తెలుగు రాష్ట్రాలకు పెద్దగా పరిచయం చేయనక్కర్లేని పేరు అమృత వ ప్రణయ్ అలియాస్ అమృత వర్షిణి. తన స్నేహితుడు ప్రణయ్ ని ప్రేమించి, పెద్దలు ఎదిరించి పెళ్లి చేసుకొని, చాలా చిన్నవయస్సులోనే. అదికూడా పెళ్ళైన ఏడాదిలోనే భర్తను కోల్పోయింది అమృత.
5 నెలల గర్బవతిగా ఉన్నప్పుడే.. తన స్వయంగా తన తండ్రి తన పసుపుకుంకాలు తుడిచేయడం అతి పెద్ద విషాదంగా మారింది. తన కూతురు తమ కంటే తక్కువ కులంవారిని పెళ్లిచేసుకోవడం జీర్ణించుకోలేకపోయిన అమృత తండ్రి మారుతీ రావు, 2018 లో తన మనుషుల చేత ప్రణయ్ ని చంపించిన ఘటన దేశాన్నే ఉలిక్కిపడేలా చేసింది.