విన్నర్ అయి ఉంటే ఇంకా బావుండేది కదా అనే అసంతృప్తి ఉందా అని ప్రశ్నించగా.. రవితేజ గారు తన సినిమాలో ఛాన్స్ ఇస్తానని మాట ఇచ్చినప్పుడే నేను విన్నర్ అయిపోయా.. అంతకి మించి నాకు ఇంకేమి అవసరం లేదు అని అమర్ దీప్ అన్నాడు. బిగ్ బాస్ తో నేను ప్రతి ఇంట్లో అబ్బాయిగా మారిపోయా. ప్రతి ఫ్యామిలీ సపోర్ట్, నా తల్లిదండ్రులు కష్టం, నా భార్య ప్రోత్సాహంతో ఇంతదూరం వచ్చాయి. ఇంతకి మించి నాకేం కావాలి అని అమర్ దీప్ అన్నాడు.