పెళ్లి కాని ఆ హీరోనే కావాలి... మనసులో కోరిక బయటపెట్టిన మెగా డాటర్ నిహారిక!

Published : Aug 02, 2024, 08:18 AM ISTUpdated : Aug 02, 2024, 08:36 AM IST

మెగా హీరోలను కాదని నిహారిక ఆ స్టార్ హీరో కావాలి అంటుంది. ఛాన్స్ వస్తే ఆయనతో అలాంటి చిత్రం చేస్తాను అంటుంది. ఆ కథేమిటో చూద్దాం...   

PREV
15
పెళ్లి కాని ఆ హీరోనే కావాలి... మనసులో కోరిక బయటపెట్టిన మెగా డాటర్ నిహారిక!
Niharika Konidela

నిహారిక మెగా ఫ్యామిలీలో రెబల్ డాటర్ ని చెప్పొచ్చు. అరడజనుకు పైగా హీరోలున్న ఆ ఫ్యామిలీ నుండి హీరోయిన్ కావాలనే సాహసం ఎవరూ చేయలేదు. ఒక్క నిహారిక మాత్రమే సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. అందుకు మెగా అభిమానులు ఒప్పుకోలేదు. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం కూడా అంతంత మాత్రమే. అందుకే పెద్దగా రాణించలేదు. 

25
Niharika Konidela

ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం.. ఇలా కొన్ని చిత్రాలు చేసినా అవేమీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. దాంతో 2020లో వివాహం చేసుకుంది. వెంకట చైతన్య జొన్నలగడ్డతో ఆమెకు అరేంజ్డ్ మ్యారేజ్ అయ్యింది. ఉదయ్ పూర్ ప్యాలస్ లో ఘనంగా ఐదు రోజులు వివాహం చేశారు. మెగా హీరోలందరూ పాల్గొన్న ఈ వివాహం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. 

 

35
Niharika Konidela

కాగా వెంకట చైతన్య-నిహారిక మధ్య మనస్పర్థలు తలెత్తిన నేపథ్యంలో విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం నిహారిక తన దృష్టి మరలా నటన మీద పెట్టింది. అలాగే నిర్మాత గా కూడా రాణించే ప్రయత్నం చేస్తుంది. కమిటీ కుర్రాళ్ళు టైటిల్ తో ఓ విలేజ్ డ్రామాను నిహారిక నిర్మించింది. ఈ చిత్రం ఆగస్టు 9న విడుదల కానుంది. 

45
Niharika Konidela

కమిటీ కుర్రాళ్ళు మూవీ ప్రమోషన్స్ లో పాల్గొంటున్న నిహారిక పలు విషయాల మీద స్పందిస్తుంది. ఓ ఇంటర్వ్యూలో నిహారికను మీకు ఇష్టమైన హీరో ఎవరని యాంకర్ అడిగారు. యాంకర్ మూడు ఆప్షన్స్ ఇచ్చింది. ప్రభాస్, మహేష్ బాబు, ఎన్టీఆర్ లలో ఎవరితో నటించాలని అనుకుంటున్నారని యాంకర్ అడిగారు. ఈ ప్రశ్నకు నిహారిక ఆసక్తికర సమాధానం చెప్పారు. 

 

55
Niharika Konidela

నేను ప్రభాస్ తో నటించాలని అనుకుంటున్నాను. ప్రభాస్ కామెడీ అంటే నాకు చాలా ఇష్టం. డార్లింగ్ మూవీ చాలా బాగుంటుంది. అలాగే మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి చిత్రాలన్నా కూడా చాలా ఇష్టం. ఒకవేళ అలాంటి సినిమా ఆయనతో చేసే ఛాన్స్ వస్తే ఖచ్చితంగా చేస్తాను... అని నిహారిక మనసులో మాట బయటపెట్టింది. ఇక్కడా నిహారిక మెగా హీరో చెప్పకపోవడానికి కారణం... యాంకర్ మెగా హీరో కాకుండా అని ప్రశ్న అడిగింది. అదన్నమాట సంగతి... 
 

Read more Photos on
click me!

Recommended Stories