫోటోషూట్‌తో ఆమె పూర్తిగా గ్లామరస్ లుక్‌కి మారిపోయారు. ఈ ఫోటోలు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన కొద్ది గంటల్లోనే వేల సంఖ్యలో లైకులు, కామెంట్లు సొంతం చేసుకున్నాయి.

46
పాన్ ఇండియా హీరోపై క్రష్ 

ఇదిలా ఉండగా, ఇటీవల జరిగిన ఒక చిట్‌చాట్‌లో అనన్య ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. ఆమె మాట్లాడుతూ, “నా ఫస్ట్ క్రష్ ప్రభాస్!” అని అన్నారు. వర్షం సినిమా చూసినప్పటి నుంచే ప్రభాస్‌ అంటే తనకు అభిమానమని, అప్పటినుంచే ఆయనను తన మొదటి క్రష్‌గా మారారని తెలిపారు. “ఆ సమయంలో ఆయన పట్ల ఉన్న ఆ ఆకర్షణ ఇప్పటికీ అలాగే ఉంది,” అని ఆమె పేర్కొన్నారు.

56
అనన్య నాగళ్ళ సినిమాలు

 ఆ తర్వాత ప్రభాస్ బాహుబలితో పాన్ ఇండియా స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. అనన్య నాగళ్ళ వకీల్ సాబ్ తో పాటు.. శాకుంతలం, పొట్టెల్ లాంటి చిత్రాల్లో నటించింది. 

66
మెగా హీరోకి జోడీగా.. 

త్వరలోనే ఆమె సాయి దుర్గ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న “సంబరాల ఏటి గట్టు” చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆమె సెకండ్ హీరోయిన్ పాత్రలో నటిస్తోంది.

Read more Photos on
click me!

Recommended Stories