`కన్నీరు ఆపుకోలేకపోతున్నా..` మెగాస్టార్‌ భావోద్వేగ ట్వీట్

First Published Jul 28, 2020, 11:25 AM IST

ఐశ్వర్య, ఆరాధ్యల డిశ్చార్జ్‌పై అమితాబ్‌ బచ్చన్ భావోద్వేగంగా స్పందించారు. ఐశ్వర్య, ఆరాధ్యలు డిశ్చార్జ్‌ అవ్వటం పై కామెంట్‌ చేస్తూ కన్నీళ్లు ఆగటం లేదన్నారు అమితాబ్‌. `నా కోడలు, మనవరాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. దేవుడా నీ కరుణ అపారం` అంటూ ట్వీట్ చేశాడు అమితాబ్‌.

కరోనా మహమ్మారి సెలబ్రిటీలను కూడా వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్‌ బచ్చన్‌కు ఆయన కుటుంబ సభ్యులకు కరోనా సోకటంతో ఇండస్ట్రీతో పాటు అభిమానుల్లోనూ కలవరం మొదలైంది. బిగ్ బీ వయసు, ఆరోగ్య సమస్యల నేపథ్యంలో అభిమానుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
undefined
అమితాబ్‌ తో పాటు ఆయన కుమార్‌ అభిషేక్‌ బచ్చన్‌, కోడలు ఐశ్వర్య రాయ్‌, మనవరాలు ఆరాధ్యలు నానావతి ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. వీరిలో ఐశ్వర్య రాయ్‌, ఆరాధ్యకు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్య అయ్యారు. ఈ విషయాన్ని అభిషేక్‌ బచ్చన్ తన ట్విటర్‌ ద్వారా అభిమానులకు తెలియజేశారు.
undefined
ఇదే విషయాన్ని అభిమానులతో పంచుకున్న అమితాబ్‌ బచ్చన్ భావోద్వేగంగా స్పందించారు. ఐశ్వర్య, ఆరాధ్యలు డిశ్చార్జ్‌ అవ్వటం పై కామెంట్‌ చేస్తూ కన్నీళ్లు ఆగటం లేదన్నారు అమితాబ్‌. `నా కోడలు, మనవరాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. నేను కన్నీరు ఆపుకోలేకపోతున్నాను. దేవుడా నీ కరుణ అపారం` అంటూ ట్వీట్ చేశాడు అమితాబ్‌.
undefined
10 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందిన ఐశ్వర్య రాయ్‌, ఆమె కూతురు సోమవారం పూర్తిగా కోలుకొని డిశ్చార్జ్‌ అయ్యారు. అమితాబ్‌, అభిషేక్‌లకు జూలై 11న కరోనా పాజిటివ్‌ అని నిర్థారణ అయ్యింది. ఆ తరువాత రోజు ఐశ్వర్య, ఆరాధ్యలకు పాజిటివ్‌ అని తేలింది. కొద్ది రోజుల పాటు హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందిన ఐశ్వర్య తరువాత నానావతి ఆసుపత్రిలో చేరారు.
undefined
బచ్చన్‌ కుటుంబానికి చెందిన నాలుగు బంగ్లాలను బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌ అధికారులు జూలై 12న సీల్ చేశారు. అయితే ఆదివారం ఆ బంగ్లా ముందున్న కంటైన్మెంట్‌ జోన్లను తొలగించి సాధారణ స్థితి కల్పించారు అధికారులు.
undefined
click me!