డైరెక్టర్ ముఖం మీదే డోర్ వేసిన అక్కినేని అమల, అంత కోపం ఎందుకు ? నాగార్జున ఎలా కూల్ చేశారంటే

నాగార్జున, అమల 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమల, నాగార్జున లకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. తన కొడుకుని అమల ప్రాణం కంటే మిన్నగా ప్రేమగా చూసుకుంటుంది. 

Amala Akkineni shocking behaviour with director in telugu dtr

నాగార్జున, అమల 1992లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అమల, నాగార్జున లకు అఖిల్ జన్మించిన సంగతి తెలిసిందే. తన కొడుకుని అమల ప్రాణం కంటే మిన్నగా ప్రేమగా చూసుకుంటుంది. అలాంటి అఖిల్ కష్టపడేలా ఏమైనా జరిగితే అమలకి పట్టరాని కోపం వస్తుందట. అఖిల్ హీరోగా వివి వినాయక్ దర్శకత్వంలో 'అఖిల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. 

కానీ 1995 లో అఖిల్ వెండితెరపై కనిపించారు. సిసింద్రీ చిత్రంలో అఖిల్ బుడి బుడి అడుగులు కూడా రాని పిల్లాడిలా కనిపించారు. అయితే ఈ చిత్ర దర్శకుడు శివనాగేశ్వర రావుకి, అమలకి మధ్య ఊహించని సంఘటన ఎదురైంది. సిసింద్రీ చిత్రంలో చిన్న పిల్లాడి పాత్ర కోసం శివనాగేశ్వర రావు అఖిల్ అయితే బావుంటుంది అని అనుకున్నారు. నాగార్జునని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్లారు. 


ఆ సమయంలో నాగార్జున ఇంట్లో లేరట. అమల ఉన్నారు. సిసింద్రీ చిత్రం కోసం అఖిల్ కావాలని ఆయన అడగగానే అమలకి పట్టరాని కోపం వచ్చింది. ముందు బయటకి వెళ్ళండి అని చెప్పి ఆయన ముఖం మీదే డోర్ వేసినట్లు అమల స్వయంగా చెప్పారు. అఖిల్ ని అంత చిన్న వయసులో సినిమా కోసం ఇవ్వడానికి నాకు భయం వేసింది. అందుకే అలా చేశాను అని అమల పేర్కొంది. 

కానీ నాగార్జున అమలని కూల్ చేసి ఒక విషయం చెప్పి ఒప్పించారట. అదే సమయంలో అమల బ్లూ క్రాస్ సంస్థలో భాగంగా ఉన్నారు. ఆ సంస్థకి ఫండింగ్ అవసరం. ఆ డబ్బు నేను ఇవ్వలేక కాదు.. కానీ అఖిల్ నటించిన తొలి చిత్రంతో వచ్చిన డబ్బుని ఆ సంస్థకి ఇస్తే ఎలా ఉంటుంది ? ఆ దీవెనలు అఖిల్ కి ఉంటాయి కదా అని అమలకి చెప్పను. అప్పుడు అమల వెంటనే ఒప్పుకుంది అని నాగార్జున అన్నారు. 

Latest Videos

vuukle one pixel image
click me!