ఎపిసోడ్ ప్రారంభంలో రిషి దంపతులు ఇద్దరూ అడవిలో విహరిస్తూ ఉంటారు. ఈ ఆనందం చాలా బాగుంది ఈ ఆనంద సమయంలో పంచభూతాలు సాక్షిగా చెప్తున్నాను ఎప్పటికీ నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటూ ఐ లవ్ యు అని గట్టిగా అరుస్తుంది వసుధార. రిషి కూడా నా ప్రాణం పోయినా నిన్ను వదులుకోను అంటాడు. ఈ ఆనంద సమయంలో మీతో పాటు నాకు ఒక కప్పు కాఫీ తాగాలని ఉంది అంటుంది పసుధార. తీసుకు వస్తాను అని చెప్పి ఒక కప్పు కాఫీ తీసుకు వస్తాడు రిషి.
ఒకటే తీసుకువచ్చారేమీ అంటుంది వసుధార.షేర్ చేసుకుందాం లే అంటాడు రిషి. రిషి కాఫీ తాగుతూ ఉంటే జీవితం ఎక్కడో మొదలయ్యి, ఎక్కడో ప్రయాణించి, ఎక్కడో ముగుస్తుంది. నేను మీ కాలేజీకి ఒక స్టూడెంట్ గా వచ్చి ఇప్పుడు మీ భార్యగా ఇంత సంతోషంగా ఉన్నాను. ఇలా ఎప్పుడు ఊహించలేదు అంటుంది వసుధార. మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే అందుకు కారణం అమ్మ చేసిన త్యాగం అంటాడు రిషి.
అవును సార్ తను ఇక్కడే పంచభూతాలలో ఉండే మనల్ని ఆనందంగా చూస్తూ ఉంటారు అంటుంది వసుధార. నీకు ఒక విషయం చెప్పనా.. డాడ్ అమ్మ జ్ఞాపకాలని మరిచిపోవాలని నేను అనుకోవడం లేదు. వాళ్ళిద్దరూ ఒకరి కోసం ఒకరు అన్నట్లుగా బ్రతికారు. అలాంటిది ఒక్కసారిగా మర్చిపోమంటే మర్చిపోలేరు. అమ్మ జ్ఞాపకాలు ఆయనకి అలాగే ఉండాలి కానీ ఆ మందు వ్యసనం నుంచి బయటపడాలి అప్పటివరకు మనకి మరొక బంధం వద్దు అంటాడు రిషి.
మీ ఉద్దేశం నాకు అర్థమైంది మీ అభిప్రాయమే నా అభిప్రాయం అంటుంది వసుధార. అర్థం చేసుకున్నందుకు థాంక్స్ అని చెప్పి ఇద్దరూ అక్కడి నుంచి బయలుదేరుతారు. అయితే వాళ్ళిద్దర్నీ కిల్లర్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. శైలేంద్ర కి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చూపిస్తాడు. వాళ్ళిద్దరూ ఇక్కడే ఉన్నారు మీరు చూస్తూ ఉండండి వాళ్ళని లేపేస్తాను అంటూ ఫోన్ లైవ్ లో పెట్టి వాళ్ల మీద అటాక్ చేయడానికి వెళ్తాడు.
అయితే అదంతా చూస్తున్న దేవయానికి అక్కడ మరొక మనిషి కనిపిస్తుంది. అరే అటువైపు ఉన్నది ఎవరు వాళ్ళని చూపించు అంటూ కంగారుగా అడుగుతుంది. వాళ్ళు ఎవరో మేడం మనకెందుకు అంటాడు కిల్లర్. శైలేంద్ర కూడా అలాగే ఉంటాడు.అలా కాదు తనని క్లియర్ గా చూపించు అని కంగారుపడుతూ భయంగా అడుగుతుంది. అప్పుడు తనని చూపిస్తాడు కిల్లర్.తను అనుపమ అని గుర్తు పట్టిన దేవయాని భయంతో వణికి పోతుంది. వాళ్లని చంపొద్దు నువ్వు వెనక్కి వచ్చేయి అని చెప్తుంది.
కానీ ఒకసారి కమిట్ అయిన తర్వాత నేను వెనక తగ్గేది లేదు అంటూ వాళ్ళనే చంపడానికి వెళ్తాడు కిల్లర్. అయితే వాళ్లని అనుపమ సేవ్ చేస్తుంది. రిషి తేరుకొని కిల్లర్ని పట్టుకోవడానికి పరిగెడతాడు కానీ వాడు దొరక్కుండా పారిపోతాడు. మరోవైపు నేను అనుకున్నాను ఆ అనుపమ వాళ్ళని సేవ్ చేస్తుంది అని అని భయంగా టెన్షన్ తో చెప్తుంది దేవయాని. ఎందుకు మమ్మీ అంత భయపడిపోతున్నావు అయినా తను ఎవరు అంటాడు శైలేంద్ర.
తను అనుపమ మహేంద్ర జగతిల బెస్ట్ ఫ్రెండ్. వాళ్ళిద్దరికీ పెళ్లి చేసింది తనే తను మాట్లాడితే మనం ఎవరం మాట్లాడలేము అని మహేంద్ర పెళ్లి సంగతి అంతా చెప్తుంది దేవయాని. మరోవైపు కిల్లర్ దొరక్క వెనక్కి వచ్చేసిన రిషి ని అసలు మీరు ఎవరు మీ మీద పదే పదే ఎందుకు అటాక్స్ జరుగుతున్నాయి ముందు ఇక్కడి నుంచి పదండి అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్లి పోతుంది అనుపమ. దెబ్బలతో వచ్చిన రిషి వాళ్ళని చూసి కంగారు పడతాడు మహేంద్ర.
ఏం జరిగింది అని అడుగుతాడు. తన మీద జరిగిన అటాచ్ సంగతి చెప్తాడు రిషి. ఏమీ కాలేదు కదా అని కంగారు పడతాడు మహేంద్ర. నన్ను సేవ్ చేసింది ఆవిడ అని అనుపమని పరిచయం చేస్తాడు రిషి. రిషి, మహేంద్ర తండ్రి కొడుకులని తెలుసుకొని షాక్ అవుతుంది అనుపమ. మహేంద్ర కూడా ఏమీ తెలియని వాడిలాగా అనుపమకి థాంక్స్ చెప్తాడు. మీరు ఇక్కడి నుంచి వీలైనంత త్వరగా బయలుదేరి వెళ్లిపోండి అని చెప్తుంది అనుపమ. ఇంతకీ మీ పేరేంటి మేడం అని అడుగుతుంది వసుధార. అనుపమ తన పేరు చెప్తుంది. ఒక్కసారిగా రిషి, వసుధారలు షాక్ అవుతారు. తర్వాత ఏం జరిగిందో రేపటి ఎపిసోడ్ లో చూద్దాం.