Amardeep: పచ్చిగా మాట్లాడతా, ఒక్కసారిగా శివాజీకి ఇచ్చిపడేసిన అమర్..తన భార్య పడ్డ బాధ వివరిస్తూ

First Published | Feb 11, 2024, 10:31 AM IST

ప్రతి ఇంటర్వ్యూలో శివాజీ అమర్ దీప్ పై నెగిటివిటి పెంచుతూ వచ్చారు. కానీ అమర్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తొలిసారి అమర్ దీప్ శివాజీ నెగిటివ్ కామెంట్స్ పై బ్లాస్ట్ అయ్యాడు. 

బిగ్ బాస్ సీజన్ 7లో బుల్లితెర నటుడు అమర్ దీప్ కి ఎంత క్రేజ్ వచ్చిందో అంతే స్థాయిలో నెగిటివిటి కూడా మూటగట్టుకున్నాడు. బిగ్ బాస్ సీజన్ 7లో ఫస్ట్ హాఫ్ లో అమర్ దీప్ ఇండిపెండెంట్ గా వ్యవహరించలేదని.. యాక్టివ్ గా లేడని విమర్శలు ఉన్నాయి. అసలు అమర్ దీప్ కనీసం టాప్ 5 కి చేరుకుంటాడా అనే సందేహాలు మొదలయ్యాయి. కానీ సెకండ్ హాఫ్ లో అగ్రెసివ్ అయ్యాడు. 

అయితే కాస్త హద్దులు మీరి గోల చేసినప్పటికీ అది అతడికి ప్లస్ అయ్యింది. ఫలితంగా శివాజీని వెనక్కి నెట్టి రన్నరప్ గా నిలిచాడు. హౌస్ నుంచి బయటకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు అందరికి తెలిసిందే. పల్లవి ప్రశాంత్ అభిమానులు అమర్ దీప్ కారుపై అటాక్ చేయడం ఆ రచ్చ ఏ రేంజ్ కి వెళ్లిందో తెలిసిందే. ఇక శివాజీ హౌస్ నుంచి బయటకి వచ్చాక అనేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రతి ఇంటర్వ్యూలో శివాజీ అమర్ దీప్ పై నెగిటివిటి పెంచుతూ వచ్చారు. 


కానీ అమర్ ఎప్పుడూ స్పందించలేదు. కానీ తొలిసారి అమర్ దీప్ శివాజీ నెగిటివ్ కామెంట్స్ పై బ్లాస్ట్ అయ్యాడు. అమర్ దీప్ తాజాగా తన భార్య తేజస్వినితో కలసి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూ హోస్ట్ చేస్తున్నది ఎవరో కాదు.. అమర్ దీప్ కి హౌస్ లో, బయట బెస్ట్ ఫ్రెండ్ అయిన శోభా శెట్టి. 

ఈ చాట్ షోలో శోభా శెట్టి అమర్ దీప్ సైలెన్స్ ని బ్రేక్ చేసింది. అమర్ పై వస్తున్న నెగిటివిటీకి సమాధానం రాబట్టింది. ఈ షోకి సంబంధించిన ప్రోమో ప్రస్తుతం వైరల్ గా మారింది. ప్రోమో గమనిస్తే అమర్ దీప్ తొలిసారి శివాజీకి డైరెక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు ఉన్నాడు. అమర్ చెప్పిన ప్రతి సమాధానం శివాజీని టార్గెట్ గా చేసుకున్నట్లు అర్థం అవుతోంది. 

నాలుగైదు వారాలకే అమర్ దీప్ బయటకు వచేయాల్సింది. కానీ రన్నరప్ వరకు వెళ్ళాడు అంటూ చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు అని శోభా శెట్టి ప్రశ్నించింది. శివాజీ రన్నరప్ కి అర్హుడు కాదు అంటూ శివాజీ పలు ఇంటర్వ్యూలలో ప్రస్తావించిన సంగతి తెలిసిందే. దీనికి అమర్ దీప్ బదులిస్తూ.. పచ్చిగా మాట్లాడుకుందాం.. మొదటి 5 వరాలు నేను కంటెంట్ ఇవ్వలేదు ఓకె.. నేను ఒక్కడినేనా ఇంకెవ్వరూ లేరా.. వాళ్ళు నాకు దేవుళ్ళు అని భజన చేస్తే.. నాకు నేను కూడా అంతే. నాకు నేనే కింగ్.. నాకు నేనే బొంగు.. నీకుందుకురా అంటూ అమర్ రెచ్చిపోయాడు. 

ఒక్కసారిగా అమర్ ఇలా రెచ్చిపోవడం షాకింగ్ గా మారింది. మరో ప్రశ్నని శోభా శెట్టి డైరెక్ట్ గా శివాజీ గురించి అడిగింది. లోపల శివాజీ గారు నీ గురించి చాలా కామెంట్స్ చేశారు.. బయటకి వచ్చిన తర్వాత కూడా నెగిటివ్ కామెంట్స్ చేశారు కదా అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తూ అమర్ దీప్ చాలా కోపంగా కనిపించాడు. ప్రశాంత్ తో పోల్చితే నీకు నెగిటివిటి ఎక్కువ కదా అని అడిగింది.. అలాంటివి తాను పట్టించుకోను అని కొట్టిపారేశాడు. 

ఇంతకాలం సైలెంట్ గా ఉన్న తాను ఇక ఊరుకునేది లేదు అన్నట్లుగా సంకేతాలు పంపాడు. ఇక తనపై నెగిటివిటీ పెరుగుతుంటే తన భార్య ఎంతలా బాధపడిందో అమర్ దీప్ వివరించాడు. బుల్లితెరపై మంచి పేరు తెచ్చుకుని లోపలికి వెళ్ళాడు. అది పాడయ్యే విధంగా నెగిటివిటీ పెంచుతున్నారు అని తేజస్వని బాధపడినట్లు అమర్ తెలిపాడు. నిజంగానే తనని నెగిటివ్ చేసేశారు అని అమర్ అన్నాడు.

Latest Videos

click me!