విజయ్ దేవరకొండ తమ్ముడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు ఆనంద్ దేవరకొండ. నెమ్మదిగా ఒక్కో సినిమా చేసుకుంటూ నటుడిగా నిరూపించుకుంటున్నాడు. ఇటీవల `బేబీ` సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. యంగ్ స్టర్స్ లోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు తనకంటూ సెపరేట్ ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్నాడు. వరుసగా నాలుగైదు సినిమాలతో బిజీగా ఉన్నాడు. కూల్‌గా, కామ్‌గా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నాడు. డౌన్ టూ ఎర్త్ ఉంటూ నెమ్మదిగా అందరి మనుసులను గెలుచుకుంటున్నాడు ఆనంద్ దేవరకొండ.
పైకి సింపుల్‌గా, కూల్‌గా కనిపించే ఆనంద్‌లో చాలా బాధ ఉంది. హార్ట్ బ్రేక్ అయ్యే అయిన గాయం ఉంది. అది ప్రేమ గాయం కావడం గమనార్హం. ఆనంద్ దేవరకొండకి రియల్ లైఫ్‌లో ఒక లవ్ స్టోరీ ఉంది. ఆ ప్రేమ బ్రేక్ అయ్యిందట. దీంతో ఆ బాధని తన గుండెల్లో దాచుకుని హీరోగా తానేంటో నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు ఆనంద్. ఆ విషయంలో ఆయన సక్సెస్ అయ్యాడు. మరి ఆయన ప్రేమ కథేంటో చూస్తే..
ఆనంద్ దేవరకొండ చదువుకుంటున్న రోజులవి. ఇక్కడ స్టడీస్ చేసే సమయంలోనే ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇక్కడ స్టడీస్ అయిపోయాయి. అమ్మాయి హైయ్యర్ స్టడీస్ కోసం చికాగో వెళ్లిందట. దీంతో ప్రియురాలి కోసం తాను కూడా అమెరికా జంప్ కావాలనుకున్నాడు ఆనంద్. దీంతో ఆయన యూఎస్ లోని పలు ఇంజనీరింగ్ కాలేజెస్‌లో ట్రై చేశాడు. మొత్తానికి అక్కడ అడ్మీషన్ దొరికింది. దీంతో ఊహల్లో తేలియాడాడు. ఇక తాము హాయిగా, స్వేచ్ఛగా పిచ్చిపిచ్చిగా ప్రేమించుకోవచ్చు, ఏ అడ్డూ ఉండదని ఎన్నో కలలు కన్నాడు `బేబీ` హీరో.
అడ్మీషన్ రావడంతో అమెరికా చెక్కేశాడు. కానీ అక్కడికి వెళ్లాక సీన్ రివర్స్ అయ్యింది. ప్రేమ బెడిసి కొట్టింది. ఆ ప్రేమ నిజం కాదని, ఆ ప్రేమ మనది కాదని తెలిసిపోయింది. పోరీ హ్యాండిచ్చింది. గుండెలమీద తన్నిపోయింది. దీంతో షాక్‌లోకి వెళ్లిపోయాడు. ఆ బ్రేకప్ పెయిన్ నుంచి బయట పడటానికి నాలుగేళ్లు పట్టిందట. తాను ఎంతో నిజాయితీగా ప్రేమించానని కానీ వర్కౌట్ కాలేదని, ఆ సమయంలో చాలా బాధపడ్డానని చెప్పాడు ఆనంద్ దేవరకొండ. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. త్వరలోనే వాలెంటైన్స్ డే ఉన్న నేపథ్యంలో ఆనంద్ దేవరకొండ తన హార్ట్ బ్రేక్ లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చాడు. ఆయన నటించిన `బేబీ` సినిమా మాదిరిగానే తనకు లవ్ బ్రేకప్ కావడం బాధాకరం.
ఆనంద్ దేవరకొండ అమెరికాలోనే కొన్నాళ్లపాటు జాబ్ చేశాడు. ప్రముఖ కంపెనీలో మంచి ఉద్యోగం సాధించాడు. ఏడాదికి నలభై లక్షల శాలరీ వచ్చేది. కానీ అందులో ఏదో అసంతృప్తి. నటుడు కావాలనుకున్నాడు. జాబ్ మానేసి హైదరాబాద్ వచ్చాడు. అన్న విజయ్ దేవరకొండ క్లిక్ కావడంతో తను కూడా హీరోగా ప్రయత్నాలు మొదలు పెట్టాడు.
అలా `దొరసాని` సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. మూడు నాలుగు సినిమాలు చేశాడు. పెద్దగా పేరు రాలేదు. కానీ `బేబీ` సినిమా సంచలన విజయం సాధించింది. ఆనంద్‌కి హీరోగా గట్టి బేస్ వేసింది. ప్రస్తుతం మూడు నాలుగు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆనంద్. వాటిలో `గమ్ గమ్ గణేశా`, `డూయెట్`తోపాటు మరో మూవీ ఉంది. ఈ ఏడాది రెండు సినిమాలతో రాబోతున్నాడు.