నయనతార మరో గొడవ, లేడీ సూపర్ స్టార్ కి ఏమయ్యింది, వరుస వివాదాలకు కారణం ఏంటి?
వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది నయనతార. ఇప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో మరోసారి నయన్ మరో వివాదంలో చిక్కకున్నారు.
వరుసగా వివాదాల్లో చిక్కుకుంటుంది నయనతార. ఇప్పటికే ఆమెపై అనేక ఆరోపణలు వస్తున్న నేపధ్యంలో మరోసారి నయన్ మరో వివాదంలో చిక్కకున్నారు.
Nayanthara clash with Assistant Director: నయనతార నటిస్తున్న మూకుత్తి అమ్మన్ 2 సినిమా షూటింగ్ వేంగంగా జరుగుతోంది. అయితే, షూటింగ్‌లో ఏదో తేడా జరిగిందని సమాచారం అందుతోంది. డ్రెస్సుల విషయంలో నయనతారకి, అసిస్టెంట్ డైరెక్టర్‌కి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది.
దాంతో షూటింగ్ ఆగిపోయిందని అంటున్నారు. నయనతార కోపంగా షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోయిందని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. కానీ నిర్మాత ఐసరి కె. గణేష్ వెంటనే కల్పించుకుని నయనతారతో మాట్లాడి సమస్యను పరిష్కరించారని సమాచారం.
ఈ గొడవ విషయంలో నయన్ తో ఆయన మాట్లాడిన తర్వాత పొల్లాచ్చి షెడ్యూల్‌ను క్యాన్సిల్ చేయాలని టీమ్ డిసైడ్ అయ్యిందట. దాని బదులు చెన్నైలోని ఆలపాక్కంలోని పొన్నియమ్మన్ గుడిలో షూటింగ్ మళ్లీ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారట. ఏదో చిన్న ఇబ్బంది వచ్చినా, పనులు జరుగుతూనే ఉంటాయని, త్వరలోనే నసరత్‌పేటలో షూటింగ్ స్టార్ట్ అవుతుందని అంటున్నారు. ఇప్పుడు చెన్నైలో సినిమా షూటింగ్ జరుగుతోందని సమాచారం.
ఈమధ్య ఎక్కువగా విమర్శలకు గురవుతోంది నయనతార. రీసెంట్ గానే ఆమెపై నేటిజన్లు మండిపడ్డారు. ఆమెతో యాటీట్యూడ్ ఇష్యూస్ వస్తున్నట్టు తెలుస్తోంది. రీసెంట్ గా చాలా మంది నటులతో సినిమా పూజ జరిగింది. ఈ పూజలో కూడా మీనాని అవమానించారు నయనతార. ఆ ఇష్యు చల్లారకముందే ప్రస్తుతం ఈ గొడవ. సీ సుందర్ సి సినిమాకి డైరెక్టర్. వేల్స్ ఇంటర్నేషనల్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తోంది. మొదటి పార్ట్‌ను ఆర్.జె. బాలాజీ డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ఓటీటీలో వచ్చి బాగా హిట్ అయింది. కానీ రెండో పార్ట్ తాను డైరెక్ట్ చేయనని ఆర్.జె.బాలాజీ ముందే చెప్పడంతో మూకుత్తి అమ్మన్ 2 సినిమా డైరెక్ట్ చేసే బాధ్యత సుందర్ సికి వచ్చింది.
మూకుత్తి అమ్మన్ 2 సినిమా పాన్ ఇండియా మూవీగా వస్తోంది. ఈ సినిమాను దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో సుందర్ సి గ్రాండ్‌గా తీస్తున్నారు. ఈ సినిమాలో నయనతారతో పాటు ఇనియా, రెజీనా కసెండ్రా, మైనా నందిని, దునియా విజయ్, సింగం పులి, యోగిబాబు లాంటి పెద్ద స్టార్స్ ఉన్నారు. ఈ సినిమాలో అమ్మన్ క్యారెక్టర్‌లో నటించడానికి నయనతార నెల రోజులకు పైగా ఉపవాసం ఉండి నటిస్తున్నారు. ఈ సినిమాకి హిప్ హాప్ ఆది మ్యూజిక్ డైరెక్టర్.