సినిమాల్లో స్టార్ హీరో వ్యాల్యూ ఓపెనింగ్ డే రోజు తెలుస్తుంది. థియేటర్‌కి ఆడియెన్స్ ని రప్పించడంలో ఆయన సత్తా ఏంటో తొలి రోజు చెబుతుంది. అందుకే దాన్నే హీరో ఇమేజ్‌కి, మార్కెట్‌కి కొలమానంగా చూస్తుంటారు. ప్రభాస్, మహేష్, పవన్, రజనీకాంత్, విజయ్ వంటి స్టార్స్ సినిమాలు తొలి రోజు దుమ్ములేపుతుంటాయి. అయితే ఆ లెక్కన ఇప్పుడు రజనీకాంత్‌కి, పవన్ కళ్యాణ్‌కి పోటీ పడింది. మా హీరో తోపు అంటున్నారు పవన్ ఫ్యాన్స్. మరి ఆ లెక్కేంటో చూస్తే..
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజాగా `లాల్ సలామ్` సినిమాతో వచ్చాడు. `జైలర్` వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత ఆయన్నుంచి వచ్చిన సినిమా ఇది. రజనీకి సరైన సినిమా పడితే బాక్సాఫీసు ఎలా షేక్ అవుతుందో `జైలర్`తో చూపించాడు. దీంతో `లాల్ సలామ్` కూడా అలాంటిదే జరుగుతుందని భావించారు. కానీ ఈ మూవీకి ప్రారంభం నుంచి బజ్ లేదు. హైప్ లేదు. తన కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ రూపొందించడం, ట్రైలర్‌లో రజనీ మార్క్ ఎలిమెంట్లు లేకపోవడంతో పెద్దగా క్రేజ్ రాలేదు.
Lal Salaam
అది రిలీజ్ అయిన రోజున స్పష్టంగా కనిపించింది. పైగా ఇందులో రజనీకాంత్ గెస్ట్ రోల్ అనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత కీ రోల్‌గా ప్రొజెక్ట్ చేశారు. తీరా `లాల్ సలామ్` సినిమా చూశాక సినిమా మొత్తం రజనీ ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ఆయనే సినిమాకి హీరో. కానీ శుక్రవారం విడుదలైన ఈ మూవీకి ఏమాత్రం కలెక్షన్లు రాలేదు. బాక్సాఫీసు వద్ద ఏమాత్రం సత్త చాటలేకపోయింది. అసలు ఇది రజనీ సినిమానేనా అని ఆశ్చర్యపోయేలా? సూపర్ స్టార్ సినిమాకి ఇలాంటి పరిస్థితేంటి? అని ఆశ్చర్యపోయేలా చేసింది.
రజనీకాంత్ కూతురు ఐశ్వర్యా రజనీకాంత్ రూపొందించిన `లాల్ సలామ్` మూవీ తొలి రోజు ప్రపంచ వ్యాప్తంగా కనీసం 20కోట్లు కూడా చేయలేదు. అసలు ఈ మూవీ బాక్సాఫీసు వద్ద ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. తొలి రోజు నుంచే నెగటివ్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు క్లీన్ స్వీప్ దిశగా వెళ్తుంది. ఇది చూసి ఇప్పుడు పవన్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఎందుకు అంటే?
రజనీకాంత్ లాగానే పవన్ కళ్యాణ్ కూడా ఇటీవల కీ రోల్ చేశాడు `బ్రో` సినిమాలో. సాయిధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కింది. సముద్రఖని రూపొందించారు. తమిళంలో వచ్చిన `వినోదయ సీతం` చిత్రానికి రీమేక్. ఆల్‌రెడీ చాలా మంది ఈ మూవీని చూశారు. కానీ తెలుగులో రీమేక్ చేశారు. గతేడాది ఈ సినిమా విడుదలైంది. తొలి రోజు ఏకంగా 49కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆల్మోస్ట్ 30కోట్ల షేర్ వచ్చింది.
ఈ సినిమా కేవలం తెలుగు వెర్షన్‌లోనే విడుదలైంది. పైగా చూసేసిన సినిమా. అయినా ఫస్ట్ డే యాభై కోట్ల గ్రాస్ రావడం విశేషం. అది పవన్ కళ్యాణ్ రేంజ్‌ని చూపిస్తుంది. ఆయన మార్కెట్‌కి, క్రేజ్‌కి అద్దం పడుతుంది. దీంతో `బ్రో`ని `లాల్ సలామ్`తో కంపేర్ చేస్తే ఇద్దరు ఇలాంటి పాత్రలే చేసినా రజనీ సినిమా కంటే పవన్ సినిమా ఎక్కువ ఓపెనింగ్స్ రాబట్టడంతో రజనీకంటే మా హీరో తోపు అంటున్నారు పవన్ అభిమానులు. సోషల్ మీడియాలో దీన్ని వైరల్ చేస్తున్నారు. సౌత్ లోనే బ్రాండ్ ఉన్న హీరో అంటున్నారు. కాలర్ ఎగరేసే పోస్ట్ లు పెడుతున్నారు.
దీనిపై రజనీ ఫ్యాన్స్ గట్టిగా కౌంటర్లు ఇస్తున్నారు. రజనీ హిస్టరీ ఏంటి? పవన్ హిస్టరీ ఏంటి? అని ప్రశ్నిస్తున్నారు. రజనీకి రెండు ఆరువందల కోట్ల సినిమాలున్నాయి, మూడు రెండు వందల కోట్ల సినిమాలున్నాయి. మరి మీ పీకేకి హైయ్యెస్ట్ గ్రాస్ 150కోట్లే, దీనికేం చెబుతారు? అని ఎదురుదాడి చేస్తున్నారు. అంతేకాదు `బ్రో` సినిమా పవన్ మూవీగానే ప్రొజెక్ట్ చేశారు. కానీ `లాల్ సలామ్` రజనీ సినిమాగా ప్రొజెక్ట్ కాలేదని, ఆయన కొమియో రోల్‌గానే చెప్పారని, తక్కువ ఓపెనింగ్స్ కి అదే కారణం అంటున్నారు. రజనీతో ఆటలు వద్దు అంటున్నారు. దీంతో ఇది ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఫ్యాన్స్ మధ్య వార్‌లా మారింది.