దీప (Deepa) ఒంటరిగా ఆలోచిస్తుండగా కార్తీక్ వచ్చి మాట్లాడుతాడు. దీప అమెరికా ప్రయాణం గురించి మోనిత గురించి ప్రశ్నించడంతో కార్తీక్ (Karthik) మోనిత పేరు విని బాగా కోపపడతాడు. ఎక్కడికి వెళ్లిన అదే పేరు తలచుకుంటున్నారు అని కాస్త ఎమోషనల్ అవుతాడు. తన గురించి కాకుండా మన జీవితం గురించి ఆలోచించాలని చెబుతాడు.
ఉదయం ఆనంద రావు, సౌందర్య ( Anand Rao, Soundarya) వాకింగ్ అని బయటికి వెళ్తుండగా కార్తీక్ ఎదురు రావడంతో ఆనందరావు కార్తీక్ ను పిలిచి గట్టిగా చెంప పగలగొడతాడు. ఎందుకిలా చేశావు అంటూ కార్తీక్ చొక్కా పట్టుకొని కోపంతో ప్రశ్నిస్తూ ఉంటాడు. సౌందర్య చెప్పినా కూడా కార్తీక్ ను వదలడు. కార్తీక్ (Karthik) బాధతో ఏమీ అనలేకపోతాడు.
అదే సమయంలో దీప (Deepa) రావటంతో ఆనందరావు కార్తీక్ ను నిమురుతున్నట్టు చేస్తాడు. దీప వచ్చి ఏమైందని అడగటంతో కార్తీక్ (Karthik) చెంపమీద ఒక మచ్చ ఉందని మోనితను ఉద్దేశించి చెబుతాడు. దీపకు మాటలు అర్థం కాకుండా ఉంటాయి. వెంటనే కాఫీ తీసుకురావాలా అని అడగటంతో కాఫీ తీసుకురావడానికి వెళ్తుంది.
ఆనంద రావు (Anand rao) ఇక కార్తీక్ ను ఇలా ఎందుకు చేశావంటూ దీపకి ఎలా అన్యాయం చేయాలనిపిస్తుందని ప్రశ్నిస్తాడు. ఒక అనుమానం తోనే దీపను (Deepa) ఎన్నో ఏళ్ళు దూరం పెట్టి బాధ పెట్టావు అని మళ్లీ ఈ నీచమైన పనితో దీపను ఇంకెంత బాధ పెట్టాలని చూస్తున్నావు అని గట్టిగా వాదించి అక్కడి నుండి వెళ్ళి పోతాడు.
దీప (Deepa) కాఫీ తీసుకుని రావడంతో ఆనందరావు, సౌందర్య లేకపోయేసరికి ఆశ్చర్యపోతుంది. కార్తీక్ దగ్గరికి వెళ్లి మాట్లాడుతుండగా కార్తీక్ (Karthik) మాటలు కూడా తనకు కొత్తగా అనిపిస్తుంది. వెంటనే దీప తన మనసులో ఏదో జరుగుతుందని ఎలాగైనా తెలుసుకోవాలి అని ల్యాబ్ కు వెళ్లొచ్చాక తెలుసుకుంటాను అని అనుకుంటుంది.
మరోవైపు హాస్పిటల్ లో మోనిత (Monitha) దగ్గరికి భారతీ వచ్చి తినమని సలహాలు ఇస్తుంది. మోనిత మాత్రం కార్తీక్ తనను ఇంట్లోకి రానిస్తాడా లేదా అని లేదంటే పరిస్థితి ఏంటి అని భారతి (Bharathi) తో మాట్లాడుతుంది. ఇక భారతి కూడా ఫ్రెండ్ అని నీ కోసం ఎన్నో చేశాను అంటూ సాటి ఆడదానిగా మాత్రం తప్పు చేశాను అని బాధపడుతుంది.
మోనిత (Monitha) మళ్లీ ధైర్యం తెచ్చుకొని గట్టిగా మాట్లాడుతుంది. సహజ గర్భం అని తెలిస్తే దీప దూరంగా వెళ్లి పోతుందని అంటుంది. ఇక ఇంట్లో పిల్లలు దీప కోసం వెతకడం తో అమ్మ కనిపించటం లేదని సౌందర్య, కార్తీక్ తో చెబుతారు. వెంటనే దీప (Deepa) ఎక్కడికి వెళ్ళింది అని టెన్షన్ పడుతుంటారు.
దీప (Deepa) వారణాసి (Varanasi) కారులో ల్యాబ్ దగ్గరికి వెళ్లి అక్కడ మరో ల్యాబ్ టెక్నీషియన్ ను కలుస్తుంది. తరువాయి భాగంలో ఎటువంటి శాంపిల్స్ బయటికి వెళ్ళలేదు అని ఆ ల్యాబ్ టెక్నీషియన్ గట్టిగా చెప్పటంతో దీప మరో మాట మాట్లాడకుండా మౌనంగా అక్కడి నుంచి బయటకు వెళుతుంది. కారు కూడా ఎక్కకుండా ఒంటరి ప్రయాణం మొదలుపెడుతుంది.