బాలీవుడ్ లో విషాదం నెలకొంది. యంగ్ ఏజ్ లో ‘దంగల్’ మూవీ (Dangal Movie) నటి సుహానీ భట్నాగర్ మరణించడం అందరినీ దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. ఈరోజే కన్నుమూసింది. సుహానీ వయస్సు 19 ఏళ్లు మాత్రమే..
20 ఏళ్లు కూడా నిండకుండానే కన్నుమూసిన సుహానీ మరణవార్త పట్ల పలువురు సెలబ్రెటీలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ‘దంగల్’లో రెజ్లర్ గా ఆమె కనబర్చిన ప్రతిభకు ఇండియా మొత్తం ఫిదా అయ్యింది.
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ (Amir Khan) నటించిన ‘దంగల్’లో యువ బబితా ఫోగట్ పాత్రను పోషించింది. ఆమె మరణానికి గల వాస్తవ కారణాలు పూర్తి స్థాయిలో తెలియలేదు. కానీ.. కొన్ని విషయాలు ప్రచారంలో ఉన్నాయి.
సుహానీ భట్నాగర్ కు ఓసారి యాక్సిడెంట్ లో కాలు విరిగింది. ఆ సమయంలో ఆమె పెయిన్‌కిల్లర్స్ తీసుకుందని తెలుస్తోంది. దాంతో శరీరంపై తీవ్ర దుష్ప్రభావాలను కలిగించిందని అంటున్నారు.
తద్వారా మరిన్నిఆరోగ్య సమస్యలను ఎదుర్కొందని తెలుస్తోంది. రీసెంట్ గా భట్నాగర్ ఢిల్లీ ఆసుపత్రిలో చేరింది. వ్యాధి తీవ్రమవడంతో ప్రాణాలొదిలింది. ఆమె అంత్యక్రియలను ఫరీదాబాద్‌లోని సెక్టార్ 15లోని అజ్రోండా శ్మశానవాటికలో నిర్వహించనున్నారు.
‘దంగల్’లో అమీర్ ఖాన్ కుమార్తెలు గీతా కుమారి ఫోగట్, బబితా కుమారి ఫోగట్‌ల నటన ఎంతలా ఆకట్టుకుందో తెలిసిందే. ఇప్పటికీ ఈ చిత్రం సాధించిననన్నీ కలెక్షన్లు ఏ సినిమాకు రాలేదు.