26 ఏళ్లలో కేవలం 5 హిట్లు.. ఆస్తి మాత్రం 500 కోట్లు పైనే.. ఈ హీరోయిన్ కార్ల కలెక్షన్ చూస్తే షాక్ అవుతారు.

Published : Jun 09, 2026, 06:36 PM IST

ఫిల్మ్ ఇండస్ట్రీలో హిట్లు తక్కువే అయినా.. కోట్లలో ఆస్తులు సంపాదించింది ఓ హీరోయిన్ . 50 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ బ్యూటీ కార్ల కలెక్షన్ చూస్తూ కళ్లు తిరగాల్సింది. ఏడాదికి 30 కోట్ల వరకూ సంపాదిస్తున్న ఆ బ్యూటీ ఎవరో తెలుసా? 

PREV
16
51 ఏళ్ల స్టార్ హీరోయన్..

బాలీవుడ్ నటి అమీషా పటేల్ 51వ ఏట అడుగుపెట్టారు. ఆమె 1975 జూన్ 9న ముంబైలో జన్మించారు. కెరీర్‌లో పెద్దగా హిట్లు లేకపోయినా, ఆమె వందల కోట్ల ఆస్తికి యజమానురాలు. ఆమె దగ్గర అదిరిపోయే కార్ కలెక్షన్ కూడా ఉంది.

26
అమీషా పటేల్ ఆస్తి విలువ

అమీషా పటేల్ గత 26 ఏళ్లుగా బాలీవుడ్‌ తో పాటు సౌత్లో సినిమాల్లో కూడా నటించింది.   కానీ ఆమె ఖాతాలో హిట్లు చాలా తక్కువ. ఆమె ఆస్తి విలువ సుమారు రూ. 500 కోట్లు ఉంటుందని అంచనా సినిమాలు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు, స్టేజ్ షోలు, అద్దె ఆస్తుల ద్వారా ఆమె ప్రతినెలా 3 కోట్లకు పైనరే ఆమె  సంపాదిస్తున్నాట్టు సమాచారం. ఆమె ఏడాదికి  దాదాపు రూ. 30 కోట్ల ఉంటుంది.  ఒక్కో షోకు రూ. 50 నుంచి 80 లక్షలు తీసుకుంటారు.

36
అమీషా పటేల్ ఆస్తులు
ముంబైలోని ఓ ఖరీదైన ప్రాంతంలో అమీషా పటేల్‌కు విలాసవంతమైన ఇల్లు ఉంది. దాన్ని ఆమే స్వయంగా డిజైన్ చేసుకున్నారు. ఇంట్లో ఇటాలియన్ ల్యాంప్స్, ఎం.ఎఫ్. హుస్సేన్ పెయింటింగ్స్, వింటేజ్ డెకరేషన్ వస్తువులు ఉన్నాయి. ఇవి కాకుండా, పాలీ హిల్‌లో ఆమెకు పలు ప్రీమియం రెంటల్ ప్రాపర్టీలు కూడా ఉన్నాయి.
46
అమీషా పటేల్ కార్ కలెక్షన్
అమీషా పటేల్‌కు కార్లంటే చాలా ఇష్టం. ఆమె గ్యారేజీలో రేంజ్ రోవర్ స్పోర్ట్ (రూ. 1.38 కోట్లు), మెర్సిడెస్-బెంజ్ S-క్లాస్ (రూ. 1.88 కోట్లు), ఆడి Q7 (రూ. 83.91 లక్షలు), బీఎండబ్ల్యూ 5 సిరీస్ (రూ. 68.90 కోట్లు), టయోటా ఫార్చ్యూనర్ (రూ. 33.64 లక్షలు), కియా కార్నివాల్ (రూ. 52.42 లక్షలు) వంటి లగ్జరీ కార్లు ఉన్నాయి.
56
అమీషా పటేల్ తొలి సినిమా

అమీషా పటేల్ 2000లో వచ్చిన 'కహో నా ప్యార్ హై' సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్ హీరో. రాకేష్ రోషన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలైన వెంటనే సంచలనం సృష్టించింది. ఈ మూవీ ఏకంగా 92 అవార్డులు గెలుచుకుని రికార్డు సృష్టించింది. తెలుగులో ఆమె మహేష్ బాబు లాంటి స్టార్ హీరోలతో సూపర్ హిట్ సినిమాలు చేసింది. 

66
అమీషా పటేల్ హిట్ సినిమాలు

అమీషా పటేల్ తన 26 ఏళ్ల సినీ కెరీర్‌లో చాలా సినిమాల్లో నటించినా, హిట్టయింది కేవలం 5 మాత్రమే. ఆమె హిట్ చిత్రాలు 'కహో నా ప్యార్ హై', 'గదర్: ఏక్ ప్రేమ్ కథ', 'హమ్‌రాజ్', 'భూల్ భులయ్యా', 'గదర్ 2'. ప్రస్తుతం ఆమె చేతిలో పెద్ద సినిమాలేవీ లేవు.

Read more Photos on
click me!

Recommended Stories