ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన అమీజాక్సన్ , పెళ్ళి కాలేదు.. బిడ్డకు జన్మనిచ్చింది, ఇప్పుడు మరో హీరోతో ...?

Published : Jun 07, 2022, 08:47 AM ISTUpdated : Jun 07, 2022, 08:51 AM IST

అమీ జాక్సన్.. నాజూకు అందాలతో కుర్రాళ్ల మతులుపొగొడుతున్న ఈ బ్యూటీ.. అభిమానులకు మరో షాక్ ఇచ్చింది. పెళ్లి కాకుండానే తల్లైయిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కొత్త ప్రియుడిని పరిచయం చేసింది.   

PREV
17
ఫ్యాన్స్ కు మరో షాక్ ఇచ్చిన అమీజాక్సన్ , పెళ్ళి కాలేదు.. బిడ్డకు జన్మనిచ్చింది, ఇప్పుడు మరో హీరోతో ...?

అమీ జాక్సన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సి అవసరం లేదు. మల్లెతీగలాగా నాజూగ్గా.. జీరోసైజ్ బాడీతో మతి చెదిరే సొగసులతో  ఓ ఊహా చిత్రం మన మదిలో మెదులుతుంది.  అమీ జాక్సన్ అంటే క్రష్ లేనివారంటూ ఉండరేమో బహుషా..అన్నంత అందం ఆమెది. 
 

27

ఒక బిడ్డకు జన్మనిచ్చినా.. అమీలో ఏ మార్పు లేదు. అదే అందం, అదే మెయింటేనెస్. ఈమె నిజంగా ఒక బిడ్డను కన్నదా అని ఎవరికైనా అనుమానం రాక మానదు. అలా ఉంటుంద అమీ జాక్సాన్. హాలీవుడ్ లో సెటిల్ అయిన బాలీవుడ్ బ్యూటీ ఇప్పుడు మరోసారి వార్తల్లో నిలిచింది. 
 

37

ఐ, ఎవడు, రోబో 2.0 సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న బ్యూటీఫుల్​ హీరోయిన్​ అమీ జాక్సన్. కెరీర్‌ పీక్‌ స్టేజ్‌లో ఉన్నప్పుడే బిజినెస్ మెన్ జార్జ్‌ పనియోటౌతో ప్రేమలో మునిగి తేలింది. అమీ జాక్సన్‌ పెళ్లికాకుండానే ఆండ్రూ అనే కుమారుడికి జన్మనిచ్చింది. 
 

47

బాబు పుట్టిన తర్వాత పెళ్లి చేసుకుంటామని ప్రకటించిన అమీ నుంచి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన రాలేదు. అసలు హీరోయిన్ గా మంచి స్టేజ్ లో ఉన్న అమీ.. పెళ్లి కాకుండా తల్లి అయ్యి.. ఫ్యాన్ కు షాక్ ఇచ్చింది.. ఇప్పుడు అంతకంటె పెద్ద షాక్ మరొకటి ఇచ్చింది బ్యూటీ. 

57

అయితే అమీ జాక్సన్‌ బ్రిటీష్‌ నటుడు ఎడ్‌‌వెస్ట్విక్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు గత కొంతకాలంగా వార్తలు షికారు చేస్తున్నాయి. కానీ ఈ వార్తలపై ఏనాడు రియాక్ట్​ కాలేదు అమీ. ఇదివరకు లండన్​లో అతనితో చెట్టాపట్టాలేసుకోని తిరిగిన ఫొటోలు వారు ప్రేమలో ఉన్నారని ప్రచారాన్ని బలపరిచాయి. 

67

ఇక  తాజాగా ఎడ్​వెస్ట్విక్​తో క్లోజ్ గా ఉన్న ఫొటోలను ఇన్​స్టాగ్రామ్​లో షేర్​ చేసింది అమీ జాక్సన్. ప్రస్తుతం నెట్టింట వైరల్​ అయిన ఈ ఫొటోలు చూస్తుంటే వారు ప్రేమలో ఉందన్న వార్తలు దాదాపు కన్ఫమ్​ అయినట్లు తెలుస్తోంది. మరి మొదట ప్రేమంచిన వ్యక్తితో బ్రేకప్ చెప్పిందా.. ?   అసలు కారణాలు ఏంటీ అనేవాటిపై ఇప్పటి వరకూ క్లారిటీ లేదు. 

77

ఈ విషయంలో అమీ జాక్సన్ నోరువిప్పితే కాని అసలు నిజాలు బయటకు రావు. ఇప్పటికే తన కొడుకు పెద్దవాడు అవుతున్నాడు. అమీ జాక్సన్ కొడుకు ఆండ్రూస్ తో కలిసి విడిగా ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె.. త్వరలో మరోసారి సిల్వర్ స్క్రీన్ మీద మెరవబోతున్నట్టు తెలుస్తోంది. 

click me!

Recommended Stories