అమల అక్కినేని నాగ చైతన్య గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాగ చైతన్య, అఖిల్ లని తాము ఎలా పెంచాము అనే విషయాలు వివరించారు. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
అక్కినేని నాగార్జున, అమల 1992లో వివాహం చేసుకున్నారు. నాగార్జునకి ఇది రెండో వివాహం. అప్పటికే నాగార్జున లక్ష్మి దగ్గుబాటితో విడిపోయి ఉన్నారు. వీరికి నాగ చైతన్య జన్మించారు. అక్కినేని అమల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నాగ చైతన్య, అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
25
నాగ చైతన్య గురించి తెలియదు
నాగార్జునతో నాకు పెళ్లి అయినప్పుడు నాగ చైతన్య చెన్నైలో ఉన్నాడు. నాగ చైతన్య పెరిగింది, చదువుకుంది అంతా చెన్నైలోనే. కాబట్టి ఆ సమయంలో చైతన్యతో నాకు టచ్ మాత్రమే ఉంది. చైతు గురించి అంతగా తెలియదు. చైతన్య కాలేజ్ లో చదువుకోవడం కోసం యంగ్ ఏజ్ లో హైదరాబాద్ కి వచ్చాడు. అప్పుడే చైతు గురించి నాకు పూర్తిగా తెలిసింది.
35
అఖిల్ పై నా ప్రభావం
నాగ చైతన్య అద్భుతమైన అబ్బాయి. తండ్రి మాటకు ఎదురు చెప్పాడు. ఎంతో బాధ్యతతో ఉంటాడు. అస్సలు తప్పు చేయని మనస్తత్వం అని అమల ప్రశంసలు కురిపించింది. ఇక అఖిల్ విషయానికి వస్తే.. అతడు నా కొడుకు కాబట్టి అఖిల్ పై నా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మా తనయులని ఇండిపెండెంట్ గా పెంచాలని నేను, నాగార్జున నిర్ణయించుకున్నాం.
వాళ్ళ డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. అప్పుడే ఫెయిల్యూర్స్ ఎదురైనా వాళ్ళు నేర్చుకోగలుగుతారు. ఈ క్రమంలో చైతు, అఖిల్ కి కొన్ని ఫెయిల్యూర్స్ ఎదురయ్యాయి. కానీ ఈ క్రమంలో వాళ్ళు సొంత నిర్ణయాలు తీసుకోవడంలో అనుభవం పొందారు అని అమల అన్నారు.
55
కోడలు జైనబ్ గురించి..
తన కోడలు, అఖిల్ సతీమణి జైనబ్ గురించి కూడా అమల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైనబ్ ముస్లిం సంప్రదాయాలతో పెరిగినప్పటికీ ఒక హిందూ ఫ్యామిలిలో ఎలా కలసిపోవాలో ఆమెకి బాగా తెలుసు అని అమల అన్నారు. ఇదంతా మా ఇంట్లో కొత్తగా ఉంది, కానీ బావుంది అని అమల అన్నారు.