Naga Panchami january 5th Episode: పంచమిని వెళ్లగొట్టమన్న వైదేహి.. ఎదురు తిరిగిన మోక్ష

First Published Jan 5, 2024, 11:19 AM IST

మోక్షను పంచమి నుంచి దూరం చేయాలని వైదేహి అనుకుంటుంది. అయితే.. పంచమి పాము అని తెలియక మోక్ష దాని మాయలో పడిపోయాడు అని చిత్ర అంటుంది. వీళ్ల మాటలు మొత్తం దూరం నుంచి ఫనీంద్ర పాము రూపంలో వింటూ ఉంటాడు. 

Naga panchami

Naga Panchami january 5th Episode: పంచమి ఆచూకీ మోక్ష కనిపెడతాడు. ఇద్దరూ కలిసి ఇంటికి బయలుదేరతారు. మరోవైపు ఫణీంద్ర మనిషి రూపం నుంచి పాముగా మారడం జ్వాల చూస్తుంది. అదే విషయం ఇంట్లో వాళ్లందరికీ చెబుతుంది. వాళ్లు కూడా జ్వాల మాటలు నమ్ముతారు. ఏం చేద్దాం.. పోలీసులకు కంప్లైంట్ చేద్దామా అని వైదేహి అంటే.. ఇదో పెద్ద ఇష్యూ అవుతుందని వద్దని అంటారు. అయితే, మేఘన అసలు.. మనిషి పాముగా మారడని, అందులో నిజం లేదని కొట్టి పారేస్తుంది. పంచమి విషయం కూడా ఎక్కడ తెలిసిపోతుందా అనే భయంతో.. జ్వాల చెప్పిన దాంట్లో నిజం లేదని నమ్మించాలని చూస్తుంది.  జ్వాల ఏదో చూసి భ్రమ పడిందని.. మందులు వాడితే సరిపోతుందని మేఘన అంటుంది. కానీ చిత్ర అంగీకరించదు. అప్పుడే చిత్ర.. పంచమి కూడా పాము అంటూ బాంబు పేలుస్తుంది. అందరూ షాకౌతారు. కానీ.. తాను కళ్లారా చూశానని చిత్ర ఇంట్లో వాళ్లకు చెబుతుంది.

Naga panchami

పంచమి పామేనని జ్వాల కూడా వత్తాసు పలుకుతుంది. పాముల మాటలు వినపడతాయి, పాములను పసిగట్టగలదు అన్నప్పుడే తనకు అనుమానం వచ్చిందని, తర్వాత నాగుపాములా డ్యాన్స్ చేయడం, ఒంట్లో కి శక్తి రావడం అన్నీ పాము చేష్టలే అని చిత్ర అంటుంది. పంచమి మన ఇంటికి వచ్చినప్పటి నుంచి ఏం జరిగిందో ఆలోచిస్తే.. అది పాము అని అందరికీ అర్థమౌతుంది అని జ్వాల కూడా అంటుంది. దీంతో, వైదేహి ఆలోచనలో పడుతుంది. అన్నీ గుర్తు తెచ్చుకుంటుంది. అందరికీ ఒక్కో సిట్యువేషన్ గుర్తుకు వస్తుంది. నిజంగానే.. పంచమి పాము అనే అనుమానం అందరికీ కలుగుతుంది. వైదేహి మాత్రం బలంగా నమ్ముతుంది. మోక్షను పంచమి నుంచి దూరం చేయాలని వైదేహి అనుకుంటుంది. అయితే.. పంచమి పాము అని తెలియక మోక్ష దాని మాయలో పడిపోయాడు అని చిత్ర అంటుంది. వీళ్ల మాటలు మొత్తం దూరం నుంచి ఫనీంద్ర పాము రూపంలో వింటూ ఉంటాడు. 

Latest Videos


Naga panchami

జ్వాల మాత్రం తాను చూసింది నిజమని, పాము మనిషిగా మారడం నిజమని అంటుంది. మనకు తెలీకుండానే మన ఇంట్లో ఏదో జరుగుతోందని అంటుంది. పంచమి, తాను చూసిన వ్యక్తితో పాటు మరి కొందరు మనిషి రూపంలో మన చుట్టూనే తిరుగుతూ ఉన్నారని తనకు అనుమానంగా ఉందని అంటుంది. ఆ మాటకు మేఘన కంగారు పడుతుంది. మరోవైపు పంచమి ఎక్కడికీ వెళ్లలేదని, ఇక్కడే పాము రూపంలో దొక్కిన ఉందేమో అని  చిత్ర అంటుంది. అయితే.. పంచమి ఏ రూపంలోనూ ఈ ఇంట్లో అడుగుపెట్టదని, పాములు పట్టేవాళ్లను పిలిచి.. వాటిని పట్టిద్దాం అని వైదేహి అంటుంది.

పాము రూపంలో ఉంటే పట్టుకోవచ్చు కానీ, మనిషి రూపంలో ఉంటే ఎలా పట్టుకుంటాం అని జ్వాల అడుగుతుంది. ఈ విషయాలను ఇక్కడే వదిలేయమని మోక్ష తండ్రి అంటాడు. మోక్ష వచ్చిన తర్వాత ఈ విషయాలు మాట్లాడదాం అని చెబుతాడు.

Naga panchami

మరోవైపు మోక్ష, పంచమిలు ఆలయానికి వెళ్లి శివయ్యను దర్శించుకుంటారు. పంచమి తల్లి కూడా అక్కడే ఉంటుంది.  ఆమెకు క్షమాపణలు చెప్పి, తాము ఇద్దరం ఎప్పుడూ కలిసే ఉంటామని మోక్ష ఆమెకు మాట ఇస్తాడు. ఆమె ఆ మాటలకు సంతోషిస్తుంది.  తమ పంచమి పక్కన ఉంటే శివయ్య తోడుగా ఉన్నట్లే అని ఆమె మోక్షకు చెబుతుంది. తర్వాత... పంచమి, మోక్షలు తమ ఇంటికి బయలు దేరతారు.

Naga panchami

జ్వాల చేసిన రచ్చ గురించి మేఘన ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు పంచమి తిరిగి వచ్చినా వీళ్లు ఇంట్లోకి రానివ్వరు అని, తాను మోక్షను సొంతం చేసుకోవాలని ఆలోచిస్తూ ఉంటుంది. లేదంటే.. తనకు నాగమణి దొరకదని  ఆలోచిస్తూ ఉంటుంది. ఒంటరిగా కూర్చొని ఆాలోచిస్తున్న వైదేహి దగ్గరకు మేఘన వెళ్లి.. మాట్లాడుతుంది.  లస్సీ కావాలా అని అడుగుతుంది. వద్దు అనడంతో మేఘన వెళ్లిపోతూ ఉంటుంది. అప్పుడే వైదేహి మళ్లీ పిలుస్తుంది. పంచమికి నువ్వు స్నేహితురాలివి కదా.. పంచమి పాము అంటే నవ్వు నమ్ముతున్నావా అని అడుగుతుంది. దీంతో మేఘన ఇదే ఛాన్స్ అని వైదేహిని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది.

పంచమి పాము కాదని, ఒకవేళ పాము అయితే.. ఇన్ని సంవత్సరాలలో తమకు తెలిసేది కదా అంటుంది. చిన్నప్పటి నుంచి పంచమి కి పాముల గురించి బాగా తెలుసు అని కాకపోతే.. అది పాము కాదు అని చెబుతుంది. తర్వాత వైదేహి.. పంచమి సంగతి పక్కన పెట్టి, నీ గురించి చెప్పు అని అడుగుతుంది. మేఘన గురంచి ఆరా తీస్తుంది. తర్వాత తమ మోక్షను పెళ్లి చేసుకుంటావా అని ఇన్ డైరెక్ట్ గా అడుగుతుంది. లోపల తాను కోరుుకుంటుంది అదే  కానీ.. బయటటకు మాత్రం తన స్నేహితురాలికి అన్యాయం చేయను అంటుంది.
 

Naga panchami

అదే సమయానికి పంచమి, మోక్షలు ఇంటికి వస్తారు. వాళ్లను వైదేహి ఆపేస్తుంది.‘ నీ పక్కన ఉన్నది పంచమి కాదు.. పాము. కొట్టి చంపేయ్ మోక్ష లేకుంటే.. నిన్ను కాటేసి చంపేస్తుంది. మాకు మొత్తం తెలిసిపోయింది మోక్ష. నువ్వు పెళ్లి  చేసుకుంది మనిషి కాదు.. పాము.’ అని వైదేహి అంటుంది. వెంటనే జ్వాల కూడా మనిషి పాముగా, పాము మనిషిగా మారుతుందని తన వర్షన్ చెబుతుంది. మోక్షను వదిలేసి వెళ్లిపోమ్మని పంచమికి వైదేహి వార్నింగ్ ఇస్తుంది. అందరూ కలిసి పంచమిని బయటకు గెంటేయని చిత్ర బలవంత పెడుతుంది. కానీ మోక్ష ఊరుకోడు.

Naga Panchami

ఇంట్లో అందరికీ క్లాస్ పీకి.. పంచమిని లోపలికి తీసుకువస్తాడు. పంచమి పాము అని నీకు కూడా తెలుసు అని జ్వాల అంటుంది. పంచమి ఈ ఇంట్లో ఉండకూడదు అని వైదేహి చెప్పినా మోక్ష వినడు. కచ్చితంగా పంపమి ఇంట్లోనే ఉంటుందని, మీకు అవసరం లేకపోయినా తనకు అవసరం ఉందని, పంచమి తన భార్య అని, తనను ఇంట్లోకి రాకుండా ఆపే హక్కు ఎవరికీ లేదు అని చెబుతాడు. ఎవరు ఏం చెప్పినా తాను వినదలుచుకోలేదని, మృత్యువు తప్ప తమను ఎవరూ విడదీయలేరు అని మోక్ష అంటాడు. మోక్షకు వాళ్ల నాన్న సపోర్ట్ గా నిలుస్తాడు. తర్వాత వాళ్ల అన్నలు కూడా సపోర్ట్ చేస్తారు. అక్కడితో ఎపిసోడ్ ముగుస్తుంది.
 

click me!