జానీ మాస్టర్ అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌పై అత్యాచార ఆరోపణలు, పోక్సో కేసులో జానీ మాస్టర్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. శుక్రవారం తెల్లవారుజామున గోవా నుంచి హైదరాబాద్ తీసుకొచ్చి సీక్రెట్ ప్లేస్ లో విచారించారు.
ఈ విచారణలో పలు కీలక అంశాలపై పోలీసులు ఆరా తీశారు. హైదర్‌గూడలోని ఓ ఆస్పత్రిలో వైద్యపరీక్షల అనంతరం కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు.