మళ్లీ పెళ్లి చేసుకుంటానో లేదో, చేసుకున్నవి నిలబెట్టుకోలేకపోయా: అమీర్ ఖాన్
ఒంటరిగా బతకడం చాలా కష్టం అంటున్నారు అమీర్ ఖాన్. మూడో పెళ్లికి ఏమైనా హింట్ ఇస్తున్నారా?
ఒంటరిగా బతకడం చాలా కష్టం అంటున్నారు అమీర్ ఖాన్. మూడో పెళ్లికి ఏమైనా హింట్ ఇస్తున్నారా?
బాలీవుడ్ అద్భుత నటుడు అమీర్ ఖాన్ ఎన్ని సూపర్ హిట్ సినిమాలు తీసినా, కోట్లు సంపాదించినా వ్యక్తిగత జీవితం బిగ్ ఫ్లాప్ అని చెప్పొచ్చు.
ఇలా పెళ్లి జీవితం గురించి సలహా ఇవ్వండి లేదా ప్రస్తుత సింగిల్ లైఫ్ ఎలా ఉంది అని రియా చక్రవర్తి ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు వచ్చిన సమాధానం నిజంగా షాకింగ్.
నాకు ఇప్పుడు 59 ఏళ్లు. నేను మళ్లీ పెళ్లి చేసుకుంటానో లేదో తెలీదు. పెళ్లి విషయం, దానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంది. ప్రస్తుతం నేను చాలా బంధాలతో జీవిస్తున్నాను.
కుటుంబం, పిల్లలతో కలిసిపోయాను. రెండు పెళ్లిళ్లు చేసుకున్నా వాటిని కొనసాగించడంలో లేదా నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాను. అందుకే పెళ్లి గురించి సలహాలు నా దగ్గర అడగకండి.
ఒంటరిగా జీవితం గడపడం నా వల్ల కాదు. నేను ఒంటరిని కాదు, నాకు తోడు కావాలి. నా మాజీ భార్యలైన రీనా, కిరణ్‌లకు దగ్గరగా ఉన్నాను. మేమంతా ఒకే కుటుంబంలా ఉన్నామని అమీర్ ఖాన్ చెప్పారు.
అమీర్ ఖాన్ మాటలు వింటే మూడో పెళ్లి చేసుకునే ఆలోచన ఉందేమో అనిపిస్తుంది. లేదంటే అదే మాజీ భార్య దగ్గరికి వెళ్లొచ్చు అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.
21 ఏళ్ల వయసులో అమీర్ ఖాన్ రహస్యంగా రీనా దత్తాను పెళ్లి చేసుకున్నాడు. మనస్పర్థల వల్ల దూరమయ్యాక మరో పెళ్లి ఆలోచన చేశాడు.
రణ్ రాజ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ జంటకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. మొదటి భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇక్కడ కూడా వ్యక్తిగత కారణాల వల్ల విడాకులు తీసుకుని సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు.