అమితాబ్, జయల మ్యారేజ్‌ వెనుక రహస్యం, పూజారీ ఎందుకు వ్యతిరేకించాడు? అసలేమైంది?

First Published | Sep 20, 2024, 6:19 PM IST

బిగ్ బీ అమితాబ్‌ బచ్చన్‌, జయ బచ్చన్‌ల పెళ్లిని పూజారీ వ్యతిరేకించాడా? ఈ ఇద్దరు పెళ్లి చేసుకోవద్దని చెప్పాడా? అమితాబ్‌ మ్యారేజ్‌ వెనుకున్న అసలు రహస్యమేంటి?

అమితాబ్ బచ్చన్, జయ బచ్చన్ 1973 లో 'రహస్య' వివాహం చేసుకున్నారు. జయ తండ్రి జర్నలిస్ట్ తారూన్ కుమార్ భదూరి దీనిపై స్పందించారు. ఆయన షాకింగ్‌ విషయాలను బయటపెట్టారు. ఈ పెళ్లి వేడుకను నిర్వహించిన బెంగాలీ పూజారి మొదట అమితాబ్, జయల మధ్య కులాలు వేరు అనే కారణంతో వ్యతిరేకించాడు. ఇంటర్‌ కాస్ట్‌ మ్యారేజ్‌ని ఆయన వ్యతిరేకించినట్టు తెలుస్తుంది. 

బిగ్‌ బాస్‌ తెలుగు 8 ఇంట్రెస్టింగ్‌ అప్‌ డేట్స్ కోసం ఇక్కడ చూడండి.

1989 లో ఇల్లస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కోసం తారూన్ కుమార్ భదూరి రాసిన వ్యాసంలో, `అమితాబ్‌ సింపుల్‌ బొంబాయి సినిమా స్టార్ కాదని నేను గ్రహించాను. అమితాబ్.. జయను పెద్ద స్టార్ కాబట్టి పెళ్లి చేసుకున్నారని చెప్పిన ద్వేషపూరిత వ్యక్తులు ఉన్నారు, కానీ ఇది పూర్తిగా అబద్ధం. `జంజీర్` లాంటి హిట్‌ కోసం అమితాబ్‌ చాలా కాలం వెయిట్‌ చేశాడు.  ఆ ఫలితం ఎలా ఉన్నా జయ  అతన్ని పెళ్లి చేసుకునేది.  తన అభిప్రాయాన్ని తరచుగా మార్చుకునే వ్యక్తి కాదు. చిన్నప్పటి నుంచి తనదైన శైలిని కోరుకునే మొండి వ్యక్తి ఆమె. వారిద్దరినీ కలిపిందేంటో చెప్పడం కష్టం` అని తెలిపారు తారూన్‌ కుమార్‌ భదూరి. 

Latest Videos


అమితాబ్.. జయ తల్లికి ఫోన్ చేసి పెళ్లి కోసం ముంబై రావాలని కోరినట్లు తారూన్ తెలిపారు. `ఒక బెంగాలీ వివాహం సాధారణంగా ఒక సుదీర్ఘమైన కానీ మనోహరమైన సంఘటన. బెంగాలీ పూజారి మొదట బెంగాలీ బ్రాహ్మణురాలు (జయ) బెంగాలేతర బ్రాహ్మణుడు కాని (అమిత్) వివాహాన్ని తాను నిర్వహించాల్సిన వస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. చాలా శ్రమ తర్వాత ఇది పరిష్కరించబడింది. అమితాబ్‌ ఎవరినీ కించపరచకుండా అన్ని వేడుకలను పూర్తి చేశాడు.ఈ పెళ్లి వేడుక నెక్ట్స్ డే తెల్లవారుజామున వరకు కొనసాగింది. అతను తన సూచనలన్నింటినీ నిజాయితీగా పాటించాడు. మరుసటి రోజు వారు లండన్ వెళ్లారు. తిరిగి వచ్చినప్పుడు, నేను భోపాల్‌లో విందు ఏర్పాటు చేశా` అని జయ తండ్రి రాశారు.

జయ, అమితాబ్ కలయికను తాను వ్యతిరేకించాననే ఆరోపణలను కూడా ఆయన ఖండించారు. "నా భార్య, నేను భదూరి-బచ్చన్ ఫ్యామిలీ కలయికని ఎందుకు వ్యతిరేకిస్తానో మంచి కారణం చెప్పండి.  అమితాబ్ ఒక ప్రేమగల అబ్బాయి. సినిమా ప్రపంచంలో రాణించడానికి అతను చాలా కష్టపడ్డాడు.  ప్రారంభంలో ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్‌ చేశాడు, కానీ నిలబడ్డాడు. మొండితనంతో కెరీర్‌ని కొనసాగించాడు. `జంజీర్` సినిమా సక్సెస్‌ అయినప్పుడు మాత్రమే అతను జయకు వివాహం చేసుకుంటానని ప్రతిపాదించాడు. కాబట్టి, మాకు ఆయన విషయంలో అభ్యంతరాలు ఉండటం? అతను బెంగాలీ కాదు, బ్రాహ్మణుడు కాదు? అని చెప్పడం ఎంత హాస్యాస్పదం` అని కౌంటర్‌ ఇచ్చాడు. 

"నా మరో కుమార్తె కూడా బ్రాహ్మణుడు కాని వ్యక్తిని వివాహం చేసుకుంది. నా రెండవ కుమార్తె రోమన్ కాథలిక్‌ను వివాహం చేసుకుంది. నా భార్య, నేను మాత్రమే కాదు, వృద్ధులైన నా పేరెంట్స్ కూడా ఈ వివాహ వేడుకల్లో పాల్గొనడమే కాకుండా ముగ్గురు జంటలను ఆశీర్వదించారు. ఆ నాడు నా ఫాదర్‌ చెప్పిన మాట ఇప్పటికీ నా మదిలో మెదులుతుంది. 'ఇది వారి జీవితం. పనుల్లో చిచ్చు పెట్టడానికి మనమెవరం? వారు  సంతోషమే మన సంతోషం` అని అన్నాడు. దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పారు జయ తండ్రి. 

జయ, అమితాబ్ బాలీవుడ్‌లో అత్యంత పాపులారిటీ పొందిన పెయిర్స్ లో ఒకరు. వారు దాదాపు 50 సంవత్సరాలుగా వివాహ బంధాన్ని కొనసాగిస్తున్నారు. వారికి  ఇద్దరు పిల్లలు ఉన్నారు: శ్వేతా బచ్చన్, అభిషేక్ బచ్చన్. వారికి ముగ్గురు మనవరాళ్లు కూడా ఉన్నారు: అగస్త్య నందా, నవ్య నవేలి నందా   ఆరాధ్య బచ్చన్ ఉన్నారు. అభిషేక్‌, ఐశ్వర్యారాయ్‌లకు ఆరాధ్య జన్మించిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరు విడిపోతున్నారనే పుకార్లు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 

click me!