హీరో నాగార్జునకి చాలా మంది హీరోయిన్లతో ఎఫైర్లు వినిపించాయి. దీనిపై ఆయన భార్య, నటి అమల స్పందించారు. నేనేమీ నాగార్జునని వెంటపడి పట్టుకోలేదంటూ హాట్ కామెంట్ చేసింది.
నాగార్జున, అమల ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అంతకు ముందే నాగార్జునకి పెళ్లి అయ్యింది. హీరో వెంకటేష్ సిస్టర్ లక్ష్మీని ఆయన వివాహం చేసుకున్నారు. వీరికి నాగ చైతన్య జన్మించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే విడిపోయారు. అనంతరం అమలతో ప్రేమలో పడ్డారు నాగ్. వీరిద్దరు కలిసి `కిరాయి దాదా`, `చినబాబు`, `శివ`, `నిర్ణయం` వంటి చిత్రాల్లో నటించారు. వరుసగా కలిసి సినిమాలు చేయడంతో ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. వీరికి కొడుకు అఖిల్ జన్మించారు.
దాదాపు 34ఏళ్లుగా వైవాహిక జీవితం గడుపుతున్నారు. అయితే నాగార్జునకి సంబంధించిన తరచూ రూమర్లు వస్తుంటాయి. హీరోయిన్లతో ఎఫైర్, ఆ హీరోయిన్‌తో పబ్‌కి వెళ్లాడు, ఈ హీరోయిన్‌తో ఫారెన్ వెళ్లారనే వార్తలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా టబుతో రిలేషన్ అని చాలా కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఓ సందర్భంలో దీనిపై నాగార్జున స్పందించారు. టబు బెస్ట్ ఫ్రెండ్ అని, అమలకి కూడా తెలుసు అని తెలిపారు. ఈ క్రమంలో అమల కూడా రియాక్ట్ అయ్యింది. హీరోయిన్లతో నాగార్జున తిరుగుతున్నారనే వార్తలపై ఆమె స్పందించింది.
35
నాగ్ రూమర్లపై అమల క్రేజీ కామెంట్
నాగార్జున మన్మథుడు, ఆయన్ని అమ్మాయిలు, హీరోయిన్లు ఇష్టపడుతుంటారు. ఎప్పుడైనా జెలసీగా ఫీలయ్యారా? అనే ప్రశ్నకి అమల రియాక్ట్ అయ్యింది. నేనేమీ ఆయన్ని వెంటపడి పట్టుకోలేదని తెలిపింది. ఇద్దరం ప్రేమించుకుని ఒక అండర్ స్టాండింగ్‌తో మ్యారేజ్ చేసుకున్నామని, ఆయనపై తనకు నమ్మకం ఉందని, తాను అనుమానించను అని వెల్లడించారు అమల. ఈ సందర్భంగా ఆమెనే రెండు సంఘటనలు పంచుకున్నారు. నాగార్జునపై వచ్చిన రూమర్స్ ని ఆమె వెల్లడించారు.
ఒకసారి నాగార్జున పబ్‌కి వెళ్లాడట. ఓ హీరోయిన్ తో నాగ్ పబ్‌కి వెళ్లాడని ఒక జర్నలిస్ట్ వార్త రాశాడట. ఇలా మ్యారేజ్ అయినా, మరో హీరోయిన్‌తో పబ్‌కి వెళ్లినట్టు రాయడంతో అది చర్చనీయాంశం అయ్యింది. అయితే ఆ వార్త చదివి అమల నవ్వుకుందట. కారణం ఏంటంటే ఆ హీరోయిన్ ఎవరో కాదు తనే అట. ఆ టైమ్‌లో నాగ్‌తో పబ్‌లో ఉన్నది తానే అని వెల్లడించారు. అంతేకాదు మరో సంఘటనని కూడా ఆమె వెల్లడించారు. ఓ సారి నాగ్, అమల సింగపూర్ ట్రిప్‌కి వెళ్లారట. ఆ సమయంలో అమల గుడ్డుకొట్టించుకొని ఉందట. సింగపూర్‌లో ఓ తమిళ వ్యక్తి నాగార్జునని చూసి, ఆశ్చర్యపోయాడట. మరో అమ్మాయితో తిరుగుతున్నాడేంటి అని ఆశ్చర్యపోయి, నిలదీశాడట.
55
గట్టిగా పట్టుకొని ఉండలేమంటూ అమల కామెంట్
నాగార్జున మీకు పెళ్లి అయ్యిందనే విషయం తెలుసా? అన్నాడట. ఆమెని కాదని ఇలా తిరగడమేంటి? అని ప్రశ్నించాడట. దీంతో అమల షాక్ అయ్యిందట. ఈమె ఎవరో కాదు, నా భార్య అమలనే సరిగ్గా చూడండి అన్నాడట. అది తన ముందే జరిగిందని, ఇలాంటివి సంఘటనలు చాలా చూశానని, నాగార్జున విషయంలో తనకు అనుమానాలు లేవని తెలిపింది. అంతేకాదు ఎప్పుడూ మనం పట్టుకొని ఉండలేమని, అలా ఉంటే అది ప్రేమనే కాదు అని, అంతేకాదు అలాంటి రిలేషన్ ఎప్పుడూ నిలవదని తెలిపారు అమల. ఒకరిపై ఒకరికి ఉండాల్సిన నమ్మకమే, ప్రేమ, భార్యాభర్తల రిలేషన్ అని వెల్లడించారు. ఆర్కే టాక్ షోలో ఆమె ఈ విషయాన్ని పంచుకున్నారు. ఈ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ అవుతుంది.