అమలా పాల్‌ బేబీ బంప్ పై భర్త ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ .. బీచ్‌లో విలువైనది పంచుకున్న డస్కీ బ్యూటీ..

Published : Feb 25, 2024, 01:46 PM ISTUpdated : Feb 25, 2024, 02:34 PM IST

అమలా పాల్‌ ప్రస్తుతం గర్భంతో ఉంది. ఆ మధుర క్షణాలను ఎంజాయ్‌ చేస్తుంది. అందులో భాగంగా తన బేబీ బంప్ పిక్స్ ని పంచుకుంటూ ఫ్యాన్స్ ని ఎంటర్‌టైన్‌ చేస్తుంది.   

PREV
17
అమలా పాల్‌ బేబీ బంప్ పై భర్త ఇంట్రెస్టింగ్‌ పోస్ట్ .. బీచ్‌లో విలువైనది పంచుకున్న డస్కీ బ్యూటీ..

అమలా పాల్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆదివారం ట్రీట్‌ ఇచ్చింది. అది కూడా తన బేబీ బంప్ ని చూపిస్తూ ఆమె ఫోటోని షేర్‌ చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పిక్‌ నెట్టింట చక్కర్లు కొడుతుంది. అభిమానులను అలరిస్తుంది. 
 

27

బీచ్‌లో ఆమె ఈ ఫోటో దిగడం విశేషం. తరచూ బీచ్‌ ఫోటోలతోనూ ఆకట్టుకుంటుందీ డస్కీ బ్యూటీ. తాజాగా పంచుకున్న ఫోటోలో కూడా ఆ బీచ్‌ని హైలైట్‌ చేసింది. దీంతోపాటు ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. తనకు విలువైనది ఏంటో వెల్లడించింది అమలా పాల్‌.
 

37

ఇందులో అమలా పాల్‌.. తనకు చాలా విలువైనది అంటూ ఈ పిక్‌ని షేర్‌ చేయడం విశేషం. తనకు బేబీ బంప్‌ తనకు విలువైనదిగా ఆమె చెప్పే ప్రయత్నం చేసింది. దీనికి భర్త జగత్‌ రియాక్ట్ అయ్యాడు. బేబీస్‌ విత్‌ బేబీ బంప్‌ అంటూ పోస్ట్ పెట్టడం విశేషం. తన భార్యని కూడా బేబీగా పోల్చాడు జగత్‌. దీంతో ఈ పోస్ట్ మరింత వైరల్‌గా మారింది. 

47
amala paul sreenish

అమలా పాల్‌ 2014లో దర్శకుడు ఏ ఎల్‌ విజయ్‌ని పెళ్లి చేసుకుంది. ఇద్దరికి  బేధాభిప్రాయాల కారణంగా విడిపోయారు.  కానీ ఇటీవలే తాను రెండో పెళ్లి చేసుకుంది. ప్రముఖ వ్యాపార వేత్త జగత్‌ అనే వ్యక్తిని గతేడాది మ్యారేజ్‌ చేసుకుంది. అక్టోబర్‌లో ప్రియుడిని పరిచయం చేసి, నవంబర్‌ మొదటి వారంలో మ్యారేజ్‌ చేసుకుంది. జనవరి మొదటి వారంలో తమ ప్రెగ్నెన్సీని ప్రకటించారు. 

57
amala paul thumb

ఆ తర్వాత నుంచి బేబీ బంప్‌ ఫోటోలను పంచుకుంటూ అలరిస్తుంది అమలా పాల్‌. భర్తతో కలిసిదిగిన పిక్స్ ని, బీచ్‌ వద్ద ఎంజాయ్‌ చేస్తున్న పిక్స్ ని షేర్‌ చేసింది. తన లైఫ్‌లో ప్రతి మూమెంట్‌ని ఫోటోలు, వీడియో రూపంలో బంధించి వాటిని అభిమానులతో పంచుకుంటుంది.  

67

ఇదిలా ఉంటే అమలా పాల్‌ పెళ్లికి ముందే ప్రెగ్నెన్సీ అయ్యిందనే రూమర్లు వచ్చాయి. నవంబర్‌ మొదటి వారంలో పెళ్లి అయితే జనవరి మొదటి వారంలో ప్రెగ్నెన్సీ ప్రకటించడంతో అనేక మంది డౌట్‌ని వ్యక్తం చేశారు. ప్రెగ్నెన్సీ అయ్యాకనే ఈ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే కామెంట్‌ చేశారు. కానీ అవేవీ పట్టించుకోకుండా తమ లైఫ్‌ని బ్యూటీఫుల్‌గా మార్చుకుంటున్నారీ జంట. 

77

అమలా పాల్‌ తెలుగులో నాలుగైదు సినిమాలు చేస్తుంది. `జెండా పైకపిరాజు`, `బెజవాడ`, `ఇద్దరమ్మాయిలతో`, `నాయక్‌` వంటి సినిమాల్లో నటించింది. చాలా గ్యాప్‌ ఇచ్చింది. ఇటీవల `పిట్టకథలు` అనే ఓటీటీ మూవీ చేసింది. మళ్లీ తమిళంకే పరిమితమయ్యిందీ మలయాళ సోయగం. ప్రస్తుతం మూడు సినిమాలతో బిజీగా ఉంది అమలా పాల్‌.  
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories